సమకాలీనం- మనకు స్థిరత్వo ఉందా? – విజయ భాను కోటే

         ప్రపంచం మొత్తం భారతదేశపు మూర్ఖత్వానికి ముక్కున వేలేసుకున్నా, లెస్లీ ఉడ్విన్ అనుకున్నది సాధించింది. మరిగి మరిగి ఉన్న మహిళల రక్తం మళ్ళీ మరిగింది. ఇండియాస్ డాటర్ మళ్ళీ ఒకసారి నివురు గప్పిన నిప్పును మంటల్లోకి నెట్టింది. చర్చ మొదలైన చోటే ఆగిపోవడం మనకు అలవాటే! మనకు టీవీ చానెళ్ళు అన్ని ఎందుకు అని నేను ఎన్నో సార్లు విసుక్కుంటూ ఉంటాను. వీధికో ప్రైవేట్ స్కూలు ఉన్నట్లే, వాటిని పుట్టగొడుగులు అని మనం అన్నట్టే, ఈ చానెళ్ళను ఎందుకు అనమో […]

Read more

ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ వినూత్న ప్రయోగం

        హెచ్ ఐ వి- ఎయిడ్స్ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి. పూర్తిగా నయం కావడానికి సరైన మందులు లేని ఈ వ్యాధి బారిన పడి ఎంత మంది చనిపోతున్నారో! క్యాన్సర్ వచ్చిందంటే ప్రజలు జాలి పడ్తారు. ఇంకే వ్యాధి వచ్చినా కుటుంబ సహకారం, ప్రేమ ఉంటుంది. కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిందనగానే కుటుంబ సభ్యుల సపోర్టు పోతుంది. సమాజం ఏహ్య భావంతో చూస్తుంది. అందుకే ఎయిడ్స్ వ్యాధి వచ్చిందనగానే ఆ వ్యక్తి మొదట భయానికి లోనౌతారు. సమాజం నుండి ఎదురయ్యే […]

Read more

సమకాలీనం-ఉత్తరాఖండ్ పాపం ప్రకృతిదా? మనదా???

ధైర్యం, సమయస్ఫూర్తి, పరిసరాల వినియోగం, సహాయక గుణం, ప్రాణం విలువ తెలిసి ఉండడం, ఇవన్నీ స్త్రీల విషయంలో నిజమని ఉత్తరాఖండ్ లో నిరూపితం అయ్యాయి. మహాతల్లులు…ఎన్ని కథలు…ఎన్ని సాహసాలు…ఎందరి ప్రాణాలనో కాపాడిన స్త్రీల గురించి వింటుంటే మనసు కృతజ్నతతో నిండిపోతుంది. నా……నీ…..మా….అనే ఇరుకుతనాన్ని వదిలి…. నేను….నాది…అనే సంకుచిత తత్వాన్ని మరిచి…. ప్రాణం విలువ పదింతలుగా ఎరిగి, జీవితేఛ్ఛను శ్వాసించిన పరిస్థితులవి! వీలున్నంతవరకూ ప్రకృతి వైపరీత్యంతో పోరాడిన క్షణాలవి! సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ సిద్ధాంతాన్ని నేరుగా…అనుభవపూర్వకంగా తెలుసుకున్న కష్టాలవి! సెల్ఫ్ రియలైజేషన్ స్థాయిని చేరుకుని […]

Read more

సమకాలీనం-మహిళలు ధరించే దుస్తుల విషయంలో ఇంత యాగీ ఎందుకబ్బా?

ఈ మధ్య చాలా మంది, అమ్మాయిలు, మహిళలు, ఆడపిల్లలు ధరించే దుస్తుల గురించి కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నారు. ఇందులో ఆడ, మగ అని తరతమ భేదం లేదు సుమా! అందరూ మాట్లాడుతున్నారు. ఫ్లాంటింగ్ అనే పదాన్ని కూడా బాగానే వాడుతున్నారు. వీరు అలాంటి దుస్తులు ధరించరాదు, ఇలాంటి దుస్తులు ధరించరాదు అంటూ కొన్ని సూచనలిస్తున్నారు. కొందరు బాహాటంగానే కొన్ని రకాల దుస్తులను తిరస్కరించాలని ఆదేశాలిస్తున్నారు. ఈ మధ్య ఒక పేరు మోసిన కంపెనీ తమ ఓరియ్ంటేషన్ శిక్షణలో భాగంగా మహిళా ఉద్యోగులు ధరించాల్సిన/ ధరించకూడని […]

Read more

సమకాలీనం- ఇది తప్ప రాసేందుకేమీ కనిపించడం లేదు!

        ఎటు చూసినా సమకాలీనం అంటూ ఇంకే విషయమూ రాయడానికి కనబడ్డం లేదు. భారత జాతి యావత్తూ నేడు తల దించుకుంటున్న అత్యాచారాల పర్వం తప్ప! వార్తాపత్రికలు తెప్పించుకోకూడదని జనాలు నిర్ణయించేసుకుంటున్నారు. ఉదయాన్నే ఏ భయంకరమైన వార్త చదవాల్సివస్తుందోనని భయం! నేరాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ తో టీవీ చానల్స్ కు తీరిక లేదు! అవి పెడితే, మరీ ఘోరం! రాత్రికి నిద్ర పట్టే దిక్కు ఉండదు. ఫేస్ బుక్ అప్ డేట్స్ అంటే మరీ భయం వేస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా జరిగిన […]

Read more

సమకాలీనం – వివాహ బంధం

           కొండపల్లి కోటేశ్వరమ్మగారి రచన నిర్జన వారధి చదివినా, అన్నపూర్ణాదేవి రచన ఏన్ అన్ హర్డ్ మెలొడీ చదివినా, నటి సారిక జీవితాన్ని చూసినా, మా పై ఇంటి పనిమనిషి జీవితం గురించి విన్నా….. ఏవీ వేరు కాదు. కమిట్మెంట్ నుండి విడదీయబడ్డ జీవితాలవి! సోషల్ కమిట్మెంట్ అంటే వివాహం. దానితో ముడిపడ్డ అంశాలు బోలెడు. సాంఘిక చట్రాన్ని పటిష్టంగా ఉంచుతుందని భావించి ప్రపంచ వ్యాప్తంగా పట్టం కట్టబడిన వివాహ వ్యవస్థ నేడు బీటలు వారిపోతోంది.              జంతువులకు మల్లే జంట కట్టడం, సంతతిని […]

Read more

సమకాలీనం-ప్రతిరోజూ నీదే!

కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. కొన్ని క్రొత్త అంకురార్పణలు చేయాల్సిన సమయం కొన్ని ప్రతిధ్వనులను ఇకనైనా బయటపెట్టాల్సిన సమయం కొన్ని సంఘర్షణలను సమాజపరం చేయాల్సిన సమయం కొన్ని పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన సమయం సమానత్వం అడిగితే రాదు తీసుకో…అది నీ హక్కు కాదన్న చోటల్లా ఆ బలాన్ని ధిక్కరించు అహంకారం అణచనిదే ఆగదు పొగరనుకోనీ…కానీ నిన్ను నువ్వు ప్రతిధ్వనించు దురాగతాలను మొగ్గలోనే తుంచు దేశమంటే అందరిదీ! సమాజపు ప్రతి విషయంలో నువ్వుండు! బావిలో కప్పలా ఉండిపోవద్దు! ప్రపంచం నీదే! నీక్కావలసినంతా తీసుకో…. మహిళా […]

Read more

కుటుంబపోషకులు మహిళలే ఐనపుడు వారి రక్షణ???

భారతదేశంలో నానాటికీ మహిళలే పోషిస్తున్న కుటుంబాలు పెరిగిపోతున్నాయట! రెండువేల పదకొండు సెన్సస్ ( జనాభా గణన) వివరాలను ప్రభుత్వం విడతలు విడతలుగా వెలువరిస్తున్న క్రమంలో మొన్న ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల కుటుంబాలు మహిళల రెక్కల ఆధారంగానే పోషించబడ్తున్నాయంట. మన రాష్ట్రంలో ఇలాంటి కుటుంబాలు ముప్ఫై లక్షలట. మరి వీరందరికీ సాయంత్రం ఐదు గంటల వరకే పని గంటలని ప్రభుత్వం ప్రకటించగలదా? అంత ధైర్యమే?! మహిళలు ఒంటరిగా జీవిస్తున్న కుటుంబాలు దేశం మొత్తం మీద నలభైతొమ్మిది లక్షలైతే, […]

Read more

హెచ్చరిక

విను ఈ విషయం నీకు అన్నీ తెలుసు గ్రహాలన్నింటిలో జీవం ఉన్న గ్రహం మనదే నాగరికత గురించి చదివిన కొద్దీ మనమెంత గొప్ప బుద్ధిజీవులమో అర్థమౌతుంది. ఒకప్పుడేమో! నువ్వు బలవంతుడివని నమ్మి, కుటుంబ భారం నువ్వు తీసుకున్నావ్! నాకున్న/నువ్వు నాకున్నవని చూపించిన బలహీనతల వల్ల ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను. ఉన్నది నువ్వు,నేనే! స్త్రీజాతి, పురుష జాతి! నాగరికతకు నా తరపున నమస్కారం ప్రపంచం సాధించిన అభివృద్ధికి నా వందనం ఇపుడు నేను నీతో సమానం! నువ్వు చేసే పనులన్నీ నేనూ చేస్తున్నా నీకు […]

Read more

సమకాలీనం- ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

                    ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబరు ఒకటో తారీఖున జరగబోతోంది. నిత్య జీవిత సమరం చేస్తున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల్లో స్త్రీల జనాభా ఎంత? సగం!    రైల్లో తల పెట్టేసిన స్త్రీలు, నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న స్త్రీలు చాలా మంది. ఒళ్ళు తగలబెట్టుకునే వాళ్ళు, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యలు చేసుకునే వారు చాలామందే! వీళ్ళ మరణాలకు కారణం ఎయిడ్స్! ఈ వ్యాధి సోకిందని తెలిసిన మరుక్షణం చనిపోవడం లేదా ఐనవారికి దూరంగా వెళ్ళిపోవడం మాత్రమే మార్గంగా తలుస్తున్నారు ఇంకా!   లివింగ్ […]

Read more
1 2