ఓయినం

”ఏమైనా ఒక ఆడిపోరి ఎన్క గిట్ల జరగొద్దన్నా” అన్నది అంజమ్మ. ”ఏం జేస్తం మా కిస్మత్తుల గిట్ల జరిగేదుంది జర్గింది మీద దేవుడున్నడు” అని గుడి దిక్కు తిరిగి దండం పెట్టి చంద్రయ్య దిక్కుచూస్తూ, ”ఓరి చెంద్రి జెర మనమందరం మల్లా ఒకసారి పంచాయతీకి కూకోవాలెరా” అని అంటుంటే, ”అన్ని ఫైసలాలు అయిపాయె యింకెందుకు” అన్నాడు ఆశ్చర్యంగా. ”ఏంలే జెర మాట్లాడేదుంది కూకున్నప్పుడు సెప్తగా” అంటుంటే చంద్రయ్య అర్థంకానట్టు చూశాడు కాని సత్తయ్య మాట తీసిపుచ్చలేక ”సరే” అంటూ తలాడించాడు. ”ఇంక జరిగే ఫైసలా […]

Read more

ఓయినం

మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది” అన్నది ఈసడించుకుంటూ ”లేవు లేవంటే యినకుండా మొండిగ కూకుండు యింగ ఏంజేయ్యలే అని నూరు రూపాయి ఇచ్చినా’ అంటూ నీళ్ళు నమిలింది.”ఓ పోరీ గట్లేందుకిచ్చినవే నీకు పైసలు ఎక్వయినయా ఏంది అంటూనే మల్లనీకు ఎప్పుడిస్తన్నడు” అన్నది కోపంగా”పైసలు సేతిల పడంగనే సప్పిడుచెయ్యక పోయిండు” అన్నది. ”సిగ్గుశరము లేనోని లెక్కనే ఉండేందే అయినా నువ్వెట్ల యిస్తవు […]

Read more

ఓయినం

నేను సెయ్యబోతున్నది గూడా గదే జెర నా ఎన్క ఉషారుగుండు ఏడా తేడా రావద్దు పో పోయి రాజుగాని పిల్సుకురా” అన్నాడు. ఎల్లయ్య సేన్లల్లకెని అడ్డంపడిపోయి రాజుని పిల్చుకొచ్చాడు. ”ఏంది పెద్దనాయినా పిల్సినవంటా” అంటూ రాజు వస్తూనే అడిగేసరికి ”ఓరి రాజు మీ కల్లం గియ్యాలనే అయిపోయినట్లుంది” అన్నాడు. ”ఔనే గియ్యాలనే ఒడ్లన్ని యింట్ల ఏసినం ఇగ రేపటినుంచి గడ్డి కట్టుడుంటది” అన్నాడు. ”ఏం లేదురా మా కల్లంల గూడా గియ్యాలనే పనైంది నెల రోజులనుండి పనిసేసి సేసి పెయ్యంతా పులిసినట్లైందిరా గందుకని నువ్వు […]

Read more

ఓయినం

ఎల్లమ్మ పరుగునొస్తున్న తల్లిగోడు విన్న నీలమ్మ ”ఓయ్యో మా అమ్మొచ్చిందే లేయే” అంటూ బిగ్గరగా అరిచి తల్లి దిక్కు చేతులు చాపంగానే ఎల్లమ్మ ఒక్క ఉదుటన ఇంట్లోకి వచ్చి బిడ్డను పట్టుకుని బోరుమన్నది. తల్లిని చూస్తుండగానే నీలమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. పదకొండు పన్నెండయ్యేసరికి చుట్టాలు పక్కాలందరు వచ్చారు. సత్తయ్య వాకిలంతా ఏడ్పులు పెడబొబ్బలతో నిండిపోయింది. పెద్దలందరు ఒక్కదగ్గర చేరి ”ఇంగో ఆళ్ళ పెద్దనాయిన ఉర్లో లేడు నిన్న పొద్దుగాల్ళనే బర్లబారంకి పోయిండట. ఏ వూరికి పోయిండో తెల్వదు గిప్పుడు సావుదినాలు ఎట్ల జేస్తరు […]

Read more