ఊహలు గుసగుసలాడే

సమాజం పై మీ మనసులో మొలకెత్తిన ఊహలను ఆవేదనతో , ఆక్రోశంతో కలం సాక్షిగా అక్షర రూపంలో రూపింప చేసి ఆవిష్కరించినందుకు ములుగు లక్ష్మీ మైథిలి గారికి నా అభినందనలు .ఉన్నతమైన చదువును అభ్యసించి , ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తూ , తమ తల్లి ప్రేమతో “ పుస్తకాభిషేకం చేసిన తీరు హర్షణీయం . తెలుగింటి వాణి /ములుగింటి అలివేణి ‘సత్యవతమ్మ ‘/మాయని మమతల పూబోణి ప్రియమగు పతి హృదయ రాణి /ఆకలి వేళ అన్నపూర్ణవై / అందరినీ చేరదీసిన మహా సాధ్వివై /కోర్కెల […]

Read more

అక్షరాల ‘అగ్నిశిఖ’ లు

      స్త్రీ అంటే శరీరం అని పర్యాయ పదమైన చోట ఎప్పుడైనా ఆమె తనువుపై నిరంతరం దాడులు కొనసాగుతూనే వుంటాయి .పితృస్వామ్య  వ్యవస్థ లో మహిళా అంటే ఒక భోగ్య వస్తువు . ఒక మార్కెట్ సరుకు అని రూడి  అయిన వేళ నగరంలోనైనా అరణ్యం లోనైనా వీధి లోనైనా , ఇంట్లో నైనా , లిప్ట్ లోనైనా స్త్రీల దేహాల మీద దాడి జరుగుతూనే వుంటుంది .                        ఈనాడు సినిమాల్లో , టి .వి ల్లో , నెట్ […]

Read more

ఎనిమిదో అడుగు – కొత్త ధారావాహిక ప్రారంభం !

జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న. చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు. కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా! జవాబు వైపా అన్నది మీమాంస…. మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటుదేలతాయి. కొన్ని జీవితాలు రాలిపోతాయి. అందుకే ముగింపు ప్రారంభమై, ప్రారంభం ముగింపు అయి భయపెడుతుంది.              సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా!  స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం […]

Read more

జీవితేచ్ఛ …

– వనజ వనమాలి ”అమ్మాయి గారు ..ఆమ్మాయి గారు .. రండమ్మా.. నెత్తి మీద తట్ట బరువుగా ఉంది దించడానికి ఓ..చెయ్యి వేయాలి” అంటూ.పిలుస్తుంది.ముసలి అవ్వ. మంచి పుస్తకం చదువుకుంటూ ఉండగా . ఇంతలోనే ఈ ముసలమ్మ వచ్చి చదువుకోనీయకుండా చేసినందుకు వచ్చిన చిరాకును అణుచు కుంటూ బయటకి వచ్చింది..పద్మ అబ్బా..మళ్ళీ వచ్చావా?.. ! వద్దు అంటే ఇప్పుడు ఊరుకోవు కదా! అంది పద్మ. మంచి ఆహారం తల్లీ! రోగం,రొస్టు రాకుండా ఉండాలంటే ఇవే తినాలి..అంటూ..నిండు గంపలో నుండి నాలుగు మొక్క జొన్న పొత్తులు […]

Read more

శిక్ష

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి “ఇంత అచ్చు గుద్దినట్లు ఇన్నిన్ని పోలికలు ఎలా వచ్చేస్తాయోయ్ అంటోంది వదిన.” ఆవిడ కంఠంలో కుతూహలం నా పరధ్యానాన్ని పక్కకు నెట్టేసింది. ఆలోచనలు, అన్నం కలిపి కలుపుతున్న వాణ్ణల్లా ఏమిటో సరిగ్గా అర్థం కాక తల ఎత్తి చూసాను. “చూడు-పాప కూడా సరిగ్గా నీలాగే ఆ బంగాళ దుంప వేపుడులోంచి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఏరి పడేస్తోంది” నేనెప్పుడూ అంత పరీక్షగా చూళ్ళేదు. నిజమే! సరిగ్గా నాలాగే చేస్తోంది అదీను. ‘అదేం అమ్మలూ – అవి తీసేస్తున్నావ్?’ “ఆ వేపుడులో […]

Read more

హలో ..డాక్టర్ !

సుజాత,కాకినాడ డాక్టర్ గారు, నాకు కొత్తగా పెళ్లి అయింది. పిల్లలను కనటానికి ఎంత గేప్ అవసరం? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? * మాతృత్వం ఒక అపురూపమైన అనుభూతి, ఒక మహత్తరమైన భావనకు ఆలంబన, ఒక పవిత్రమైన బాధ్యత, ఒక ఉత్తేజపూరితమైన జీవితథ. స్త్రీ యొక్క మహాద్భుత సృజన శక్తికి, సంరక్షణా సామర్ధ్యానికి ప్రతీక గర్భం.  మానవజాతి కొనసాగింపుకు, స్త్రీల సంపూర్ణ సమర్పణకు సంకేతం గర్భం. అన్ని సమాజాలలోనూ జనుల జీవితాలకు, కలలకు, ఆశలకు, ఆకాంక్షలకు, ఆరోగ్యానికి కేంద్రం కుటుంబం.  ఈ […]

Read more

స్త్రీ యాత్రికులు

నైలునదీ మూలాల అన్వేషణలో ఫ్లారెన్స్‌ బేకర్‌           ఫ్లారెన్స్‌ హంగేరీ దేశానికి చెందిన వనిత. ఆ దేశంలో జరిగిన అంతర్యుద్ధాల వలన చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాటిల్లో ఫ్లారెన్స్‌ వారిది కూడా ఒకటి. బిడ్డలులేని ఒక నర్సు ఫ్లారెన్స్‌ని చేరదీసి పెంచుకొంటుంది. చివరికి ఆ నర్సు అండదండలు కరువైపోయే సరికి ఆమె బానిస వ్యాపారుల చేతికి దొరుకుతుంది. డాన్యూబ్‌ నదీ తీరాన ఉన్న పురాతనమైన ఓట్ట్టోమాన్‌ పట్టణంలో జరుగుతున్న సంతలో ఈ బానిసలందరినీ వేలానికి పెడతారు ముస్లిం వ్యాపారులు. […]

Read more

నువ్వడిగిన నా (నీ) నవల

               ఆమె ముఖచిత్రం పుస్తకంపై రెపరెపలాడుతోంది. నా మనసు కూడా అలాగే రెపరెపలాడుతోంది. డైలమా! వెళ్ళనా? వద్దా? చూడాలని మనసు పీకుతోంది. ఆమెను చూసి చాలా కాలం అయింది. ఒక సంవత్సరం…పూర్తిగా ఒక సంవత్సరం. చిరుగాలి లాంటి ఆమె నవ్వు, సూటిగా గుచ్చుకునే ఆమె చూపు. వంకీల ఆ జుట్టు, ఆమె కేరీ చేసే ఆ పాయిస్….ఓహ్! పూర్తిగా ఆమె మాయలో  పడి మూడేళ్ళు! కవిత్వమంటే ఆమె…..ఆమెలో ప్రవహించే రక్తమే కవిత్వపు రసజ్ఞత సంతరించుకుందేమో! మనసు,శరీరం అంటూ […]

Read more