బోయ్‌ ఫ్రెండ్‌

”అసలు వస్తుందో రాదో!” అని గబగబ నవ్వుతూ వెళ్ళిపోయే కృష్ణకాంతి వంక అలా చూస్తూ వుండిపోయాడు భానుమూర్తి. ఆ రోజు అలా అతి సామాన్యంగా అరున పరిచయం ఇంత గాఢంగా అల్లుకుంటుందనీ, కష్టాలలోనూ, సుఖాలలోనూ ఒకరి కొకరు తోడు అవుతారని అతనుగాని ఆమెగాని అనుకోలేదు. ”అదేమిటి భానూ! ఇల్లు వచ్చేసింది.” అని కృష్ణ గుర్తు చేసేవరకు అతను తన స్మృతుల నుండి బయట పడలేకపోయాడు. స్నేహితురాల్ని వాకిట వరకు దింపి వెనక్కు తిరిగి వెళ్ళబోతున్న భానుతో అంది కృష్ణ- ”లోపలికిరా నిన్న ఎందుకో అమ్మ […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

                                       శ్రీమతి డా . పెళ్లకూరి జయప్రద సోమిరెడ్డి 1975 లో రాసిన ” బాయ్ ఫ్రెండ్” నవల వాస్తవికతలో ఈ తరానికి కూడా అద్దంపడుతుంది . సామాజిక సందేశం ఉన్న ఏ రచన అయినా చదువరులకి అవసరమే కాబట్టి దీనిని విహంగ మహిళా సాహిత్య పత్రికలో పునర్ముదిస్తున్నాం . చదువరులు మీ అభిప్రాయాల్ని పాలుపంచుకుంటూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం […]

Read more

పాపాయి సమాధి దగ్గర

కరుగుతున్న మంచుగడ్డ ఆవిరవుతున్న నీటి బొట్టు మానస నైరూప్య వర్ణచిత్రాలు రేపు ఉదయించే సుకుమార సుమాలు అవిచ్చిన్న ప్రతి ఖడ్గంతో ప్రకటించిన అవిరళ  యుద్ధం ఇది ! లింగ నిర్ధారణ పరీక్షల్లో అంతర్దానమౌతున్న ఆడపిండాల చిరునామాలను లెక్కిస్తున్నారా! వైద్య శిఖామణుల వృత్తి నైపుణ్యానికి చుట్టాలుగా మారిన చట్టాలు పాడే అంధ సంగీతాన్ని వింటున్నారా! రిపోర్టులు , రహస్య సంకేతాలతో స్కానింగ్ సెంటర్ల సేవా హంతకులపై నిప్పుకన్ను తెరవకపోవటం ఎవరి  నేరం ? సెక్స్ సెలక్షన్  ప్రజా విధానమైతే సెన్సె క్స్ గుహలోకి  ఓసారి  తొంగి […]

Read more

అతి చక్కటి వృత్తి

                    ఈ విశాల  ప్రపంచంలో ఎన్ రికొజోనా ఎవరు?అన్నిటికి మించి అతనొక కవి.కవి గారి హృదయం అందరికన్నా శక్తివంతమయిన కారుణ్యంతో నిండి ఉంటుంది.  తన తల్లికి క్రిస్మస్  శుభాకంక్షలు తెలిపేందుకు అతనో కవిత రాశాడు. దానితో ఇంటిల్లిపాదీ   మొత్తానికీ ముద్దుల,గారాబాల పిల్లాడయిపోయాడు.అతి ప్రేమ వల్ల అతనిలో బాల్యపు చిలిపి చేష్టలు  అంతరించి పోయాయి. ఎన్ రికొ కవితాత్మక ధోరణి  అతని తల్లిదండ్రులను కదిలించి వేసింది.సహజంగానే బడిలో చాల ఇబ్బందుల పాలయ్యాడు. తనను అభిమానించే ఉపాధ్యాయుల  మీద వ్యంగ్య కవితలు రాసినా,ఇంటికి వచ్చేసరికి పాలిపోయి,రోగిష్టిలా ఉండేవాడు. […]

Read more

ఎనిమిదో అడుగు – కొత్త ధారావాహిక ప్రారంభం !

జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న. చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు. కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా! జవాబు వైపా అన్నది మీమాంస…. మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటుదేలతాయి. కొన్ని జీవితాలు రాలిపోతాయి. అందుకే ముగింపు ప్రారంభమై, ప్రారంభం ముగింపు అయి భయపెడుతుంది.              సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా!  స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం […]

Read more

ఎన్‌కౌంటర్

                  మీడియా మొత్తం హడావిడి.  ప్రశ్నల వర్షం కురిపిస్తూనే వున్నారు.  కెమేరాలు రకరకాల కోణాలలో క్లిక్‌మనిపిస్తున్నాయి. హాస్టలు చుట్టూ జనాలు ఆఫీసరుకు ఊపిరాడటం లేదు.  జర్నలిస్టుగా వెళ్ళిన నేను పరిస్థితిని అవగాహన చేసుకునే క్రమంలో గుండెల్లో నుండి ‘మాతృహృదయం’ అనే చిన్న స్పర్శ తన్నుకొని వచ్చింది.  మూడు నెలల పసిగుడ్డు.  కళ్ళు ఎంత పెద్దగా వున్నాయి.  తలంతా రింగుల జుట్టు.  చూస్తుంటే కడుపులో  దేవినట్లు వుంది.  యిక జనాల గుసగుసలు.  పాపం అప్పుడే ఆయుష్షు తీరింది.  ఏ తల్లికి మనస్సు వచ్చిందో, కన్నీళ్లు రాని […]

Read more