ఒడిసిపట్టిన చిత్రాన్ని నేను!(కవిత) – విజయ భాను కోటే

అక్షరాలు ఎన్ని భావాలను వ్యక్తీకరిస్తాయో నాకు తెలీదు. నేను మాత్రం నీ కళ్ళలో మైమరపును నింపడానికే పుడతాను. ఇంద్రధనుస్సును సవాలు చేస్తూ… వేల వర్ణాలను నాలో నిక్షిప్తం చేసి… నీ మనసులో తిష్ట వేసేలా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. నీ ఒక్క నవ్వును… నీ కంటి నుండి జారే ఒంటరి కన్నీటి చుక్కను… నీ పెదవి విరుపునూ… నువ్వు పెంచే మొక్కకు పూసిన మొదటి పువ్వునూ… ఆకాశంలో ఎగిరే చిన్ని పక్షి రెక్కనూ… ఒక్కలాగే స్వీకరిస్తాను… నీ ప్రపంచంలో ఉన్న ప్రతి అందాన్నీ… నీలో […]

Read more

సమకాలీనం- మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి!- విజయభాను కోటే

 మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి! ఆగష్టు అంటే క్విట్ ఇండియా దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుకొస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న శ్రద్ధ మనం నిజమైన పౌర చైతన్యాన్ని కలిగి ఉండడంలో చూపించం. ఇపుడు నిజానికి ఇంకో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి. స్వచ్చ్ భారత్ ఉద్యమంలో భాగంగా భారత్ లో వేళ్ళూనుకుపోయిన కొన్ని సామాజిక రుగ్మతలను, సమస్యలను బయటకు తరమాల్సిన అవసరం ఉంది. లేదంటే, భవిష్యత్ తరాలు నీతీ, నిజాయితీలు లేని సమాజంలోనే జీవించాల్సి వస్తుంది. స్కాములతో నిండిపోయిన దేశంలో వారు […]

Read more

సమకాలీనం- మనకు స్థిరత్వo ఉందా? – విజయ భాను కోటే

         ప్రపంచం మొత్తం భారతదేశపు మూర్ఖత్వానికి ముక్కున వేలేసుకున్నా, లెస్లీ ఉడ్విన్ అనుకున్నది సాధించింది. మరిగి మరిగి ఉన్న మహిళల రక్తం మళ్ళీ మరిగింది. ఇండియాస్ డాటర్ మళ్ళీ ఒకసారి నివురు గప్పిన నిప్పును మంటల్లోకి నెట్టింది. చర్చ మొదలైన చోటే ఆగిపోవడం మనకు అలవాటే! మనకు టీవీ చానెళ్ళు అన్ని ఎందుకు అని నేను ఎన్నో సార్లు విసుక్కుంటూ ఉంటాను. వీధికో ప్రైవేట్ స్కూలు ఉన్నట్లే, వాటిని పుట్టగొడుగులు అని మనం అన్నట్టే, ఈ చానెళ్ళను ఎందుకు అనమో […]

Read more

ఒక జీనీ కావాలి

“ఒక అల్లాఉద్దీన్ అద్భుతదీపం కావాలి అందులోని జీనీ అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగినదై ఉండాలి. నేను ఎంతటి పని చెప్పినా… ఒక్క ఊపుతో పూర్తి చేసేదై ఉండాలి” “ఇది మానవులందరికీ ఉండే కోరికేలే!” ఒక్క మాటతో నా కోరికను జెనరలైజ్ చేసేసాడు దేవుడు! వాడిన నా ముఖం చూసి జాలి పడ్డాడో ఏమో…. “సరేలే! ఇంతకీ ఏమంత గొప్ప పనులు చెయ్యిస్తావేం జీనీతో” అనడిగాడు పోయిన ఉత్సాహమంతా బూమరాంగ్ లా తిరిగొచ్చేసింది! “మా గొప్ప పనులు చేయిస్తాలే!” అంటూ కళ్ళను గుండ్రంగా తిప్పాను! “అబ్బో కాసిన్ని […]

Read more

మేడే మా కోసమేనా? నిజమా ?

సమాజంలో మా భాగం ఎంతో ఎవరో ఈ మధ్యే చెప్పారు! మాకు ఆశ్చర్యం వేసింది. మేమే ఎక్కువట లోకంలో మా శ్రమ లెక్క కట్టలేనంత గొప్పదట! అయినా…. భరోసా లేని జీవితాలు మావి! పుట్టుకనుండి మరణం వరకూ శ్రమించడమే తెలుసు అయినా.. మా జీవితాలకు అన్వయింపు లేదు శ్వాస నలిగిన వృద్ధ శరీరాలకూ విలువే లేదు పని మాత్రమే మాకు తెలిసింది! ఒక నాడు పనిలోకి రాలేదని ఆ డాక్టరమ్మ జీతం కోసేస్తుంది నాకామెలా రిటైర్మెంట్ ఉందా? ఒక వారం సొంతూరికి పోయొస్తే ఆ […]

Read more

సమకాలీనం – వివాహ బంధం

           కొండపల్లి కోటేశ్వరమ్మగారి రచన నిర్జన వారధి చదివినా, అన్నపూర్ణాదేవి రచన ఏన్ అన్ హర్డ్ మెలొడీ చదివినా, నటి సారిక జీవితాన్ని చూసినా, మా పై ఇంటి పనిమనిషి జీవితం గురించి విన్నా….. ఏవీ వేరు కాదు. కమిట్మెంట్ నుండి విడదీయబడ్డ జీవితాలవి! సోషల్ కమిట్మెంట్ అంటే వివాహం. దానితో ముడిపడ్డ అంశాలు బోలెడు. సాంఘిక చట్రాన్ని పటిష్టంగా ఉంచుతుందని భావించి ప్రపంచ వ్యాప్తంగా పట్టం కట్టబడిన వివాహ వ్యవస్థ నేడు బీటలు వారిపోతోంది.              జంతువులకు మల్లే జంట కట్టడం, సంతతిని […]

Read more

ఇన్స్పిరేషన్!!

           దేన్నో ఒరుసుకుంటూ పోతున్నాను. ఎక్కడో రాపిడికి గురౌతున్నాను. తెలుస్తుంది. అనుభవంలోకి వస్తోంది. కానీ ఏ అంశం దగ్గర ఒక రకమైన దుగ్ధకు గురౌతున్నానో కనిపెట్టలేకపోతున్నాను. భార్యామణి సినిమా అంటుంది. వీకెండ్లో తీసుకెళ్తాను. పిల్లలు షాపింగ్ అంటారు. వెంట వెళ్తాను. బ్యాంకు బాలెన్సు బాగానే ఉంది ప్రస్తుతం. ఉద్యోగంలో టెన్షన్లున్నా, నా తెలివితేటల ముందు అవెంతని? ఈ మధ్య ఏదో తేడా! కొన్నాళ్ళుగా నాలోకి నేను జారిపోయి, ప్రపంచంతో నిమిత్త మాత్ర లావాదేవీలు జరుపుతున్న భావన! ఏం వెతుకుతున్నాను? […]

Read more

ముళ్ళ కిరీటం

నా చేతుల్తో ఒకరి శిరస్సుకు కిరీటం అలంకరిస్తాను మణులో, రత్నాలో పొదిగినది కాదది ముళ్ళ కిరీటం లోపలి నరాలను సైతం బాధించగలదది నేను చూస్తూనే ఉంటాను ధారగా రక్తం కారుతుంది గాయాలపాలైన ఆ మన:శరీరాన్ని చూస్తూనే ఉంటాను నా మనసు కరగదు కఠిన పాషాణంగా ఎలా మారిపోయానో మరి! మాటల తూటాలు నా చిత్తమొచ్చినట్లు పేలుస్తాను అవి ఎదుటి మనిషిని తూట్లు పొడుస్తాయి అవమానిస్తాను నిందను నచ్చినట్లు మోపుతాను పాత కథలన్నీ మర్చిపోతాను అనుబంధాన్ని గాలికొదిలేస్తాను నాకు వర్తమానమే ముఖ్యం మరి! నిజమో కాదో […]

Read more

సమకాలీనం- పార్లమెంటుకో లేఖ రాద్దాం

ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికీ తెలియజేయునదేమనగా….. ఇహ ఆగేది లేదు…ఈ రోజో, రేపో పార్లమెంటు సమావేశాలపై రిట్టో,సిట్టో ఏదొకటి వెయ్యబోతున్నాను నేను. కాదూ కూడదూ అంటే, సమాచార చట్టంతోనైనా కొట్టబోతున్నాను. నాతో ఎవరు రాబోతున్నారోచ్? పార్లమెంటు సమావేశాలా?వాటంత కంపు వేసాలు ఉండనే ఉండవంటున్నారా? ఒకప్పుడు పార్లమెంటు సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారని మొదటిసారి ప్రకటించినపుడు, ఆఫీసులకి సెలవు పెట్టి మరీ టివి ముందు కూచున్నా! రెండురోజులకు జ్వరం, వాంతులు పట్టుకున్నాయని గుర్తొచ్చిందా?  పోపుల డబ్బాలో పదో, వందో తాగుబోతు మొగుడు పట్టుకుపోయి తాగొస్తే పెళ్ళానికెంత ఒళ్ళు మండుతుంది? […]

Read more