గౌతమీగంగ

నరసాపురం రాయపేటలో సుబ్బారావుగారు స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు అప్పటికీ ఆ ఇంటి సమీపంలోనే మిస్సమ్మ ఘోషా ఆసుపత్రి అని ప్రజలు అభిమానంగా పిలుచుకునే అమెరికన్‌ మిషన్‌ ఆసుపత్రి వుండేది. 8వ నెలలో నొప్పులు వచ్చిన సీతను ఆ ఆసుపత్రిలో చేర్చి భర్తకు వర్తమానం చేసారు. సేవాభావంతో ఏర్పడ్డ ఆ ఆసుపత్రిలో వైద్యులూ, నర్సులూ ఎంతో ఆదరంగా అంకితభావంతో సేవలు అందించేవారు. చిన్న వయస్సులో ఈ దేశపు బాలికలు తల్లులు కావడం వారికి వింతగా వుండేది. ఈ దేశీయులు వట్టి అనాగరికులు అనుకొనేవారు వారు. […]

Read more

గౌతమీగంగ

ప॥ వద్దురా మనకొద్దురా పరపాలనంబిక ఒద్దురా హద్దు పద్దూ లేని పన్నుల రుద్దీ పీల్చుచు నుండెరా॥ వద్దు॥ చ॥ 1. కర్ర లాగీ కత్తిలాగి పర్రలను చేసేడురా బుర్ర తిరుగుడు మందుపెట్టి గొఱ్రెలను చేసాడురా ॥ వద్దు। 2. వెండి బంగారముల నెల్ల దండిగా లాగేడురా ముండమోపి కాగితాలకు దండమిడమన్నాడురా ॥ వద్దు॥ 3. మాన ప్రాణములకు మహమ్మారిjైు వున్నాడురా ॥ కావలేవా కన్నతల్లీ గౌరవము కాపాడవా ॥ వద్దు॥ అంటూ ఆంగ్లేయులు దేశీయ విద్యల్ని నాశనం చేసి మనకు పాశ్చాత్య నాగరికత పట్ల […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

    జమాలున్నీసా కుటుంబం యావత్తు అటు కమ్యూనిస్టులు కావటంగాని లేదా కమ్యూనిస్టు సానుభూతిపరుగా మెలగటం వలన, ఆ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రదర్శించిన నిబద్దత మూలంగా కమ్యూనిస్టుపార్టీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వ్యక్తులతో సత్సంబంధాలు కుదిరాయి. ఆ కారణంగా ఆమె చెల్లెలు, తమ్ముళ్లకు ఖైఫీ అజ్మీ లాంటి ప్రముఖ కవుల కుటుంబం నుండి సంబంధాలు వచ్చాయి. ఆ విషయాన్ని కూడా జమాలున్నీసా ఈ విధంగా వివరించారు.     ఖైఫి అజ్మీ నా చిన్న ఆడబిడ్డను పెళ్ళిచేసుకున్నాడు. జకియా(నా చిన్న చెల్లెలు)ను విశ్వామిత్ర ఆదిల్‌కిచ్చి పెళ్ళిచేస్తే బాగుంటుందని […]

Read more

తెలుగు లేఖా సాహిత్యానికి అగ్రగణ్యురాలు ‘ కనుపర్తి వరలక్ష్మమ్మ’ – అరసి

 ISSN 2278 – 4780                    వాస్తవమైన వ్యక్తుల మధ్యగాని , ఊహాజనితమైన వ్యక్తుల మధ్య కాని లేఖ ద్వారా సంభాషణలు జరుగుతాయి . సాహిత్య సంస్కృతమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెప్ప వచ్చు. తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలలో లేఖా సాహిత్యం ఒకటి . మిగిలిన  ప్రక్రియ లాగ విస్తరించక పోయిన వచ్చిన కొద్దిపాటి సాహిత్యం లోనే అనంతమైన విషయాల్ని ఈ సాహిత్యం అందించింది .  ఈ సాహిత్యం రెండు రకాలుగా వచ్చింది .                  ఒకటి కవులు , […]

Read more

రాజమండ్రి పుస్తక మహోత్సవాలు

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ & నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యములో రాజమండ్రి పుస్తక మహోత్సవము నవంబర్ 23 నుండి డిసెంబర్ 2 వ తేది వరకు జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన సందర్భంగా సాహితీ గౌతమి పలు సాహిత్య సభలు , విద్యార్ధినీ, విద్యార్ధులకు పోటిలు నిర్వహించింది. 23 వ తేదిన ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు అధ్యక్షులుగా , వై.స్ .నరసింహారావు వక్తగా ‘కందుకూరి వీరేశలింగం రచనలు , సాహిత్య సేవ, అనే అంశం పైన , 24వ తేదిన ఎస్.పి. […]

Read more

బివివి ప్రసాద్ ‘ఆకాశం’ కు సాహిత్య పురస్కారం

తణుకు పట్టణానికి చెందిన ప్రముఖకవి బివివి ప్రసాద్ రచించిన ‘ఆకాశం’ కవితాసంపుటి కాకినాడలోని ‘ఇస్మాయిల్ మిత్రమండలి ‘ ఇచ్చే ‘ఇస్మాయిల్ కవితాపురస్కారం ‘ 2011 కి  ఎంపికయ్యిందని, ఆ సంస్థ ప్రతినిధి, ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలియచేసారు. కవి బివివి ప్రసాద్ కు ఈ పురస్కారం పేరిట పదివేల రూపాయల నగదు, అభినందన పత్రం, జ్ఞాపక చిహ్నం 4 నవంబరు 2012 , ఆదివారం కాకినాడలో జరిగే ఇస్మాయిల్ స్మారకసభ లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనుభూతివాద కవిగా […]

Read more