జోగిని ( ధారావాహిక ) – వి . శాంతి ప్రబోధ

            ఇగజూడు.. కాళికాదేవోలె మా అమ్మ కాల్ల గజ్జేలు తీసి ఆ పోరగాల్ల మీదకు ఇసిరి కొట్టింది. ” ఎవడ్రా.. నా బిడ్డకు ఆడుమనేది. ముందుగాల్ల మీ ఇంట్ల మీ అవ్వతోని ఆడిపిచ్చి, మీ అక్కతోని ఆడిపిచ్చు, నీ ఆలితోని ఆడిపిచ్చు. గజ్జేకట్టిపిచ్చున్రి. ఆల్లందరాడ్తే అటెనుక నా బిడ్డ గజ్జే గడ్తది. ఆడ్తది” అని అమ్మోరి లెక్క ఉరుమిరిమి జూసింది. మీది మీదికి బోయింది.             నన్ను తోల్కోని ఆటలేదు. పాటలేదని ఇంటికొచ్చింది.             గప్పుడు సూడాలె.. నా సావిరంగా. జనం మొకాల్ల నెత్తురు […]

Read more

సంపాదకీయం

      ఏ దేశ చరిత్ర చూసినా  ఏమున్నది గర్వ కారణం అన్నట్టు డిల్లీ  సంఘటన తరువాత ఒక దాని వెంట మరొకటి జరిగిన పరిణామాలు , మళ్ళీ  మళ్ళీ జరిగినట్టుగా   వచ్చిన రేప్ వార్తలు యావత్ ప్రపంచాన్నే కుదిపేసాయి. యువతుల్ని అత్యాచారం చేయడం,గ్యాంగ్ రేప్ లు చేయడం ఈ రోజు కొత్తేమీ   కాదు. సెప్టెంబర్ 29 2006 లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామం లో జరిగిన దారుణ ఊచ కోత , గ్యాంగ్ రేప్ ల  సంఘటన ఇంకా గుర్తుండే  ఉంటుంది. అసలు అది మరిచి పోయే సంఘటన కాదు. […]

Read more