“లోక నింద”(కవిత ) – డేగల అనితాసూరి.

రాజ్య కాంక్ష సత్య ధర్మ ప్రలోభం కీర్తి కండూతుల తపన వంశ ప్రతిష్టల డాంభికం స్వర్గ వాసపు మోక్ష పిపాస తనకుమాలిన శీల పరీక్ష ప్రజాసంక్షేమపు ముసుగుతో నిర్ధాక్షిణ్యంగా వ్రతం చెడిన పాతివ్రత్యానికి వనవాసపు వెలివేసి వేడుక చూసింది! నట్టనడి సభలో వలువలూడ్వ బోయింది! నగర నడిబొడ్డున వేలమేసి అమ్మింది! పాషాణ హృదయంతో కఠిన శిలగ మార్చింది! ఏమార్చి సబలను చేయగ మూడవ కన్ను కాజేసింది! అయినా .. ప్రశ్నించిన నేరానికి పలుకాకులన్న నిందనుమోస్తూ తరతరాలుగా బలౌతోంది మాత్రం.. పా..పం! పిచ్చి దైన ఈ […]

Read more

ఎక్కడున్నవ్….?(కవిత )- దేవనపల్లి వీణావాణి

ఉత్తరాల మీద ఊహల ముద్రలేసి మెరవాల్సిన లోకాన్ని సిద్ధం చేశాను జతగా అల్లే మొగ్గల మాలై తలపుల తలుపుకు అతుక్కుపోయాను పూచిన నమ్మకాల దారికి సుగంధం పూస్తావని ఆప్తుడా… ఎదురేగాను నువ్వొస్తావని….. కుంగిన నింగి మీద నీ పేరు రాస్తూ ఎగురుతున్న ఇనుప పక్షి… దీపం లేని గుడినే కదా మోసుకొచ్చింది..! ఆగిపోయే ముందు ఆ గుండె నాకెమన్నా చెప్పమన్నదో… కళ్ల మీద నీటి పొర ఏ రూపం దిద్ది ఆరిందో… వీరుడా.. ఎప్పటికీ తెరవని నేలమాళిగలో దూరి ఎవరికి చెప్తున్నవ్ నీ ఊసులు […]

Read more

అలరించిన ఋతుదరహాసం – మాలా కుమార్

విధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.విధ్యకి తండ్రే గురువు , దైవం,తల్లి, స్నేహితురాలు అన్నీ! ఇంటి భాద్యత పది పన్నేండేళ్ళ వయసులోనే స్వీకరించింది.తండ్రి గారాబం వల్ల ప్రతి విషయం లోనూ తానే స్వయం నిర్ణయం చేయటం, అనుకున్నది ఆచరించటం బాగా అలావాటైపోయింది. చదువు అనేది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా పెళ్ళికాక ముందు వరకే వుండాలి. పెళ్ళైనతరువాత ఇక చదువు ప్రసక్తి ఉండకూడదు  అన్నది విద్య బలీయమైన అభిప్రాయం.ఏం.ఏ పాసై పి. హెచ్.డి చేయటం ఆశయం.విద్యకి కాలేజి, యిల్లు,తండ్రి,మ్యూజిక్,పుస్తకాలు ఇదే లోకం.కాని ఒకే ఒక బలహీనత పట్టరాని […]

Read more

ఒక స్వప్నం వచ్చింది

ఆ రాత్రి ఆరుబయట పుచ్చపువ్వు లాంటి వెన్నెలలో చుక్కల పందిరి కింద ఆదమరచి నిదురపోయాను. ఆ కమ్మటి నిద్రలో ఒక తీయని స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో, ఎవరో మెత్తని గొంతుతో “ఓయి! లేవోయి,ఈ మొద్దు నిదుర వదిలి రావోయి! నీకు ఒక సుందర స్వప్న లోకం చూపిస్తాను” అంటూ నన్ను తట్టి లేపుతున్నారు. ఆ స్పర్శ మెత్తగా పువ్వులా వుంది, ఆమె నా చేయి పట్టుకొని తన వెంట తీసుకొని వెళుతోంది ఆమె ఒక వెన్నెల ముద్ద ! ఒక ప్రణయ స్వరూపిణి […]

Read more

నూర్జహాన్

1 ఉన్మాద ప్రణయ ఇతిహాసానికి తొలి పలుకు నేను- మర్మ సౌందర్యానికి చిరునామా నేను- అహంకారం నాకు అలంకారం- 2 జగద్విఖ్యాతమైన  నాప్రేమ కథనంలో ఎవరూ తొంగి చూడలేని అర పేరు బీభత్సం – గాఢ నిదురలోంచి  ఆకస్మికంగా మేల్కొని తప్పనిసరి నడుస్తున్నప్పుడు జలదరిస్తున్న దేహంలా సౌభాగ్యం నౌకను దౌర్భాగ్యం తుఫాను నడిపిస్తుంది 3 అంతః పురం  పూతోట దీపాన్ని ముట్టించిన నేను లోక దివ్వేనైనాను- నే పాడిన భ్రమర గీతాలన్నీ భ్రమలేనా? నా కలలు యవ్వనం శిల్పీకరించిన విలాస మోహాల్ని కోట గోడలు […]

Read more

పసిడి మొగ్గలు

చిద్రమైన  బాల్యాన్ని తలచుకుని చిత్రంగా విలపించే చిన్నారులు పసిడి మొగ్గలుగానే నేల రాలిపోతున్నామని తెల్లటి మల్లెపూల రెక్కల రక్తంతో  తడిసి ఎర్రటి  మందారాలై ఎలుగెత్తి అరుస్తున్నాయి. ఆ అభాగ్యుల ఆర్తనాదాలు ఆరని మంటల్లో కాలిపోతూ కీచకుల వంటి కామాంధులకు  బలిపోయి, బాలికల హాహాకారాల మిన్నంటుతున్నాయి ఆడే పాడే బాల్యం -మసిబారిపోతున్నాయి చిన్నారి లోకంలో విరిసిన మల్లెలు నవ్వుతూ  విరబూయాలనుకొంటే ఏ మృగం పొదలచాటున పొంచి ఉందో తెలియని  అమాయల బేలలు చీకటి  పొదల చాటున రాకాసి కామాంధులకు నలిగిపోతున్నాయి మొగ్గలుగానే నేల రాలిపోతున్నాయి  కాలం […]

Read more

స్ట్రీట్ డ్యాన్సర్

చూపుల్లో  కలిసి  చూపుల్లోనే రాలిపోతున్న  విధ్వంస  స్వప్నాన్ని – కాలం కూడా చాలా చిత్రమైనది, ముళ్ళను  గుచ్చుతూనే సౌందర్య సుగంధ పరిమళాన్ని  వెదజల్లమని ఆజ్ఞాపిస్తోంది  –  నా సుకుమార నిజనైజాన్ని ప్రేమతో స్పర్శించిన  ఏకైక  ఛాయ పేరు అత్యంత  విషాదం – ఆటాడుతున్నంత సేపు నాలోని వింత ఫాంటసి  వేదికంత  రూపమెత్తి నర్తిస్తుంది – తర్వాత,  గ్రీష్మ  భారానికి పండి రాలి నిర్గమ్యంగా  గాలివాటుకు కొట్టుకొని పోతున్న  ఎండుటాకుని – వొట్టి  myth  ని – లోకం  కోసం ఆడుతున్నాను –  లోకం  నన్ను  […]

Read more