ఓయినం

మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది” అన్నది ఈసడించుకుంటూ ”లేవు లేవంటే యినకుండా మొండిగ కూకుండు యింగ ఏంజేయ్యలే అని నూరు రూపాయి ఇచ్చినా’ అంటూ నీళ్ళు నమిలింది.”ఓ పోరీ గట్లేందుకిచ్చినవే నీకు పైసలు ఎక్వయినయా ఏంది అంటూనే మల్లనీకు ఎప్పుడిస్తన్నడు” అన్నది కోపంగా”పైసలు సేతిల పడంగనే సప్పిడుచెయ్యక పోయిండు” అన్నది. ”సిగ్గుశరము లేనోని లెక్కనే ఉండేందే అయినా నువ్వెట్ల యిస్తవు […]

Read more

సంపాదకీయం

                            మే నెల దాటి  పోయినా  రోహిణి కార్తె  ప్రతాపం చూపిస్తూనే ఉంది . వడగాలులకు  ప్రాణాలు అవిసి పోతుంటే ఫ్యాన్ క్రింద కూర్చుని పని చేసుకోవటమే గగనం అయిపోతుంది . ఇంకా  ఎండలో పని చేసే కార్మికుల విషయం ? ఆలోచిస్తేనే మాడు పగిలినట్టుగా ఉంటుంది. ఇంక  చిన్న పిల్లలు కార్మికులుగా మారి పొట్ట నింపుకోవడానికి ఇంత ఎండల్లో పని చేస్తారు అన్న విషయమే మింగుడు పడనిది .                     […]

Read more

నీకేమో చెలగాటం….నాకేమో ప్రాణసంకటం!!!

నాకు ఈ కాగితాల గొడవలు తెలీదు సామీ ఫారాలు నింపుడెట్లో కూడా తెలీదు బాబయ్యా! వయసయ్యిపోయింది వారసులు కాదన్నారు… నడుమొంగిపోయింది నాకు పనివ్వనన్నారు… వృద్ధాప్య పించనంటా… గవర్నమెంటు ఆదుకుంటాదంటా…అంటే…. ఆపసోపాలు పడుతూ నీ కాడికొచ్చాను! నువ్వేమో…విసుక్కుంటావు పోనీలే…బిడ్డకు పనిభారం అనుకున్నాను ఒక సీటు కాడ్నించి ఇంకో సీటు ఒక మడిసి కాడ్నించి ఇంకో మడిసి సత్తువ తగ్గిపోయిన కాళ్ళను పరిగెట్టిస్తున్నారే! ఫలానా కాగితం కావాలంటావు అగ్గగ్గున పారి అట్టుకొచ్చేత్తాను ఎక్కడో ఇంకో అధికారి సంతకం అంటావు ఈడ్చుకుంటా పోయి పెట్టించుకొత్తాను అన్నీ ఒకసారి చెప్పవు […]

Read more

నా జీవన యానంలో…

6 . నా టీచర్స్- స్నేహితులు – కె.వరలక్ష్మి స్కూల్లో నాకు బాగ్యం అని పిలవబడే కూచి సౌభాగ్య లక్ష్మి మొదటి రోజే స్నేహితురాలైంది. తను వెంకన్న పంతులు గారి మనవరాలు. తను సహజంగానే  అపస్వరాలు లేకుండా చక్కగా మాట్లాడేది.నా మాటలు కొన్నింటికి ” అలా మాట్లాడుతున్నావేమిటి” అని నవ్వేది. నేను నాలాగా మాట్లాడటం బాగాలేదనిపించేది. త్వరలోనే నాకు తన స్లాంగ్ వచ్చేసింది. నాన్నని ’నువ్వు’ అనడం మానేసి ’మీరు’అనడం ప్రారంభించేను. ఒకటవ తరగతిలో నేను అక్షరాలు దిద్ది నేర్చుకోలేదు. అలా దిద్దడం చాలా […]

Read more