నా జీవనయానంలో (ఆత్మ కథ) – జీవితం..55 -కె.వరలక్ష్మి

మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక కాకినాడ హాస్పిటల్లో ఉన్నారని అమ్మమ్మ గారింటికి ఉత్తరం వచ్చిందట.ఆరోజుల్లో అదో పద్ధతి, ఏ కబురైనా పెద్దలకి తెలియజేయడం. నేను ఏడుస్తూ కూర్చున్నాను. అమ్మమ్మగారు, మా అత్త గారు నన్ను ట్రెయిన్లో కాకినాడ తీసుకుని వెళ్లారు. నేరుగా మా అమ్మమ్మ గారింటికి జగన్నాధపురం వెళ్లేం. ఆ వెనక కుమ్మరి వీధిలో ఉన్న నర్సింగ్ హోం లో జాయిన్ చేసి మా అమ్మ, పెద్దమావయ్య దగ్గరుంటున్నారట. మానాన్నను చూసి గుర్తుపట్టలేకపోయాను. మీద పడి భోరుమని ఏడ్చేసాను. వారం క్రితం ఒకరోజు భరించలేని […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

జోగిని

సమాచారం అందుకున్న రెండు ఊర్ల పెద్దలూ పోలీస్‌ స్టేషన్‌ చేరారు. పోలీసులకు కావల్సింది అందించారు. పోతడొల్ల వీరయ్య నక్సలైట్‌ అనీ, ఊరి జనంలో చేరి విప్లవ గ్రూపులు చేస్తున్నాడనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనీ, గ్రామ పెద్దల్ని హతమారుస్తానని బెదిరిస్తున్నాడనీ కేసు పెట్టారు. తమకు రక్షణ కావాలని కోరారు. దుమ్ము రేపుకుంటూ పోలీసు జీపులు దళితవాడకు రావడం చూసిన జనం హతాశులయ్యారు. పోలీసులు దిగీదిగడంతోనే ఏడ్రా ఆ వీరయ్య నక్సలైట్‌ లం… అంటూ లాఠీలతో స్వైరవిహారం చేశారు. మగవాళ్ళు చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళూ పరిగెత్తారు నలుగురు యువకుల్ని […]

Read more