జ్ఞాపకాలు – 1- నా ఇంటర్మీడియట్ చదువు – కె. వరలక్ష్మి

అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది . స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది . స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక . మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో గర్ల్స్ హైస్కూల్ ఉండేది . హిందీ పరీక్షలు అక్కడ జరుగుతూండేవి […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ ) జీవితం… – కె. వరలక్ష్మి

మోహన్ ఒకరోజు నన్నుగోదావరి ఒడ్డుకి వెళ్దామని పిల్చుకెళ్ళేడు. అప్పట్లో మెయిన్ బజారు రోడ్డు బారెడు వెడల్పుండేది. పూల మార్కెట్లో రెండువైపులా పేర్చిన పూల పరిమళం కదలనిచ్చేది కాదు. కొంచెం ముందుకెళ్తే ఒకతను మిఠాయికిళ్ళీలు ఘుమఘుమలాడుతుంటే ఒక జింగెడీలో పెట్టుకుని అమ్ముతుండేవాడు. కొనకపోయినా నడుస్తూ నడుస్తూ నేనెప్పుడూ కాస్సేపు నిలబడిపోయే బోట్లు అవి. ఆరోజు దేని మీదా ధ్యాస లేదు నాకు. గోదారి ఒడ్డున కూర్చున్నాక అసలు కబురు చల్లగా చెప్పేడు మోహన్. మొదటిసంవత్సరం నుంచీ డిగ్రీలో తను ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలేదట. […]

Read more

నా జీవనయానంలో …..స్కూల్ ఫైనల్ …3 – కె. వరలక్ష్మి

నా జీవనయానంలో …..స్కూల్ ఫైనల్ …3 నా స్కూల్ ఫైనల్ క్లాసులు మొదలైనప్పటి నుంచీ మా వీధి బడ్డీ మీద ఎవరో పువ్వులు పెట్టడం మొదలుపెట్టేరు . మొదట్లో అవి ఎవరో దిష్టి తీసిన పూలనుకుని మా నాన్నమ్మ తిట్టుకుంటూ ఉదయాన్నే తుడిచి పారేసేది . ఒక గులాబీనో , రెండు చేమంతులో , గుప్పెడు మల్లె పూలో ఉండేవి . చూస్తే అవి తెల్ల వారు ఝామునే రాజమండ్రి నుంచి బుట్టల్తో మా ఊరి సెంటర్ కి అమ్మడానికి వచ్చే తాజా పూలు […]

Read more

వివాహం – కె.వరలక్ష్మి ఆత్మకథ

ఏప్రెల్ నెలలో మా ఫిఫ్త్ ఫాం పరీక్షలు ముగిసాయి .ఆరో తరగతి పరీక్షలు వ్రాసిన మా పెద్ద చెల్లిని కూడా నాతో కూర్చో బెట్టుకుని చదివించేను . చిన్న వాళ్లు ముగ్గురికీ ప్రాధమిక పాఠశాలలో పరీక్షలు ఎప్పుడో అయి పోయేయి . ఆ వారం కొండల్రావు గారు వస్తూ వస్తూ చెస్ బోర్డు , పావులు కొనుక్కొచ్చేరు . నేనదే మొదటి సారి చెస్ చూడడం . అందరికీ ఆ ఆట గురించి వివరించి ఇద్దరిద్దరికి ఒక పోటీ లాగ పెట్టేరు . సగం […]

Read more

వేదుల జీవన ప్రస్థానం – అవధానం- డా|| కె. వి.ఎన్‌.డి.వరప్రసాద్‌

ISSN 2278-4780 ‘గౌతమీ కోకిల’గా ప్రసిద్ధి పొందిన శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రి 20-03-1900 సంవత్సరంలో భద్రాచలం తాలూకాలోని గొల్లగూడెంలో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని ఆయన అక్కడే పూర్తి చేశారు. రెండవ ఫారం వరకూ భద్రాచలంలో చదివారు. తిరుపతి వేంకటకవులు అవధాన ప్రక్రియకు బహుళ ప్రాచుర్యం కల్పించిన కాలమది. వారి అవధాన విద్యామృతాన్ని గ్రోలని తెలుగువాడు ఆ రోజుల్లో లేడనడం అతిశయోక్తి కాదు. పద్యాన్ని పండిత, పామర జనరంజకంగా మార్చి, పామరులనోట కూడా పద్యాలను పాడించిన ఘనత వారిది. అలాగే కొప్పరపు కవులు, రామకృష్ణ కవులతో […]

Read more

తొమ్మిదో తరగతిలో ….4

నా చదువుకి ఆటంకం కలగకుండా చూసిన మా నూజిళ్ల తెలుగు మాస్టారి మాటంటే వేద వాక్యమే నాకు . అప్పట్లో ఆయన చెప్పగా మనసులో నాటుకుపోయిన కొన్ని జీవన సూత్రాలు నా వెన్నంటే ఉన్నాయి ఇప్పటికీ . ‘ ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు ‘ లాంటి గాంధీ సూక్తులు , ‘ అవతలి వాళ్లు మనని బాధించినా మనం తిరిగి వాళ్లకి అపకారం తల పెట్టకూడదు ‘ లాంటి హిత వచనాలు . కాని ఇలాంటి హిత వచనాల […]

Read more

తొమ్మిదో తరగతిలో …..3

గుండ్రటి డబ్బా మిషన్లో కాస్త పంచదార చల్లి అప్పటికప్పుడు తయారు చేసిచ్చే వేడి వేడి పీచు మిఠాయి , మణి కట్టుకి చుట్టే పాకం వాచీలు , సంతలో అమ్మే బెల్లం సేమ్యా పాయసం – అన్నిటికీ దూరం జరగాల్సి వచ్చింది పెద్ద దాన్నై పోయిన భావంతో . డా.జయగారు హాస్పటలు పక్కనే కట్టిన ఇంటికి గృహ ప్రవేశం చేసారు . మా అమ్మ నన్నూ , మా పెద్ద చెల్లినీ పంపించింది . పూజ ముగిసి ఇక పీటల మీంచి లేస్తారనగా హఠాత్తుగా […]

Read more

తెలుగు సాంఘిక నాటక దృక్పధం – ఆంధ్ర నాటక కళాపరిషత్తు – అరసి

ISSN 2278 – 4780   “కావ్యేషు నాటకం రమ్యం”, ‘నాటకాంతం నా సాహిత్యం”అని నాటక ప్రక్రియను ఉత్కృష్ట సృష్టిగా  సంస్కృత పండితులు సంభావించారు. జాతిని జాగృతం చేసేది జాతి జీవనాన్ని   ప్రతిబింబించేది నాటకం.తెలుగు సాహిత్య వనంలో విరిసిన కుసుమాలలో నాటక కుసుమం  తన పరిమాళాలను సుమారు ఒక శతాబ్దం పైనే నాటక ప్రియుల్ని అలరించింది. అన్ని ప్రక్రియలలోను సంస్కృత కవులను అనుసరించిన తెలుగు కవులు ఈ విషయం లో మినహాయింపనే చెప్పాలి. ప్రపంచ సాహిత్య చరిత్ర లో నాటకానికి కొన్ని శతాబ్దాల చరిత్ర […]

Read more
1 2