జ్ఞాపకాలు – 1- నా ఇంటర్మీడియట్ చదువు – కె. వరలక్ష్మి

అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది . స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది . స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక . మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో గర్ల్స్ హైస్కూల్ ఉండేది . హిందీ పరీక్షలు అక్కడ జరుగుతూండేవి […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ )-66 జ్ఞానోదయం– కె. వరలక్ష్మి

“ ఇంకా లైటు వెలుగుతోంది , మేలుకునే ఉన్నట్టున్నారు , పాపాయిని కాస్సేపు ఎత్తుకుని వెళ్దాం “ అని వచ్చేరట . తిన్నగా నేనున్నా చోటికి వచ్చి నా స్థితిని చూసేరు . అప్పటికే నాకు వికారం , స్పృహ కోల్పోయే స్థితి మొదలైంది .” మోహన్రావు ఇంకా రాలేదా ?” అంటూనే సెంటర్లోకి పరుగెత్తి రిక్షా పిల్చుకొచ్చేరు. దారిలో పాపాయిని మా అమ్మకు ఇచ్చేసి నన్ను డా. జయ గారి హాస్పటల్ లో చేర్పించారు . రోజూ రాత్రి భోజనాల తర్వాత శాంత […]

Read more

నా జీవన యానంలో(ఆత్మ కథ ) … కోనసీమలో-60 – కె .వరలక్ష్మి

అక్కడ మా మావగారు పైకి అంటున్నారు. ఇక్కడ ఎవరూ అనడం లేదు. పైగా బాబు మీద అమితమైన ప్రేమను కురిపిస్తున్నారు. అయినా నన్ను ఏదో ఒక గిల్టీ కుదిపేస్తోంది. ‘మీరెలాగూ విజయవాడలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నారు కదా! మనం అక్కడికి వెళ్ళిపోదామండీ’ అన్నాను మోహన్ తో. ‘ప్రస్తుతం ఆ ఉద్యోగం కూడా ఊడిపోయినట్లే’ అన్నాడు మోహన్. ‘అదేంటి?’ అన్నాను నేను ఆశ్చర్యంగా. నా గొంతులోంచి ఆ పదం ఒక కేకలాగా బయటికి వచ్చింది. ‘అయినా బావగారు (విజయభర్త) నాకేం జీతం బత్తెం ఇవ్వడం […]

Read more

నా జీవనయానంలో – జీవితం ….(ఆత్మ కథ)- కె . వరలక్ష్మి

మానాన్నకు జబ్బు చేసాక మోహన్ అసలు చూడలేదు కాబట్టి చెల్లూరు నుంచి జగ్గంపేట వెళ్లేం . అప్పటికి నా దృష్టిలో మోహన్ ఒక ఎన్ సైక్లో పీడియా . అతనికి తెలీని విషయం ఉండదని నా అభిప్రాయం . కనిపించిందల్లా చూపించి ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉండేదాన్ని . రైటో – రాంగో ఠపీమని ఆన్సరు చెప్పేవాడు . ఒకోసారి నేను చిన్న బుచ్చు కునేలాగా కసిరి పడేసే వాడు . మా నాన్నను చూసి ఆ సాయంకాలమే బయలుదేరాం . ఈ లోపల […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ ) జీవితం… – కె. వరలక్ష్మి

మోహన్ ఒకరోజు నన్నుగోదావరి ఒడ్డుకి వెళ్దామని పిల్చుకెళ్ళేడు. అప్పట్లో మెయిన్ బజారు రోడ్డు బారెడు వెడల్పుండేది. పూల మార్కెట్లో రెండువైపులా పేర్చిన పూల పరిమళం కదలనిచ్చేది కాదు. కొంచెం ముందుకెళ్తే ఒకతను మిఠాయికిళ్ళీలు ఘుమఘుమలాడుతుంటే ఒక జింగెడీలో పెట్టుకుని అమ్ముతుండేవాడు. కొనకపోయినా నడుస్తూ నడుస్తూ నేనెప్పుడూ కాస్సేపు నిలబడిపోయే బోట్లు అవి. ఆరోజు దేని మీదా ధ్యాస లేదు నాకు. గోదారి ఒడ్డున కూర్చున్నాక అసలు కబురు చల్లగా చెప్పేడు మోహన్. మొదటిసంవత్సరం నుంచీ డిగ్రీలో తను ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలేదట. […]

Read more

వివాహం – కె.వరలక్ష్మి ఆత్మకథ

ఏప్రెల్ నెలలో మా ఫిఫ్త్ ఫాం పరీక్షలు ముగిసాయి .ఆరో తరగతి పరీక్షలు వ్రాసిన మా పెద్ద చెల్లిని కూడా నాతో కూర్చో బెట్టుకుని చదివించేను . చిన్న వాళ్లు ముగ్గురికీ ప్రాధమిక పాఠశాలలో పరీక్షలు ఎప్పుడో అయి పోయేయి . ఆ వారం కొండల్రావు గారు వస్తూ వస్తూ చెస్ బోర్డు , పావులు కొనుక్కొచ్చేరు . నేనదే మొదటి సారి చెస్ చూడడం . అందరికీ ఆ ఆట గురించి వివరించి ఇద్దరిద్దరికి ఒక పోటీ లాగ పెట్టేరు . సగం […]

Read more