కృష్ణగీత(కాలమ్) –లైసెన్స్ టు రేప్ – కృష్ణ వేణి

Marriage and Morals అన్న పుస్తకంలో బెర్ట్రాండ్ రస్సెల్ ఇలా రాసేరు –“Marriage for a woman is the commonest mode of livelihood, and the total amount of undesired sex endured by women is probably greater than in prostitution” మారిటల్ రేప్ మీద కొన్ని రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకి రసెల్ కోట్ పూర్తిగా అన్వయిస్తుంది. ఫిబ్రవరి 2015 లో ఒక మారిటల్ రేప్ విక్టిమ్ సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. Human Rights […]

Read more

నెలద

కథా పరిచయం : నెలద అంటే అప్పుడే ఉదయించిన నెలవంక .బహుదా నది తీరంలో ఉన్న నందలూరు గ్రామం రాజంపేట తాలుకా కడప జిల్లాల్లో ఉంది . ఇక్కడ ఉన్న శ్రీ సౌమ్య నాద స్వామి ఆలయం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది . చాళుక్యుల కాలంలో నవ నందులు పరిపాలించినండు వల్లే నందలూరు అనే పేరు వచ్చిందని ఒక కథనం ఉంది . ఈ గ్రామానికి సమీపంలో ఉన్న గవి కొండపై కన్పించే బౌద్దారామ స్తూపాలు సాక్ష్యంగా నిలుస్తాయి . గవి కొండ నుంచి […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

               1920 డిసెంబరులో ఆరంభమైన  సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు. ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటీషు ప్రభుత్వాన్ని మన దేశం  నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. స్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల విూద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ అలీఘర్‌ ఖిలాఫత్‌ […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

జాతీయోద్యమకారులచే ‘ అమ్మ’ గా పిలిపించుకున్న ఆబాది బానో బేగం (1852-1924)    జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడా అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీషు ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన  మహిళలు  ఉద్యమకారులలో ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండా, నిర్భయంగా ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆనాటి తొలితరం మహిళలలో శ్రీమతి ఆబాది బానో బేగం అగ్రగణ్యురాలు. ఆమె ఎంతో ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించటం వలన ఆమె నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమకారులు  ఎంతో ప్రేమతో బీబీ అమ్మ అని ఆమెను పిలుచుకున్నారు.                     ఆబాది […]

Read more

సహన శీలి – సాయికిరణ్ కొండేపూడి కవిత

దేశం దేశం నా దేశం, ఎక్కడ నీ సందేశం ? ఆర్పేవా ఈ అగ్ని రణం? చేసేవా నా కలలు నిజం……………… గౌతమ బుద్ధుని జన్మ స్థలం రక్త యజ్ఞమే ప్రతీ దినం… న్యాయ-ధర్మాల నిలయం రాజ కనిమొళి  యడ్యారు గాలుల అవినీతికి సాక్షిగా మిగిలిన వైనం …… కసబ్ కర్కశానికి  బలై, రాజకీయ యువ నేతల, నవనేతల,వృద్ధ నేతల,  మహా నేతల రంగుల జెండాల గారడిలో రోగాల పాలైనావా …. ప్రశాంతమైన రాష్ట్రాలు ముక్కలు, చెక్కలు, తొక్కలై  విడిపోతే, అన్నదమ్ముల  ఆనంద మైత్రి […]

Read more

అభిలాష అక్షర అక్షయ పాత్ర- ‘పుష్పక’ యాత్ర!

‘అభిలాష అక్షర అక్షయ పాత్ర’ కవితా సంకలనం చదువుదామని ముందు మాటలు వ్రాసిన ప్రముఖుల ఛాయాచిత్రాలను చూస్తూ ఒక్కొక్క పేజీ త్రిప్పుతుంటే నా కనిపించింది. ఈ కవయిత్రి సామాన్యు రాలిగా కనబడే మాన్యురాలని. ‘‘సాధించే సత్తా నీలో ఉంది చూసుకో’’ అందులో నన్నాకర్షించిన నిప్పులాంటి నిజాల వరుసలు… నిజంగా ముత్యాల పదాలు. ‘‘నిప్పుతోటి ఆటటాడి ధైర్యం తెచ్చుకో… ఉప్పెన పై చెలరేగే నైజం నేర్చుకో..’’ ‘‘విధాత ఎవ్వడు రా నీ రాత నువ్వే రాసుకుంటే `    ఏ బ్రహ్మ నీగీత మార్చునురా నీచేయి  నీ […]

Read more

భారత స్వాతంత్య్రోద్యమం – ముస్లిం మహిళలు

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి,నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక శతాబ్దంపైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు పోటీపడటం అపూర్వం. లక్షలాదిప్రజానీకం ఒకే నినాదం, ఒకే లక్ష్యం కోసం ఒకే బాటన ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.      ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జన […]

Read more