*”మర చెరలో చిక్కిన బాల్యం”*(కవిత )-డేగల అనితాసూరి

ఎప్పుడూ టచ్ స్క్రీన్ తోనే చేతులు కళ్ళు కట్టిపడేసుకున్న అమ్మా నాన్నలకు ఉప్పెక్కించుకునే తీరికెక్కడిది? జీడిపాకం సీరియళ్ళకై అంగలార్చే అమ్మమ్మలు తాతయ్యలకు పేదరాశిపెద్దమ్మ కథలు చెప్పే ఓపికెక్కడిది? ర్యాంకుల రాట్నానికి మెదళ్ళను కట్టే విలువలు మరిచిన చదువులకు ఫీజుల వసూళ్ళపై తప్ప ఆటలు వ్యక్తిత్వ వికాసాలపై శ్రద్ధెక్కడిది? కుంచించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో ఇరుకు ఇళ్ళలో చేరిపలకరింపులు మరిచిన ఇరుగుపొరుగులతో బాల్యస్నేహాల బంధమెక్కడిది? అందుకే… ఆకర్షణమత్తుతో ఆహ్వానించే అంతర్జాల మాంత్రికుని కబంధహస్తాల్లో పొంచివున్న ముఖపుస్తక సందేశాలు అసాంఘిక మాధ్యమాల ఇనుపసంకెళ్ళు బ్లూవేల్ వంటి భ్రష్ఠుపట్టిన ఆటలకు […]

Read more

మన ఆరోగ్యం మన చేతుల్లో- బ్రేక్ ఫాస్ట్ – అలౌకిక శ్రీ

అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)                                  ఫాస్ట్ ని బ్రేక్ చేశారా ? అదేనండి బ్రేక్ ఫాస్ట్ చేశారా ?  అని అడుగుతున్నాను . మనకు భోజనం మీదున్న శ్రద్ధ బ్రేక్ ఫాస్ట్ మీద ఉండదు . తిన్న తినకపోయినా నష్టం లేదని సర్డుకుపోతాం . ఈ అభిప్రాయం తప్పని తేలింది . చురుగ్గా ఆలోచించాలన్నా , సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా బ్రేక్ […]

Read more

డా.పెళ్ళకూరు జయప్రద ‘‘వీలునామా’’

                తెలుగులో సృజనాత్మక వచన సాహిత్య ప్రక్రియలు అనేకం విస్తరించాయి. అందులో కథకు ప్రాముఖ్యత, ప్రాచుర్యమూ ఉంది. 1910లో మొదలైన ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో ఎన్నో విలక్షణమైన కథలు వెలుగుచూశాయి. కథలో సమాజాన్ని, మానవ జీవితాన్ని అనేక అనుభవాలను అనేక కోణాల నుంచి స్పృశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కథలంటే అందరికీ ఇష్టమే. కథలని ఇష్టపడని వారుండరు. కథలో మానవువుని జీవితాన్ని పరిపూర్ణ్ణంచేసే మనోభావాలు, రాగద్వేషాలు, ఆనందాలు, క్షోభలు ఇవన్నీ కథలో ప్రతిఫలిస్తాయి.                      చాలా మంది గొప్పగొప్ప రచయితలు, రచయిత్రులు కథకు […]

Read more

సమకాలీనం- ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

                    ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబరు ఒకటో తారీఖున జరగబోతోంది. నిత్య జీవిత సమరం చేస్తున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల్లో స్త్రీల జనాభా ఎంత? సగం!    రైల్లో తల పెట్టేసిన స్త్రీలు, నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న స్త్రీలు చాలా మంది. ఒళ్ళు తగలబెట్టుకునే వాళ్ళు, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యలు చేసుకునే వారు చాలామందే! వీళ్ళ మరణాలకు కారణం ఎయిడ్స్! ఈ వ్యాధి సోకిందని తెలిసిన మరుక్షణం చనిపోవడం లేదా ఐనవారికి దూరంగా వెళ్ళిపోవడం మాత్రమే మార్గంగా తలుస్తున్నారు ఇంకా!   లివింగ్ […]

Read more

ఓ..కాంత ..ఏకాంత గాధ..”తన్హాయి”

             “తన్హాయి” నవలని నేను నవలగానే చదివాను.నేను ఆ నవలని చదకముందు.. ఆ నవల పై వచ్చిన సమీక్షలని చదవాలనుకున్నాను కానీ.. సమీక్షలుచదివి నవల చదివితే.. ఆ సమీక్షల ప్రభావం నాలో ఉన్న పఠనా శక్తినిచంపేస్తుందేమో అని అనిపించింది. తన్హాయి నవలని చదవడం మొదలెట్టగానే.. కొంచెం ఆసక్తి. ..ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం అనుకుంటూ ఏక బిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను..మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక […]

Read more