ఇక అంతా నీఇష్టం(కవిత)- గంజాం భ్రమరాంబ

                                                          ఇక అంతా నీ ఇష్టం నీవే తన స్నేహితుడివని నమ్మి జీవితాంతం నీతో స్నేహం చేస్తుంటే.. మగవాడినని అహంకారంతో విర్రవీగుతనం నీకెందుకోయి…. మహిళల గొప్పతనం ఇకనైనా కళ్లు తెరిచి చూడవోయి… కాస్త సానుభూతి చూపితే చాలు నిన్ను హృదయానికి రారాజు ను చేస్తుంది […]

Read more

నా కళ్లతో అమెరికా-42

                                                         ఎల్లోస్టోన్- చివరి భాగం ఎల్లోస్టోన్ యాత్రలో తిరిగి వెనక్కి వచ్చే రోజు వచ్చింది. మేం వెనక్కి వచ్చేటపుడు మేం వెళ్లేటపుడు వెళ్లిన దక్షిణపు దారిలో కాకుండా పశ్చిమపు దారిలో వెళ్లాలని అనుకున్నాం.  కానీ ఆ దారి నోరిస్ మీంచి వెళ్తుంది. ముందు రోజు నాటి […]

Read more

కాలాతీత వ్యక్తులు

రచయిత్రి: డా. పి.శ్రీదేవి కథా రచయిత్రిగా, గేయ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలుగా పేరు తెచ్చుకున్న రచయిత్రి, డా. పి.శ్రీదేవి.అతి పిన్నవయసులోనే కన్ను మూసిన వీరు నవలగా వ్రాసింది,”కాలాతీత వ్యక్తులు” ఒక్కటే.గోరాశాస్త్రి గారి సంపాదకత్వం లో వెలువడిన తెలుగు స్వతంత్ర లో 7-9-1957 నుండి 25-1-1958 వరకు ధారావాహికగా వెలువడి పాఠకుల మన్ననలను అందుకున్నదీ నవల. ఇందిర ఈ నవలకు నాయిక. ఒక విశిష్టమైన స్త్రీ. బలమైన వ్యక్తిత్వము కలది. ఎవరికీ జడవదు.హాయిగా బతకాలి అనుకునే స్త్రీ.తన లక్ష్యం చేరుకోవటం లో ఏది అడ్డువచ్చినా లెక్క చేయదు. పక్కకు తోసేసి […]

Read more

ఎనిమిదో అడుగు – 23

‘‘స్నేహితా! ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్‌ కావాలన్నా చేస్తాను. ఒక్క నీ భర్తలో శుక్రకణాలు తప్ప….’’ అంది డాక్టర్‌. ‘‘సరే! మేడమ్‌! నేను ఆలోచించుకుంటాను. నాకు కొంత టైం కావాలి.’’ అంది స్నేహిత. ‘‘ఓ.కె. ఆల్‌ ద బెస్ట్‌. ఇది నా ఫోన్‌ నెంబర్‌! ఈ విషయంపై ఏదైనా మాట్లాడాలనిపిస్తే కాల్‌ చెయ్యి…’’ అంది డాక్టర్‌. ‘‘ అలాగే’’ అంటూ సెలవు తీసుకుంది స్నేహిత. హాస్పిటల్‌ నుండి ఇంటికెళ్లింది స్నేహిత. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వున్నారు. ఆమె నేరుగా తన గదిలోకి వెళ్లి ఆ […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌

ప్రయాణం మర్నాటి ఉదయానికి నిర్ణయమరుంది. వెళ్ళాల్సిన వాళ్ళు అన్నీ సర్దుకోవడంలో లీనమరుపోయారు. చైతన్య ముఖ్యంగా మరిచిపోనిది కెమెరా. ఆ సంధ్యా సమయంలో చల్లగా వీచే గాలుల మధ్యగా వైజాగ్‌కి కొన్ని మైళ్ళ దూరాన, చింతపల్లి కెళ్ళే కొండ మార్గాన ‘ఎంబాసిడర్‌’ కారు మెత్తగా దూసుకుపోతోంది. దట్టమైన అరణ్యాలు లోయల మధ్యగా అందమైన అమ్మారు నడకలా వయ్యారంగా మెలికలు తిరిగిపోతోంది తారురోడ్డు. డ్రైవరు సీటులో ప్రసాదరావు ఫ్రెండ్‌ డాక్టర్‌ యదునందన్‌, అతని ఒడిలో ప్రసాదరావు, నిర్మలల కలలపంట మురళి కూర్చున్నాడు. ఆడవాళ్ళు ముగ్గురూ వెనక సీట్లో […]

Read more

ఏది పోగొట్టుకోవాలి…?

విడిచిన బాణం నేరుగా వచ్చి నిర్దాక్షిణ్యంగా గుచ్చుకున్నట్లు … గుండెలోతుల్లోంచి చీల్చుకెళ్ళి మనసు పొరల్ని ఛేధించుకొని అతి సున్నితమైనదేదో తునాతునకలైనట్లు …. ఎదలోతుల్లో ఎక్కడో నిర్దయగా నిప్పుల తుంపర కురుస్తున్న భావన. ఒకవైపు ప్రపంచపు భారాన్ని మోసే అట్లాస్‌లా మనిషి … ఇంకోవైపు తీరిగ్గా విశ్రమించేందుకు కృషి చేస్తున్న స్పృహ… ఒకవైపు మానసిక వత్తిడి, ఇంకోవైపు శారీరక ఇబ్బంది. ఏదో అస్పష్టమైన నిస్పృహ నిండిన నడక. బాధల వాగుల ఊటల్లోంచి బాధ్యతల మొసళ్లు మనసును మౌనంగా చుట్టుముట్టినట్లు దారుణమైన హింస. అందుకే అన్పిస్తోంది… జీవితం […]

Read more

సూర్యోదయానంతర కవిత్వం

జీవితంలోని తారతమ్యాలు , గమ్యాలు , మానవ సంబంధాలు , సూర్యోదయా నంతరమే గోచర మావుతుంటాయి . బ్రతుకులోని తడి , మానవత్వాలు అక్కడక్కడ ఒకింత భావుకతా , ఆవేశం , కలిస్తేనే షమీ ఉల్లా “ కవిత్వం అవుతుంది . అతనిది మృదు స్వభావం . మనసులో ఒకటి పైకొకటి వ్యక్తీకరించే మనిషి కాదు . మనసులో ఏముందో నాలుక మీద అదే పలికిస్తాడు . అతని కవిత్వమూ అంతే . ఎప్పుడూ సాహిత్య అధ్యయనం , పరిశోధనల్లో మునిగి తేలే “ష […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌-2

య్ ఆ పని మాత్రం చెయ్యకు కృష్ణా! మా అమ్మకు నేనాఖరి కొడుకుని.” ఆమె నవ్వలేదు. ”నీ కెప్పుడూ వెధవ హాస్యాలే. ఎప్పుడూ నేను నీ దగ్గరనుండి సహాయం పొందడంతోనే సరిపోతోంది. ఎప్పుడైనా నీకు సాయం చెయ్యాలన్నా ఆ అవకాశం ఇవ్వవు నువ్వు నాకు.” ఆమె కంఠంలో మార్పుకు చలించాడు భానుమూర్తి. ”అది కాదు కృష్ణా! నీ దగ్గరనుండి సహాయం తీసుకోవడానికి నాకు మొహమాటమెందుకు చెప్పు? అదీగాక నిన్ను కలుసుకున్నాకే అందమైన జీవితమంటే ఏమిటో తెలిసింది నాకు. అంతకంటే నేను పొందగలిగిన పెద్ద సహాయమేముంటుంది […]

Read more

లలిత గీతాలు – 4

ఏమో ఇది ప్రేమేనా ఎవరికి తెలుసు అవునో కాదో నీ మాటలు వింటుంటే అది మోహనమని అనిపిస్తే ………….. నీతో గడిపే ప్రతి నిమిషం ఎన్ని క్షణాలకొ ఊపిరి అయితే నిద్రా మెళుకువ రెప్పలపై నీ స్వర మాధురి రాజ్యమేలితే పెదవి  కోనపై మనసు ముత్యమై దొర్లిన మాటలు రెక్కలొచ్చిన తూనీగలుగా మనసు చుట్టు మరిమరి మూగితె ఏమో ఇది ప్రేమేనా ఎవరికి తెలుసు అవునో కాదో నీ మాటలు వింటుంటే అది మోహనమని అనిపిస్తే …………….   నిద్ర వంపులో వాలిన రెప్పల […]

Read more

వచ్చాను ఇక చూస్తాను…

ఎవరు నేను…. ఎక్కడ నుండి వచ్చాను… దేని కోసం వచ్చాను… ఏం బావుకుందామని వచ్చాను… ఏ ఆనందం కోసం తపించి వచ్చాను … ఏ సుఖ సంతోషాల సావాసం చేద్దామని వచ్చాను… ఏ దిక్కు మొక్కులను నా దిక్కు చేద్దామని వచ్చాను… ఏదో వచ్చాను… అమ్మ నాన్నల అలంకారంగా వచ్చాను… ఆకలి దప్పుల బాధ తెలుసుకోగ వచ్చాను… బాధల రోదనల దీన గాద కనగా వచ్చాను… వేదన నిర్వేదన నీడను చేరగా వచ్చాను… అనురాగ పీడిత అమాయక నీడగా వచ్చాను… ఆప్యాయతల బంధాల బందీనవ్వగా […]

Read more
1 2