ఇంతే మనం(కవిత )- అభిలాష

పుడుతూ ఏడుస్తాం, చచ్చాక ఏడిపిస్తాం, రెండిటి మధ్యలో నడిచే బతుకులో ఏడవాలి అంటే భయపడి చస్తాం!! ఆ భయంతోనే!! నమ్ముకునో, అమ్ముకునో, తాకట్టు పెట్టుకునో, కొట్టుకునో, పోగొట్టుకునో బతుకులోనే నానా చావు చస్తాం…. చివరికి ఏం పొందామో ఆలోచిస్తే ప్రశ్నకి బదులుకి నడుమ ఊగిసలాడే గబ్బిలంలా వేలాడుతూ వుంటాం…. నవ్వాలి అనుకుంటాం!! నిజానికి నవ్వం, నవ్వాములే అని మభ్య పెట్టుకుంటాం, లేకుంటే మనల్ని మనమే భరించలేం, నవ్వేది ఏదీ శాశ్వతం కాదనే నిజం ఒప్పుకోలేం, నవ్వాలనే పోరాడుతూ వుంటాం, ఆ పోరాటంలో అసలు ఆనందాన్ని […]

Read more

ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

అద్దంలో….

మనల్ని మనం చూసుకోలేని తనం మనది.. అయినా…నేనున్నా..మీ కోసం అంటూ.. అద్దం మనకి మనల్ని చూపిస్తుంది…అచ్చంగా… నిజం…స్నేహం కూడా .. స్వచ్చమైన చెలిమి అద్దమై మనలోని మనల్ని చూపిస్తుంది… చిన్న రాయి తగిలితే…పగిలే అద్దంలా… అపార్ధాల భేదాలు స్నేహాన్ని  విచ్చిన్నం చేస్తాయి… అద్దంలో ప్రతిబింబంలా.. ఒకరిలో..ఒకరిగా మెలిగే చెలిమే.. కలకాలం తరగని కలిమిగా మిగులుతుంది…!! – సుజాత తిమ్మన ““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““`

Read more