బోయ్‌ ఫ్రెండ్‌-5

వీళ్ళ విషయాలేమి పట్టనట్టు భానుమూర్తి, మురళి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ”ఈ చేపలు, మనంత ఎప్పుడవుతాయి అంకుల్‌?” ”అవుతాయి నాన్నా, అవుతాయి. ఈ మారు మనమొచ్చేసరికి మనంత అయిపోతాయి.” తన భావావేశాన్నుండి తప్పించుకోవడానికి అక్కడనుండి లేచి వెళ్ళి బఠానీలు తెచ్చి అందరికీ పంచింది కృష్ణ. ”మీరు ఏ మనసుతో పెట్టారో నాకు పుచ్చు బఠానీలు వచ్చాయి,” ముఖాన్ని వీలైనంత వికారంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు చైతన్య. ఈమారు అతని చూపుల్లో మామూలు చిలిపి తనమే గాని కృష్ణకు చూపిస్తున్న ప్రత్యేకత ఏమి లేకపోవడంతో తేలిగ్గానే తీసుకుంది […]

Read more

సాంఘిక సంక్షేమ సేవ లో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్

గిల్డ్ ఆఫ్ సర్వీస్ ,మద్రాస్ సేవా సదన్ అనే రెండు సేవా సంస్థలను నెలకొల్పి ఆదరణకు నోచుకోని మహిళలకు ,పిల్లలకు సేవలందించి విద్యాభివృద్ధికి విద్యాలయాలను నెలకొల్పి ,నైపుణ్య శిక్షణా సంస్థలేర్పరచి ,స్వయం సమృద్ధికి తోడ్పడిన మహిళా శిరోమణి శ్రీమతి మేరీ క్లబ్ వాలా జాదవ్ .సంపన్న కుటుంబం లో జన్మించినా అదో జగత్ సహోదరులకు సేవలందించి పునీతురాలై భారత ప్రభుత్వం చేత సంక్షేమ సేవకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందిన ఉత్తమ సేవకురాలు మేరీ జాదవ్ . మిసెస్ వాలేర్ అనే ఆమె 1923లో […]

Read more

నర్తన కేళి -8

ఈ నెల నర్తనకేళీలో ‘నాట్య పారిజాత ‘స్వాతి సోమనాథ్ తో ‘అరసి’  ముఖాముఖి ……… *మీ స్వస్థలం ? మాది శ్రీకాకుళం లోని దూసి అగ్రహారం . కాని నేను పుట్టింది బీహార్ , పెరిగింది ,చదివింది అంతా హైదరాబాద్ లోనే . *మీ కుటుంబం గురించి చెప్పండి ? మా నాన్న పేరు సోమనాథ్ ,రైల్వే ఉద్యోగి , అమ్మ పేరు  లక్ష్మి గృహిణి . అన్నయ్య ,నేను . *మీకు నృత్యం పై ఆసక్తి ఏ విధంగా కలిగింది ? మొదటి […]

Read more

తెలుగు సాంఘిక నాటక దృక్పధం – ఆంధ్ర నాటక కళాపరిషత్తు – అరసి

ISSN 2278 – 4780   “కావ్యేషు నాటకం రమ్యం”, ‘నాటకాంతం నా సాహిత్యం”అని నాటక ప్రక్రియను ఉత్కృష్ట సృష్టిగా  సంస్కృత పండితులు సంభావించారు. జాతిని జాగృతం చేసేది జాతి జీవనాన్ని   ప్రతిబింబించేది నాటకం.తెలుగు సాహిత్య వనంలో విరిసిన కుసుమాలలో నాటక కుసుమం  తన పరిమాళాలను సుమారు ఒక శతాబ్దం పైనే నాటక ప్రియుల్ని అలరించింది. అన్ని ప్రక్రియలలోను సంస్కృత కవులను అనుసరించిన తెలుగు కవులు ఈ విషయం లో మినహాయింపనే చెప్పాలి. ప్రపంచ సాహిత్య చరిత్ర లో నాటకానికి కొన్ని శతాబ్దాల చరిత్ర […]

Read more

ప్రాణహితవై ప్రవహించు

అగ్ని ప్రవాహమైన ఓ అంబేద్కరా ఇగ  తెలంగాణా ప్రాణహితవై ప్రవహించు మహొదయా సుజల స్రవంతి గీతమై  ధ్వనించు తెలంగాణా చిరకాల స్వప్నమై ఫలించు తొలకరిలా పులకరింతలు చిలకరించు .. చిన్న రాష్ట్రాలను సమర్ధించిన మహాధినేతవు  నీవు రాజ్యాంగ రూప శిల్పకర్తగా జ్ఞానోన్నత సృజనుడివి నీవు తెలంగాణా ప్రత్యేకతను గుర్తించిన దార్శనిక సాహసికుడివి నీవు .. బోధిసత్వుని ఆధునిక భారత వారసుడా నవ బౌద్ధ  దమ్మ ఆచరణాత్మకుడా నీవుంటే మా కష్టం తీరేది కొండంత అండగా నీ గుండె బలం మాకూ అబ్బేది నీ ఒక చేత […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

               1920 డిసెంబరులో ఆరంభమైన  సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు. ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటీషు ప్రభుత్వాన్ని మన దేశం  నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. స్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల విూద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ అలీఘర్‌ ఖిలాఫత్‌ […]

Read more

సంపాదకీయం

మనసు పుస్తకానికి ముఖమే దర్పణం … మనసులోని భావాలేవో మొఖంమీదే ప్రతిబింబిస్తాయి. అద్దంలో చూసుకుంటే వున్న లోపాలతో సహా ఆ మొఖమే కనిపిస్తుంది కానీ లేని సౌందర్యాన్ని చూపించదు కదా! రాసుకోవటానికి గోడ వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు విషపు గీతలు గీస్తే… ఏమవుతుంది? స్త్రీలపై , విద్యార్దినులపై , దళిత , మైనారిటీ వర్గాల పై చివరికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై కొంతమంది వ్యక్తులు తమ పైత్యాన్నంతా ముఖపుస్తక గోడల మీద కుమ్మరించిన వైనం యువతనీ […]

Read more

అతివలపై అత్యాచారాలు

               ఒక నెలలో పదిహేను మంది అతివలపై అత్యాచారాలు! మన దేశం లో హర్యానా రాష్ట్రం లో ని పరిస్తితి ఇది. ఒక కల్పనాచావ్లా , ఒక నైనా సేహ్వాల్ వంటి ఆణి ముత్యాలను జాతి కి అందించిన రాష్ట్రంలోని మహిళల ప్రస్తుత పరిస్తితి ఇది.11 సంవత్సరాల పాపాయి మొదలుకుని 40 సంవత్సరాల ప్రౌఢ  వరకూ ఎవ్వరినీ వదలలేదు .అందరూ భంగ పడ్డవాళ్ళే .అత్యాచారమంటే కేవలం ఒక స్త్రీ ని పాశ వికంగా ప్రవర్తించి శారీరకంగా లొంగ […]

Read more