మ(మృ)గ ప్రేమ(కవిత ) – భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

నా ఒడిలో తలదాచుకున్నావు, నా కౌగిలిలో నీ చలి కాచుకున్నావు, నా గుసగుసలలో పాలు పంచుకున్నావు, నా మిసమిసలలో నీ ఆనందాన్నిపిండుకున్నావు, నా రుసరుసలలో అనుబంధాన్ని చవి చూసేవు, నా విసవిసలలో వైచిత్ర్యం అభినయించేవు. నాలో నీ స్వర్గాన్ని చూసుకున్నావు, నాఆలోచనలతో ఒక దుర్గాన్ని కట్టుకున్నావు, నా ఊహలలో ఊయలలూగేవు, నా ప్రేమలో మునిగితేలేవు, నా హృదయ సామ్రాజ్యాన్ని రారాజువై ఏలేవు, నన్ను దోచుకోనేంటవరకూ ఇవన్నీ ప్రకటించేవు, ఆ పనైపోయాక జారిపోయావు, అదృశ్యంగా మారిపోయేవు,               […]

Read more

శీలా సుభద్రాదేవి “నా ఆకాశం నాదే “

“నా ఆకాశం నాదే “ కవితా సంపుటి రచన : శీలా సుభద్రాదేవి శీలా సుభద్రాదేవి దాదాపుగా 70 వ దశకం నుంచి కవితలు రాస్తున్నారు . ఎనిమిదికి పైగా కవితా సంపుటాలు , ‘యుద్ధం ఒక గుండె కోతకు’ ఆంగ్ల అనువాదం చేసారు . కవిత్వంతో పాటు రెండు కథా సంపుటాలు కూడా వెలువరించారు . జనవరి 2014 లో ప్రచురించిన ‘నా ఆకాశం నాదే ‘ కవితా సంపుటిలో 34 కవితలున్నాయి . సుభద్రాదేవి సమాజం ,దాని పోకడలు, మానవతా విలువలు […]

Read more

వివాహం – కె.వరలక్ష్మి ఆత్మకథ

ఏప్రెల్ నెలలో మా ఫిఫ్త్ ఫాం పరీక్షలు ముగిసాయి .ఆరో తరగతి పరీక్షలు వ్రాసిన మా పెద్ద చెల్లిని కూడా నాతో కూర్చో బెట్టుకుని చదివించేను . చిన్న వాళ్లు ముగ్గురికీ ప్రాధమిక పాఠశాలలో పరీక్షలు ఎప్పుడో అయి పోయేయి . ఆ వారం కొండల్రావు గారు వస్తూ వస్తూ చెస్ బోర్డు , పావులు కొనుక్కొచ్చేరు . నేనదే మొదటి సారి చెస్ చూడడం . అందరికీ ఆ ఆట గురించి వివరించి ఇద్దరిద్దరికి ఒక పోటీ లాగ పెట్టేరు . సగం […]

Read more

ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

 జననం –ప్రాచుర్యం –వలస    గ్రీకు దేశానికి చెందిన పాటల కవితల రచయిత్రి సఫో .లెస్బొస్స్ దీవిలో క్రీ పూ  630–612లో జన్మించి, క్రీ పూ.570లో మరణించింది .అలేక్సా౦ డ్రియన్లు.తమ’’ నవ రత్న కవుల’’లో సఫో ను చేర్చి గౌరవించారు .ఆమె రాసిన అనంత సాహిత్యం ఆనాటి ప్రజల మెప్పు పొంది ,ఆరాధనీయురాలై నా ,కాలగర్భం లో చాలా భాగం కలిసి పోయింది .మిగిలిన కవిత్వమే చాలు  ఆమె ప్రతిభకు గీటు రాయి గా నిలిచిపోవటానికి .లిడియా కు చెందిన ప్రముఖ కవి ‘’ఆల్యేటీస్ […]

Read more

కుమారసంభవం

రచయిత : మల్లాది వెంకటకృష్ణమూర్తి అనగనగా ఓ వూళ్ళో ఓ అబ్బాయి, ఓ అమ్మాయి వున్నారు.తొలిచూపుల్లోనే ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టి పెళ్ళి చేసుకున్నారు.సంవత్సరం లోగా వాళ్ళ కి మొదటి బిడ్డ పుట్టాడు. తరువాత చాలా మంది. వాళ్ళంతా సంతోషం గా జీవించారు. ఇది మామూలు కథ. కాని ,”కుమారసంభవం” వక అసాధారణమైన కథ.సుకుమార్, వరలక్ష్మిలకి కాని, సుకుమార్, భవానిలకి కాని వివాహము కాలేదు. కాని ముగ్గురి కి కలిసి ఓ బిడ్డ పుట్టాడు. అది ఎలా సంభవం? అంటే ఇలా . . […]

Read more

ఓయినం

మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా ఏంది” అన్నది ఈసడించుకుంటూ ”లేవు లేవంటే యినకుండా మొండిగ కూకుండు యింగ ఏంజేయ్యలే అని నూరు రూపాయి ఇచ్చినా’ అంటూ నీళ్ళు నమిలింది.”ఓ పోరీ గట్లేందుకిచ్చినవే నీకు పైసలు ఎక్వయినయా ఏంది అంటూనే మల్లనీకు ఎప్పుడిస్తన్నడు” అన్నది కోపంగా”పైసలు సేతిల పడంగనే సప్పిడుచెయ్యక పోయిండు” అన్నది. ”సిగ్గుశరము లేనోని లెక్కనే ఉండేందే అయినా నువ్వెట్ల యిస్తవు […]

Read more

లలిత గీతాలు

ఆ నీలి కళ్ళ సంద్రంలో ఎక్కడివా నీలాలు పొడి బారిన నదులా అవి ప్రేమ కధా కావ్యాలు ఎడారిలో ఎండమావి మెరుపు ల్లా ఎప్పటివా వట్టిపోయి వగచే పంటపొలాలు కన్నీరై ప్రవహించే కరుణామృత హృదయం సవరించిన సరిగమలై మది పలికే చిరు గీతం మరపురాని గతం మళ్ళీ వసంతమై తిరిగొస్తుందని ఎన్నాళ్ళీ ఎదురు చూపు ఎద వాకిట తలపు వెనక మబ్బు నలుపు నీడలోనొ మసక వెలుగు తుది మలుపునొ మోమంతా పరచుకున్న మధురమైన దరహాసపు వెన్నెలలా ఆ ఘడియలు ఏక్షణమో ఎదుట నిలిచి […]

Read more

ఎనిమిదో అడుగు – 22

సిరిప్రియ వైపు చూశాడు హేమేంద్ర. .. ఆమె ఆవుపాలతో కడిగిన బంగారు ప్రతిమలా, వెన్నెల శిల్పంలా ముడుచుకొని కూర్చుని వుంది. ఆమె చేతిని మెల్లగా సృశిస్తూ…. ‘‘ ఈ ఊరు, ఈ వాతావరణం, ఈ మానవ సంబంధాలు నాకు నచ్చాయి. కానీ మన పెళ్ళి మిా ఊరిలో చేసి. ఇది మాత్రం ఈ ఊరిలో ఎందుకు చేస్తున్నట్లు…’’ అన్నాడు హేమేంద్ర. అతనికి ఆమెతో మాట్లాడే ఏకాంతం అప్పుడే దొరికింది. ఆమె కాస్త సిగ్గుపడ్తూ ‘‘మా తాతయ్య వంశంలో పుట్టిన ఆడపిల్లలకి ఎక్కడపెళ్లి జరిగినా ఈ […]

Read more

అనిన

                                                          ANINA   Director: Alfredo Soderquit Country: Uruguay, Colombia Language: Spanish with English Subtitles. Duration: 80 minutes Age Group: Above 10 years. ఇతివృత్తం: ఉరుగ్వే నుండి వచ్చిన అత్యంత సృజనాత్మక మైన యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ . సగటు పిల్లల సమస్యలు, చిన్ననాటి వివాదాల్ని పరిశీలిస్తుంది. ఒక పది ఏళ్ల అమ్మాయి తనచుట్టూ ప్రపంచాన్ని తరచి చూడడానికి చేసిన ఒక  ప్ర యత్నం.జీవితాలకు సంబంధించిన కొన్ని నిజాలు పిల్లలు మాత్రమే చెప్పగలరు.మనం ఏముందిలే? అని తెలిగ్గా […]

Read more
1 2 3