సమకాలీనం- మనకు స్థిరత్వo ఉందా? – విజయ భాను కోటే

         ప్రపంచం మొత్తం భారతదేశపు మూర్ఖత్వానికి ముక్కున వేలేసుకున్నా, లెస్లీ ఉడ్విన్ అనుకున్నది సాధించింది. మరిగి మరిగి ఉన్న మహిళల రక్తం మళ్ళీ మరిగింది. ఇండియాస్ డాటర్ మళ్ళీ ఒకసారి నివురు గప్పిన నిప్పును మంటల్లోకి నెట్టింది. చర్చ మొదలైన చోటే ఆగిపోవడం మనకు అలవాటే! మనకు టీవీ చానెళ్ళు అన్ని ఎందుకు అని నేను ఎన్నో సార్లు విసుక్కుంటూ ఉంటాను. వీధికో ప్రైవేట్ స్కూలు ఉన్నట్లే, వాటిని పుట్టగొడుగులు అని మనం అన్నట్టే, ఈ చానెళ్ళను ఎందుకు అనమో […]

Read more

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

                              1-భవిష్య వాణి రచయిత్రి –జోహన్నా  బ్రాంట్             బాల్యం –విద్య –దేశ సేవ: 18-11-1876న దక్షిణాఫ్రికా లో ట్రాన్స్ వాల్  దగ్గర హీల్దేల్ బెర్గ్ లో  జన్మించిన జోహన్నా వాన్ వార్మెలో ఆఫ్రికా జాతీయతను ,దక్షిణాఫ్రికా ప్రచారాన్ని చేస్తూ ,బోయర్ యుద్ధం లో గూఢచారిగా పని చేసిన సాహసురాలు .ఆరోగ్య విషయాలపై వివాదాస్పద రచనలు చేసి ,ప్రాఫేసీ […]

Read more

మట్టిలో మాణిక్యం

కళ్ళలో నుంచి మాటి మాటి కీ  ఊరుతున్న కన్నీటిని చీర  చెంగు తో తుడుచుకుంటోంది శాంభవి.జరిగినది తలుచుకున్న కొద్దీ దు:ఖం  ఆగటం లేదు . ఉక్రోషం వస్తోంది . తను పుట్టగానే  చనిపోయిన  అమ్మ మీద , వదిలేసి వెళ్ళిపోయిన   నాన్న మీద , చివరకు తనను ఈ విధంగా పుట్టించిన దేవుడి మీద అసలు ఈ ప్రపంచం మీదే iపట్టరాని కోపం వస్తోంది .అంతలోనే ఏడుపు ముంచుకు వస్తోంది .అసలు తన తప్పేమివుంది ? తను పుట్టినప్పుడు తన మొహం చూసేందుకే ఇష్టపడలేదట […]

Read more

టగ్ ఆఫ్ వార్

నిజమే, ‘చంప’ మంచి బాంక్ ఉద్యోగం పిల్లలకోసమే వదిలేసింది. అలాగని పెద్ద డబ్బున్న పరిస్థితీ కాదు, కాని ఆడపిల్లలకు తల్లి అవసరం, ప్రతి నిమిషం చూసుకోవలసిన ఆవశ్యకత   ఉందని పించి మానేసింది. ఇంట్లోనే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా చిన్న బోటీక్ తెరిచి తీరిక సమయాల్లో చిన్నపాటి కాలక్షేపాన్ని అలవరచుకుంది. రత్నబాల తలదించుకుంది. “సరే ఇప్పుడైపోయిన వాటికేం గాని జరగవలసిన వాటి గురించి ఆలోచిద్దాం, పిల్లను ఇక్కడ ఉంచి మీరు వెళ్లి ముందు ఆ శంకర్ ని కదిలించి  నయానో భయానో ఏదో ముట్టజెప్పి, ఫోటోలు గట్రా […]

Read more

వెన్నెల కౌగిలి

సంగీతానికి ఇంత శక్తి వుందా ? నాకు తెలియకుండా నా వళ్ళంతా ఉత్సాహమూ, మనసంతా ఉత్తేజంతో నిండిపోయింది.  విసుగ్గా, అలసటగా ఆఫీసుకి సెలవు పెట్టి పడుకున్న వాణ్ణి, తీరా ఇప్పుడు లేచి హుషారుగా ఏమేనా చేసేయ్యాలనిపించేలా నన్ను మార్చేసిన ఈ సంగీతం !! అసలు దీన్ని సంగీతమంటారా ? దాదాపు పది నిమిషాలనుంచి వినిపిస్తోంది – హర్మోనికా మీంచి తెరలు తెరలు గా ఏదో చాలా పాత సినిమా పాట అయి వుండాలి.  ఆ పాట ఏమిటో గుర్తురావడం లేదు. ఇలా మొదటి సారి […]

Read more

అతి చక్కటి వృత్తి

                    ఈ విశాల  ప్రపంచంలో ఎన్ రికొజోనా ఎవరు?అన్నిటికి మించి అతనొక కవి.కవి గారి హృదయం అందరికన్నా శక్తివంతమయిన కారుణ్యంతో నిండి ఉంటుంది.  తన తల్లికి క్రిస్మస్  శుభాకంక్షలు తెలిపేందుకు అతనో కవిత రాశాడు. దానితో ఇంటిల్లిపాదీ   మొత్తానికీ ముద్దుల,గారాబాల పిల్లాడయిపోయాడు.అతి ప్రేమ వల్ల అతనిలో బాల్యపు చిలిపి చేష్టలు  అంతరించి పోయాయి. ఎన్ రికొ కవితాత్మక ధోరణి  అతని తల్లిదండ్రులను కదిలించి వేసింది.సహజంగానే బడిలో చాల ఇబ్బందుల పాలయ్యాడు. తనను అభిమానించే ఉపాధ్యాయుల  మీద వ్యంగ్య కవితలు రాసినా,ఇంటికి వచ్చేసరికి పాలిపోయి,రోగిష్టిలా ఉండేవాడు. […]

Read more

నా కళ్లతో అమెరికా-18

ఏంజిల్ ఐలాండ్  (Angel Island)  ఏంజిల్ ఐలాండ్  శాన్ ప్రాన్ సిస్కో చుట్టు పక్కల ఉన్న అన్ని ద్వీపాలలో కెల్ల పెద్దది. 19 వ శతాబ్దపు ప్రారంభంలో సైనిక  అవసరాలకు మాత్రమే వాడిన ఈ ద్వీపం   ప్రస్తుతం జాతీయ చారిత్రక ప్రదేశం గా ఉంది.          ప్రయాణం: ఏంజిల్ ఐలాండ్ మా ఇంటి  నుంచి నలభై, ఏభై మెళ్ల దూరం లో ఉంది. అక్కడికి వెళ్లడానికి రెండు, మూడు దారులు ఉన్నాయి. ఫెర్రీలు శాన్ ప్రాన్ సిస్కో, టిబ్యురాన్, వాలెహో ల నుంచి ఉన్నాయి. మా […]

Read more

లాటరీ టిక్కెట్

ఈ కధ ఇంతకుముందే విన్నారా?ఫర్లేదు,నేను మళ్ళీ చెపుతాను,ఎందుకంటే, ఇందులో ఒక నీతి ఉంది,దానికంటే ఒకరకమైన మానసిక స్థితిని వివరిస్తుంది.ఇవ్వాళకూడా ఈ కధ ఆసక్తికరంగానే ఉంటుంది.                      పదిహేనేళ్ళక్రితం ఒక నర్తకి,సౌందర్యరసాధిదేవత వీనస్ లా ఉండేది.ఆమెను ‘సీలిటో’అందాం.ఆకాశంలోకి వేలు చూయిస్తూ సీలిటో ‘రంబ’ డాన్సు చేస్తుంటే జనం ఇంకోసారి,ఇంకోసారంటూ అరుస్తూ ఎంతగగ్గోలు పెట్టేవారో!ఒక్కక్షణం ఎలా నవ్వేదంటే,నరకంలో దేవతపడినట్టు.నర్తించేటప్పుడు ఉద్దేశ్యపూర్వకంగానే మనలో కామాన్ని రెచ్చగొట్టి వదిలేది.అరేబియా సీతాకోకచిలుకలా ఆమె ఎప్పుడూ నిప్పుతో ఆడుకునేది,కానీ అగ్నిమాత్రం […]

Read more

పుస్తకం – మా నాలుకలు తెగేసిన చోట….

“స్త్రీలు శూద్రులు వేదాలు చదివితే వారి నాలుకలు తెగ నరకండి..” ఓ మను ధర్మ శాసనం.  “వనితా, విత్తం, పుస్తకం పరహస్తం గతం గతం”.. మరో ఉద్భోధ.. “బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలే తప్ప న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి “. ఓ సామాజిక కట్టుబాటు.వీటి గుట్టు విప్పకుండా ఓ బూటకపు మాయ పొరను కప్పేస్తూ స్త్రీని చదువుల తల్లి సరస్వతిగా చిత్రీకరణ పరిపాటి. జ్ఞానాన్ని తద్వారా ప్రశ్నించే సత్తాను స్త్రీ పొందకుండా  ఉండేందుకు భారత సమాజపు ద్వంద్వనీతికి అద్దం పడుతున్న […]

Read more

ఇన్స్పిరేషన్!!

           దేన్నో ఒరుసుకుంటూ పోతున్నాను. ఎక్కడో రాపిడికి గురౌతున్నాను. తెలుస్తుంది. అనుభవంలోకి వస్తోంది. కానీ ఏ అంశం దగ్గర ఒక రకమైన దుగ్ధకు గురౌతున్నానో కనిపెట్టలేకపోతున్నాను. భార్యామణి సినిమా అంటుంది. వీకెండ్లో తీసుకెళ్తాను. పిల్లలు షాపింగ్ అంటారు. వెంట వెళ్తాను. బ్యాంకు బాలెన్సు బాగానే ఉంది ప్రస్తుతం. ఉద్యోగంలో టెన్షన్లున్నా, నా తెలివితేటల ముందు అవెంతని? ఈ మధ్య ఏదో తేడా! కొన్నాళ్ళుగా నాలోకి నేను జారిపోయి, ప్రపంచంతో నిమిత్త మాత్ర లావాదేవీలు జరుపుతున్న భావన! ఏం వెతుకుతున్నాను? […]

Read more
1 2