కన్యాశుల్కం-పునఃప్రారంభం!!!

“రిష్తే హీ రిష్తే (సంబంధాలే సంబంధాలు.)” మమ్మల్ని కనీసం ఒకసారైనా కలుసుకోండి. ఫలితాలు చూడండి” అన్న ఈ మాటలు గోడలమీదా, రైల్వే పట్టాల పక్కనా రాసుండేవి నా చిన్నప్పుడు. ఈ ఆకట్టుకునే మాటల కిందనే కరోల్ బాగ్ చిరునామా ఒకటి ఉండేది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదిర్చేది (నిజాయితీగా) ఆ చిరునామాకి చెందిన ఒక పెద్దమనిషి. ఆ తరువాత షాదీ.కామ్, భారత్ మాట్రిమొనీ.కామ్ మొదలైనవి చాలా వచ్చేయి. ఇప్పుడు ఇదిగో- తిరిగి కన్యాశుల్కం రోజులు కూడా ప్రారంభం అయినట్టున్నాయి చూస్తే. కట్న నిషేదం 1961 […]

Read more

ఆ’మే’ డే ! (సంపాదకీయం)

సుమారుగా నూట ఇరవైఏడు సంవత్సరాల క్రితం చికాగోలో కార్మిక హక్కుల కోసం దోపిడీ దారులకి వ్యతిరేకంగా శ్రామికులు పోరాడిన రోజున ప్రారంభమైన చైతన్యం , ప్రపంచ కార్మికుల గుండెల్లో చైతన్యాన్ని నింపుతూనే  ఉంది .కార్మిక సమస్యలు , వాదాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం  అయి పోయాయేమో అనిపిస్తాయి. అన్ని దేశాలలోను . అన్ని జాతులలోను కార్మిక వర్గంలో అట్టడుగు స్థాయి ప్రజలే . అయితే కొన్ని కొన్ని సమూహాల్లో స్త్రీ , పురుషుల తేడా లేకుండా తరతరాలుగా కార్మికులుగా మలచబడుతున్నారు . వీరికి […]

Read more

సంపాదకీయం

మనసు పుస్తకానికి ముఖమే దర్పణం … మనసులోని భావాలేవో మొఖంమీదే ప్రతిబింబిస్తాయి. అద్దంలో చూసుకుంటే వున్న లోపాలతో సహా ఆ మొఖమే కనిపిస్తుంది కానీ లేని సౌందర్యాన్ని చూపించదు కదా! రాసుకోవటానికి గోడ వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు విషపు గీతలు గీస్తే… ఏమవుతుంది? స్త్రీలపై , విద్యార్దినులపై , దళిత , మైనారిటీ వర్గాల పై చివరికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై కొంతమంది వ్యక్తులు తమ పైత్యాన్నంతా ముఖపుస్తక గోడల మీద కుమ్మరించిన వైనం యువతనీ […]

Read more

గమనం – గమ్యం

స్త్రీమూర్తిలోని మాతృ హృదయం ఇగిరిపోయిన వేళ డబ్బు కోసం తమ పాపలని అమ్ముకునే తల్లులు మనిషిలోని మానవత్వం మంటగలసి దానవ రూపంలో అభం-శుభం తెలియని పసిపిల్లలపై అరాచకాలు పైసల బేరంలో లాభాలార్జించే అంగడి బొమ్మలుగా మారిపోతున్న అబలలు వరకట్నపు వేధింపులతో. అతివకి అత్తింట్లో మృత్యు వేదనాభరిత లోక సాక్షాత్కారాలు విషపు స్రావాలు  పుక్కిలి పట్టి ప్రేమ పేరిట వంచించే పురుషుల పాలిటబడి సమిధలవుతున్న పడతులు                   పతనమైన మానవత్వపు చివరి అంచున నిలబడి […]

Read more

సమకాలీనం- భారతదేశం స్త్రీలకు భద్రత కరువైన దేశమట!!!

                  కాన్సెన్సుఅల్ రేపో వల్లనే రేప్ లు జరుగుతున్నాయని ఒకాయన బల్ల గుద్ది చెప్తాడు. ఒకామె పాపం స్త్రీలు పురుషులతో కలిసి పని చేయడం, వారితో కలిసిమెలిసి ఉండడం వల్లనే రేప్ లు జరుగుతున్నాయని నొక్కి వక్కాణిస్తుంది. ఆడవాళ్ళకు మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దని, నలభైల్లోపు స్త్రీలసలు షాపింగ్ కు వెళ్లకూడదనీ ఏదేదో కూసేస్తున్నారు నోటికొచ్చినట్లు!                ఇవన్నీ మాట్లాడేవాళ్ళు సగటు ప్రజలనుకుంటే పొరపాటే! హర్యానా […]

Read more