మా నాన్నే విశాల ప్రపంచం (కవిత )- అనిశెట్టి రజిత

మా నాయినమ్మకు మా నాన్న బంగారు కొండ మా తాతయ్యకు మా నాన్న కొండంత అండ మా అమ్మకు మా నాన్న నిండైన కుండ మాకేమో మా నాన్న ప్రపంచం నిండా.. ఎన్ని కతలు  ఎన్ని వింతలు  విడ్డురాలతో హాస్యపు జల్లులు  లోకం తెలిసిన నాన్న చెప్పే విశేషాలూ  విషయాలూ  వింటూనే లోకం పోకడలు తెలుసుకున్నవాళ్ళం.. నాన్నను చూసి మానవ సంస్కారం అలవర్చుకున్నాం నాన్న వల్ల  సమాజాన్ని పరిచయం చేసుకున్నాం ఆడ పిల్లల మైన మేము స్వేచ్ఛగా రెక్కల ల్లార్చి విహంగించాం నాన్న ప్రజాస్వామికత  […]

Read more

నా జీవనయానంలో (ఆత్మకథ ) -స్కూలు ఫైనల్లో – కె వరలక్ష్మి

అల్మరా మూడు అరల్లోనూ పై అరలో నేను సేకరించిన (మా అమ్మ కొన్న) జపాన్ పింగాణీ బొమ్మలు, మట్టితో నేను తయారు చేసినవీ, కొన్నవీ ఉండేవి. రెండో అరలో నా బట్టలు, మూడో అరలో నా పుస్తకాలు ఉండేవి. తాళంచెవి అల్మరా అంచుమీదే ఉండేది. అద్దెకున్నవాళ్ళు మా ఇంట్లో సొంతంలాగే తిరిగేసేవారు. కానీ పెళ్ళికోసమని ఖాళీ చేయించడం వల్ల ఎవరూ లేరు. ఇంట్లో అందరికీ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టే అలవాటు. ఇల్లు చిందరవందరగా ఉంటే మా నాన్నకి నచ్చేది కాదు. నా […]

Read more

వివాహం – కె.వరలక్ష్మి ఆత్మకథ

ఏప్రెల్ నెలలో మా ఫిఫ్త్ ఫాం పరీక్షలు ముగిసాయి .ఆరో తరగతి పరీక్షలు వ్రాసిన మా పెద్ద చెల్లిని కూడా నాతో కూర్చో బెట్టుకుని చదివించేను . చిన్న వాళ్లు ముగ్గురికీ ప్రాధమిక పాఠశాలలో పరీక్షలు ఎప్పుడో అయి పోయేయి . ఆ వారం కొండల్రావు గారు వస్తూ వస్తూ చెస్ బోర్డు , పావులు కొనుక్కొచ్చేరు . నేనదే మొదటి సారి చెస్ చూడడం . అందరికీ ఆ ఆట గురించి వివరించి ఇద్దరిద్దరికి ఒక పోటీ లాగ పెట్టేరు . సగం […]

Read more

ఓ ఆడ బిడ్డ ఆక్రందన

   పుట్టక మునుపే నన్ను వద్దనుకున్న నాన్న పట్టుబట్టి కని పెంచింది మా అమ్మ…పుట్టి ఏడాది పెరిగాక నా పాలు గారేపసి బుగ్గలు ముద్దాడే వారంతా నా వారే అనుకున్నాను..నా కంటే చిన్న వాడు నా తమ్ముడ్ని వదిలి,నన్నే ఎందుకు ఎత్తుకు ముద్దాడాడూ?ఈ గుమాస్తా?అద్దె అడగడానికి వెళ్తే “రేపిస్తాను” అంటూ,భుజం నొక్కి చెప్తాడెందుకు అంకుల్..చెప్పుకొనేందుకు ఎవరూ లేరు..చెప్పటానికి చేత కాదు…ఎక్కడెక్కడో చక్కిలి గిలి పెడుతుంటే,మా మంచి సరదా మామయ్య అనుకున్నా..ఒకడు వెంటపడి  వేధిస్తున్నాడని చెప్పబోతే మరి నాకేమిస్తావని అడిగారు మాస్టరు.. యాసిడ్ నుంచి ఐతే తప్పించుకోగలిగాను కానీ..నా మనసు […]

Read more

మట్టిలో మాణిక్యం

కళ్ళలో నుంచి మాటి మాటి కీ  ఊరుతున్న కన్నీటిని చీర  చెంగు తో తుడుచుకుంటోంది శాంభవి.జరిగినది తలుచుకున్న కొద్దీ దు:ఖం  ఆగటం లేదు . ఉక్రోషం వస్తోంది . తను పుట్టగానే  చనిపోయిన  అమ్మ మీద , వదిలేసి వెళ్ళిపోయిన   నాన్న మీద , చివరకు తనను ఈ విధంగా పుట్టించిన దేవుడి మీద అసలు ఈ ప్రపంచం మీదే iపట్టరాని కోపం వస్తోంది .అంతలోనే ఏడుపు ముంచుకు వస్తోంది .అసలు తన తప్పేమివుంది ? తను పుట్టినప్పుడు తన మొహం చూసేందుకే ఇష్టపడలేదట […]

Read more

ఆడదేఆధారం

  “నాన్నగారండీ! మరండీ పరీక్ష ఫీజ్ కట్టను ఈరోజే చివరిరోజండీ ! ” భయం భయంగా ఒక మూలను నిలబడి అడిగింది వాణి, ఆమె ఏడోక్లాస్ చదువుతోంది  . ” నాన్నగారండీ ! నాకు పెన్ లేక పెన్సిల్ తో రాస్తున్నాననిఎండలోనిల్చోబెడుతున్నారుటీచరమ్మలు. కళ్ళుతిరుగుతున్నాయండీ! రేపట్నుండీ పరీక్షలు !  పెన్ కొంటారాండీ! ?” ప్రమద మాటలు, అవీ భయంగానే  ఒణుకుతున్న గొంతుకతో, అది ఐదోక్లాస్ . ” మరేమోనాన్నారండీ ! నాకు చెప్పుల్లేక కాళ్ళుకాలుతున్నాయండీ ! ఎండలో నడవటం కష్టంగా ఉందండీ!అమ్మేమో నాన్నారొచ్చాక అడుగు ఇట్టే […]

Read more

మా అమ్మమ్మ గారిల్లు

             మా అమ్మమ్మగారిది కాకినాడ ,జగన్నాధపురం. గొల్లపేటలో ఇల్లు . తాటాకిళ్లు ,పెంకుటిళ్లు పోయి డాబా లొచ్చాయి తప్ప ఆ సందు అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది . ఇంటి బైట గేదెలు ,పేడ ,రొచ్చు . కారులో గాని ,ఆటోలో గాని వెళ్తే వీధి చివర దిగిపోయి నడచి వెళ్ళాల్సిందే. ఆ సందు లోంచి రోడ్డు మీదికొచ్చి ఎడం వైపు చూస్తే చారిటీస్ స్కూలు భవనం కనబడుతుండేది . అది హైస్కూలని నా కప్పటికి తెలీదు అలాంటి స్కూల్లో పెద్ద పెద్ద […]

Read more

శిక్ష

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి “ఇంత అచ్చు గుద్దినట్లు ఇన్నిన్ని పోలికలు ఎలా వచ్చేస్తాయోయ్ అంటోంది వదిన.” ఆవిడ కంఠంలో కుతూహలం నా పరధ్యానాన్ని పక్కకు నెట్టేసింది. ఆలోచనలు, అన్నం కలిపి కలుపుతున్న వాణ్ణల్లా ఏమిటో సరిగ్గా అర్థం కాక తల ఎత్తి చూసాను. “చూడు-పాప కూడా సరిగ్గా నీలాగే ఆ బంగాళ దుంప వేపుడులోంచి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఏరి పడేస్తోంది” నేనెప్పుడూ అంత పరీక్షగా చూళ్ళేదు. నిజమే! సరిగ్గా నాలాగే చేస్తోంది అదీను. ‘అదేం అమ్మలూ – అవి తీసేస్తున్నావ్?’ “ఆ వేపుడులో […]

Read more

సుకన్య

”నీవయితే వనజకు ధైర్యం చెబుతావని నిన్ను పిలిపించాం. నీవు దాన్ని ఓదార్చాలి.” వనజ తండ్రి అభ్యర్ధన. ”బాబాయి!  మీరు చెప్పాలా? వనజ పరిస్ధితి అంతా కనుక్కొని నేను ధైర్యం చెబుతానుగా” హామి ఇస్తున్నట్లు అంది సుకన్య. రాత్రి ఎనిమిది గంటలవుతుండగా డాక్టర్‌ మళ్ళీ వనజను పరీక్షించారు ‘అమ్మా’ అని ఒక్కసారి కదిలింది. డాక్టర్‌ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ‘ఆ అమ్మాయి పరిస్ధితి పర్వాలేదు’ అని చెప్పాడు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరిసింది. ఇప్పటి వరకు ఆవార్త కోసం ఎదురు చూచిన వాళ్ళంతా ఎపుడు […]

Read more

నర్తన కేళి-3

ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదటిసారిగా నాట్యంలో యు.జి.సి అందించే జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కి అర్హత సాధించి కూచిపూడి లో పి .హెచ్.డి పట్టా పొందిన అనుపమ కైలాష్ గారితో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి……… *నమస్కారం అమ్మా.*మీ పూర్తి పేరు ? నమస్కారం,అనుపమ కైలాస్ , అమ్మ పేరు గాయిత్రి , నాన్న పేరు రవి ప్రకాష్ *మీ స్వస్థలం ? హైదరాబాద్ *మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది?. మా అమ్మ కథక్ నృత్య కళాకారిణి , వేదాంతం జగన్నాధశర్మ […]

Read more
1 2