ఎనిమిదో అడుగు – 20

ఆలోచిస్తున్నాడు, బహుశా ఏ తండ్రి అయినా తనలాగే ఆలోచిస్తాడేమో! ఎందుకంటే మనిషికి ధనం కూడబెట్టుకోవాలన్న కాంక్ష ఎక్కువైంది. దానితో ఇంటా, బయటా ఘర్షణలు మొదలవుతున్నాయి. హోదా, అధికారం సంపాయించాలని మనిషి మరొక మనిషిని ఉపయోగించుకుంటూ ఎలాంటి దోపిడీకైనా వెనుకాడటం లేదు. దీనివల్లనే మానవ సంబంధాలు కలుషితం అవుతున్నాయి. అందుకే జీవితం నిండా ఇంత సంక్లిష్టమైన అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అనుభవం ఏ తండ్రికీ రాకూడదు. ‘‘ అంతగా ఆలోచిస్తున్నావు దేనికి నాన్నా! ఆ పొలమేమైనా కోట్ల విలువ చేస్తుందా? దాన్ని అమ్మితే సరిగ్గా […]

Read more

గౌతమీ గంగ

రూపాయలు దీస్తే ధనం బాగా అర్జిస్తాడు. అదే విధంగా ఆడపిల్లకు కుంకుమభరిణ తీస్తే ఐదవతనం కలదీ, పూలు తీస్తే అలంకార ప్రియురాలు, బంగారు నగలు తీస్తే ఐశ్వర్యవంతురాలు అవుతుందని నమ్మేవారు. పండ్లు తీస్తే సంతాన వంతురాలు అవుతారని నమ్ముతారు. సీత కుంకుమ బంగారం తీసింది మంచిదే మరి పళ్లు తీయలేదే పిల్లలు కలుగుతారా? అందరి మదిలోనూ ఇదో సందేహం అయింది. వీరికి హారతి ఇచ్చి పీటల మీద నుంచి లేవతీసాక రత్నాన్ని, సత్యాన్ని పునస్సంధానం పీటల మీద కూర్చోబెట్టారు.     ఔపోసన మంత్రాలూ, హోమాలూ […]

Read more

ఓ… వనితా….!

ఓ వనితా …. నిశీధి యేనా నీ భవిత ….! ఆదిశక్తి అంశ అంటారే మరి అంగట్లో అమ్ముడెందుకు అవుతున్నావ్ ….? అండపిండ బ్రహ్మాండాలు నీనుండే ఉద్భవించాయంటారే మరి సంతలో సరుకు ఎందుకు అవుతున్నావ్ ….? తెగించు …. తెగించు …. ఈ దాస్య శృంఖలాల గోడలను బ్రద్దలుకొట్టు కల్కి కోసం ఎదురు చూస్తూ వుంటావా ….! నీ జీవితం కడ తేరే వరకు ….? ఆ పరాశక్తికే ఆయుధం అవసరం అయింది నీకు తెగింపే ఆయుధం ధైర్యమే నీ ధనం కధన రంగంలో […]

Read more