ఓడిగెలిచిన రాత్రి

యవ్వనాన్ని ధరించిన దేహం కోర్కెలకు కళ్ళాలను తెలుసుకుంటూ పెనవేసుకున్న రెండుదేహాలు రాత్రిని చీల్చుకుంటూ ఆకాశపు అంచులను తాకుతున్నట్టు పరుగులు ఒలికిన నీరు మెల్లగా జారుతున్నట్టు మరుగుతున్న పాలు పొంగుతున్నట్టు కణం కణం రగిలిన అగ్నికణం చెలరేగే మంటలై అడివంతా దహించే జ్వాలలైనట్లు కన్ను గానని చీకటిలో భయమెరుగనిపోరు పల్నాటి పందెపు కోళ్ళలా రాత్రిని చెమటిచుక్కలుగా మారుస్తూ జ్వలించే దేహపు కణాలను ప్రజ్వలిస్తూ దేహాలతాకిడిమధ్య ఆర్పివేయాలనే ప్రయత్నం ఎవరికి ఎవరు పోటీ ఎవరికి ఎవరు భేటీ సమానమైన నిట్టూర్పులసెగలు కుడి ఎడమల   సైకిల్ పెడలింగులా వడివడిగా […]

Read more

నూర్జహాన్

1 ఉన్మాద ప్రణయ ఇతిహాసానికి తొలి పలుకు నేను- మర్మ సౌందర్యానికి చిరునామా నేను- అహంకారం నాకు అలంకారం- 2 జగద్విఖ్యాతమైన  నాప్రేమ కథనంలో ఎవరూ తొంగి చూడలేని అర పేరు బీభత్సం – గాఢ నిదురలోంచి  ఆకస్మికంగా మేల్కొని తప్పనిసరి నడుస్తున్నప్పుడు జలదరిస్తున్న దేహంలా సౌభాగ్యం నౌకను దౌర్భాగ్యం తుఫాను నడిపిస్తుంది 3 అంతః పురం  పూతోట దీపాన్ని ముట్టించిన నేను లోక దివ్వేనైనాను- నే పాడిన భ్రమర గీతాలన్నీ భ్రమలేనా? నా కలలు యవ్వనం శిల్పీకరించిన విలాస మోహాల్ని కోట గోడలు […]

Read more

మధుర భావాలు వికసించి మానవతా గంధాలు విరజిమ్మే మల్లెమొగ్గలు’’

“మల్లెమొగ్గలు’’ ఆహా ! ఎంత ఆహ్లాదకరంగా ఉందీ శీర్షిక!పుస్తకం చేతిలోనికి తీసుకోగానే మల్లె సుగంధాలేవో మనసును తాకిన అనుభూతి. గోపాలరావు గారి కవితల్లోకి తొంగి చూడగానే ప్రణయ కవిత్వంలో పరిమళించి, మనిషి జీవితంలోని అన్ని దశలూ ఆ కవితల్లో అనుభవించి నట్లైంది. కవితల కూర్పు జీవితంలో ప్రతిదశలో మదిలో పల్లవించే భావాలకు దర్పణం పట్టింది. మనిషి 20 ఏళ్ళ జీవితం నుండీ 60 ఏళ్ళ జీవితానుభవాలు కళ్ళకు కట్టినట్లయింది. ఆయన ప్రేమ కవితల్లో విహరించిన ఏ వ్యక్తికైనా మనసు గతంలోకి పరుగులు తీసి మధుర […]

Read more

దేహక్రీడలో తెగిన సగం

ఆడి  పాడే అమాయకపు బాల్య  దేహం పై.. మొగ్గలా  పొడుచుకు వస్తున్నప్పుడు.. బలవంతంగా   జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై.. వసంతం విరిసినప్పుడు…. వీడని అమాయకత్వం  నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు  నఖశిఖ పర్యంత చూపులతో.. గుచ్చి గుచ్చి తడిమినప్పుడు..  లోలోపల భయం, గగుర్పాటు తో  అప్పటిదాకా లేని సిగ్గు తెర పైట అయి  తనువంతా  చుట్టుకునే ముగ్ధత్వం  కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా మోహపు పరవశంతో ఉప్పొంగినా    .. నలిగిన  మేనుకు   అవే  తరగని అలంకారమని  సగభాగం […]

Read more