Tag Archives: తెలంగాణా

ప్రాణహితవై ప్రవహించు

అగ్ని ప్రవాహమైన ఓ అంబేద్కరా ఇగ  తెలంగాణా ప్రాణహితవై ప్రవహించు మహొదయా సుజల స్రవంతి గీతమై  ధ్వనించు తెలంగాణా చిరకాల స్వప్నమై ఫలించు తొలకరిలా పులకరింతలు చిలకరించు .. చిన్న రాష్ట్రాలను సమర్ధించిన మహాధినేతవు  నీవు రాజ్యాంగ రూప శిల్పకర్తగా జ్ఞానోన్నత సృజనుడివి నీవు తెలంగాణా ప్రత్యేకతను గుర్తించిన దార్శనిక సాహసికుడివి నీవు .. బోధిసత్వుని ఆధునిక … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 1 Comment

గౌతమీ గంగ

             పరమపావని భరతధాత్రిలో ఆర్యావర్తాన గంగ, సింధూ, యమున, బ్రహ్మపుత్రలు,దక్షిణా పధాన కృష్ణ, గోదావరి, పెన్న, కావేరులూ సతత జీవ నదులై ప్రవహిస్తూ అమృత తుల్యమైన తమ జీవధారలతో భూదేవిని సస్యశ్యామలం చేస్తూ, జీవ జాతులకు ఆవాస భూములై, మహత్తర సంస్కృతీ, నాగరికతలకు క్షేత్ర భూములుగా నిలిచి వున్నాయి. సహ్యాద్రిపై వెలసిన గోదావరి త్య్రంబకేశ్వరుని పాద … Continue reading

Posted in ఆత్మ కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 1 Comment

కళల హారతి ఉమాభారతి -2

This gallery contains 12 photos.

కళల హారతి ఉమాభారతి మొదటి భాగాన్ని ఇక్కడ చూడండి. అన్నీ మంచి సంఘటనలే వరుసగా జరుగుతూ వుంటే మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? రావలసిన గుర్తింపు,  ఫారెన్ టూర్లు, ఫిల్మ్స్, ఇలా త్వర త్వరగా జరిగిపోతే ఇక మిగిలేది టీచింగ్ కదా. పెర్ఫార్మింగ్  ఆక్టివిటి (activity), ఆ ఉత్సాహం తక్కువయ్యే అవకాశం  ఉంటుందేమోనని. టీచింగ్ మొదలుపెట్టాలని లేదు.  ఐ  యామ్ బెటర్ ఎట్ పెర్ఫార్మింగ్.  టీచింగ్ సత్తా నాలో ఉందో లేదో,  తెలియదు కూడా.  ఫిలిం కెరియర్ (career) ఒక ఆప్షన్ (option) గా ఆలోచన లేదు. అందుకని అలా అన్నాను. ఇంతకీ మళ్ళీ మీ కూచిపూడి నృత్య శిక్షణ ఎలా ఎప్పుడు మొదలైంది? ఎలా … Continue reading

Posted in ముఖాముఖి(ఇంటర్వ్యూలు) | Tagged , , , , , , , , , , , , | 2 Comments

రెండు దశాబ్దాల(1990 -2010 )తెలుగు రచయిత్రుల సాహిత్యం గమనం-గమ్యం:27,28,29 జనవరి2012

  ఆహ్వానం రెండు దశాబ్దాల (1990 -2010 )తెలుగు రచయిత్రుల సాహిత్యం గమనం-గమ్యం మూడు రోజుల జాతీయ సదస్సు , వరంగల్లు 27 ,28 ,29 జనవరి  2012 చిత్రం మీద క్లిక్ చేసి పెద్ద అక్షరాలలో చదవండి.

Posted in సాహిత్య సమావేశాలు | Tagged , , , | Leave a comment

తెలుగులో చారిత్రక నవల; నాడు-నేడు

డా.కె.లావణ్య , అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణా విశ్వవిద్యాలయం. పందొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్థములో భారతదేశం సాంస్కృతికంగా, రాజకీయంగా చాలా మార్పులకు లోనయింది. పాశ్చాత్య సాహిత్య సంస్కృతుల ప్రభావం, ముద్రణా యంత్రాల వ్యాప్తి వలన విద్యా విధానంలో ప్రజల ఆలోచనా సరళిలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకూ ప్రబంధ  ఆఖ్యాది కావ్యాదులతో కేంద్రీకరింపబడిన రచయిత దృక్పథం వాస్తవికత … Continue reading

Posted in సాహిత్య వ్యాసాలు | Tagged , , , , , , , , | 4 Comments

తిరిగి ప్రవాసానికి…

”హమ్మయ్య! ఇప్పటికి కుదిరిందండీ మన జనం లోకి రావటానికి!ఎలాగైనా మన హైదరాబాద్ వాతావరణం,ఇక్కడి జీవితమేవేరనుకోండి.మన పిల్లలు హాయిగా తెలుగు మీడియంలో చదువుకుంటారు. చక్కని తెలుగు నేర్చుకుంటారు.వారానికోమాటుఊరెళ్ళి వ్యవసాయం చూసుకుంటూండచ్చు.”అలివిమాలిన తృప్తీ  ఆనందమూ కన్నుల్లో, చెంపల్లో తళుకులీనుతుండగా భర్తకళ్ళల్లోకి చూస్తూ అంది ప్రసూన. ”అవునోయ్ మరి ఈ ట్రాన్స్ఫరుకి అంతగా శ్రమించి ,ప్రయత్నాలు చేసింది ఎందుకనుకున్నావ్ ?  … Continue reading

Posted in కథలు | Tagged , , , , , , , , , | 2 Comments

ఉద్యమమే ఊపిరి …POW సంధ్య తో ముఖాముఖి

POW  నే  ఇంటి పేరుగా మార్చుకున్న సంధ్య  ప్రస్తుతం POW అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణా ఉద్యమ పోరాటం,మహిళల ఆత్మస్థైర్యాన్నిపెంపొందించే కౌన్సిలింగ్ కార్యక్రమాలు , మహిళల సమస్యలపై ఉద్యమిస్తున్నారు.సామాజిక ఉద్యమాలలో సంధ్య గత పాతికేళ్ళుగా చురుకైన పాత్ర పోషిస్తూ వస్తోంది.ముఖ్యంగా స్త్రీల విషయంలో, దళితుల విషయం లో .. వారి హక్కుల కోసం ఎన్నో చారిత్రకమైన    … Continue reading

Posted in ముఖాముఖి(ఇంటర్వ్యూలు) | Tagged , , , , , , , , , | 10 Comments