నా జీవనయానంలో (ఆత్మ కథ )-66 జ్ఞానోదయం– కె. వరలక్ష్మి

“ ఇంకా లైటు వెలుగుతోంది , మేలుకునే ఉన్నట్టున్నారు , పాపాయిని కాస్సేపు ఎత్తుకుని వెళ్దాం “ అని వచ్చేరట . తిన్నగా నేనున్నా చోటికి వచ్చి నా స్థితిని చూసేరు . అప్పటికే నాకు వికారం , స్పృహ కోల్పోయే స్థితి మొదలైంది .” మోహన్రావు ఇంకా రాలేదా ?” అంటూనే సెంటర్లోకి పరుగెత్తి రిక్షా పిల్చుకొచ్చేరు. దారిలో పాపాయిని మా అమ్మకు ఇచ్చేసి నన్ను డా. జయ గారి హాస్పటల్ లో చేర్పించారు . రోజూ రాత్రి భోజనాల తర్వాత శాంత […]

Read more

సరళీస్వరాలు(వ్యాసం) – సోమరాజు సుశీల

శ్రుతి కలవని స్వరాలు – సరళీస్వరాలు సరళీస్వరాల రచయిత్రి శ్రీమతి నందుల సుశీలాదేవి 1940వ సంవత్సరంలో గోదావరీ తీరాన రాజమహేంద్రవరంలో నందుల సోమేశ్వరరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. విద్యావంతుల ఇంట పుట్టినందువలన ఆమె విద్యకు ఎటువంటి అవరోధం ఏర్పడలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో ఎమ్‌.ఎస్‌సి., ఎమ్‌.ఫిల్‌. పట్టాలు పొంది అన్నవరం సత్యవతి కళాశాలలోను, ప్రభుత్వ కళాశాలలోను అధ్యాపకురాలిగాను, ప్రిన్సిపాల్‌గానూ పనిచేసి రిటైరయినారు. ఆమె భర్త శ్రీసుసర్ల సుబ్రహ్మణ్యంగారు కొద్ది సంవత్సరాలక్రితం స్వర్గస్థులయ్యారు. వీరి పిల్లలిద్దరు వున్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. ఆమెకు చిన్నతనం నుండి […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

 ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్నాను. మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చాను. మా గైడ్‌ మునిరత్నం. అతనికీ తిరుమల తిరుపతి శేషాచలం కొండలు, వెంకటాచలం కొండలూ కొట్టినపిండి. ఈ అడవుల్లో ఆయన తిరగని ప్రదేశం, చూడని చోటు లేదేమో! మేం కోనలోకి వెళ్తుంటే నేనున్నది ఎక్కడా… మానవలోకంలోనా… దేవ లోకంలోనా… అని ఓ సందేహం. సున్నపురాయి నిక్షేపాలున్న సన్నని దారి ఉన్న గుహలో ప్రయాణం నడుము వంచుకునే… మధ్య మధ్యలో నీటి చుక్కలు మా మీద పడ్తూండగా ఆ నీటి చుక్కలు పడడంవల్లనేమో […]

Read more

వాస్తవాలను వెళ్లగక్కిన “ కొండచిలువ”

వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన శాంతినారాయణ . తిరుపతి ఓరియంటల్ కళాశాలలో విద్యను అభ్యసించి తెలుగు పండితునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు . 1970 అష్టావధానాలు చేయడం మొదలైన ఆయన సాహిత్య ప్రయాణం కవితలు ,కథలు , నవలలు ప్రక్రియలలో రచనలు చేస్తూ సంపుటాలను వెలువరించారు . ఆయన ఏ ప్రక్రియలో రచనలు చేసిన వాటిని చదువుతుంటే ఆనంతపురం జిల్లాలోని మారుమూల పల్లెల వాసన మనసును తట్టి లేపుతుంది .చదివే చదువరుని ముందు ఆ పల్లె వాతావరణాన్ని దృశ్య కావ్యంలో సంభాషణలు , యాస […]

Read more

జోగిని

సన్నగా గొణిగింది.  ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ… కానీ ఆమె ఎవరో మాత్రం అర్థం అయినట్లుంది. అందుకేనేమో, మళ్ళీ తానే చనువుగా ” పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అంత తీవ్ర ఆలోచన చేస్తున్నారేమిటో…” అన్నాడతను. ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. […]

Read more

తొమ్మిదో తరగతిలో …..3

గుండ్రటి డబ్బా మిషన్లో కాస్త పంచదార చల్లి అప్పటికప్పుడు తయారు చేసిచ్చే వేడి వేడి పీచు మిఠాయి , మణి కట్టుకి చుట్టే పాకం వాచీలు , సంతలో అమ్మే బెల్లం సేమ్యా పాయసం – అన్నిటికీ దూరం జరగాల్సి వచ్చింది పెద్ద దాన్నై పోయిన భావంతో . డా.జయగారు హాస్పటలు పక్కనే కట్టిన ఇంటికి గృహ ప్రవేశం చేసారు . మా అమ్మ నన్నూ , మా పెద్ద చెల్లినీ పంపించింది . పూజ ముగిసి ఇక పీటల మీంచి లేస్తారనగా హఠాత్తుగా […]

Read more

గౌతమీ గంగ

         3వ ఫారం పూర్తి చేసిన సుబ్బారావు తణుకులో ఒక ప్లీడరు గారి వద్ద గుమాస్తాగా చేరాడు. అప్పుడే భార్య సుబ్బమ్మ కాపురానికి వచ్చింది. ఆమె పుట్టి పెరిగిన కొమాన్లపల్లికి పూర్తిగా భిన్నమైనది ఈ ఊరు. ఆ ఊరు వర్షాకాలంలో ఓ దివిలా వుండేది. చుట్టూ ప్రక్కల గ్రామాలతో సంబంధం వుండేది కాదు. మామూలు రోజుల్లో కూడా మిగతా ఊర్లతో ఆ ఊరికి రాకపోకలు తక్కువే. వర్షాల వల్ల, వరదల వల్ల ఆహారం దొరకని రోజుల్లో ఆ ఊరి జనం పెద్దసైజు  గుమ్మడిపండుకు అడుగున […]

Read more

నర్తన కేళి- 2

”నేర్చుకున్న విద్యను  మనం మాత్రమే ప్రదర్శిస్తే కొంతకాలమే ఉంటుంది .ఆ కళను నలుగురి కి పంచితే కలకాలం నిలిచిపోతుంది. అదే నా  స్ఫూర్తి…” ఈ మాటలని నిజం చేసి చూపిస్తున్న ‘నర్తకి పవని శ్రీలత తో ముఖాముఖి ‘ ఈ మాసం మీ కోసం… *శ్రీలత గారూ! నమస్తే. మీ పూర్తి పేరు చెప్పండి. నా పూర్తి పేరు పవని శ్రీలత , మా నాన్న పేరు మూర్తి, అమ్మ పేరు సులోచనదేవి *మీ స్వస్థలం  ఎక్కడ? కర్నూలు జిల్లా లోని ఆదోని , నా […]

Read more