దాటలేని గోడలు

మెడకి గుదిబండల్లా అనిపించే తల్లితండ్రులని వదిలించుకోడానికి, వృద్ధాశ్రమాలు ఎలాగూ ఉన్నాయిప్పుడు. కానీ ఏ కోర్టూ, రుజువుల గొడవ లేకుండా… ఖర్చెక్కువ పెట్టకుండా చట్టబద్ధంగా విడాకులు పొందాలన్నా, తమ లాభాలకి/జీవితాలకీ అడ్డం పడుతున్నారనుకోవడం వల్ల భార్యలనీ, అన్నతమ్ములనీ, సాటి ఉద్యోగులనీ వదిలించుకోవాలనుకున్నా- ఉన్న దారి! మెంటల్ ఆసుపత్రులు. అవి అనువుగా దొరుకుతున్నాయీ మధ్య. ప్రభుత్వ ఆస్పత్రులలో అయితే కనుక, ఎవరికయినా సైకాలజీకల్‍ సమస్య ఉందని నిర్థారించడానికి చట్టం ప్రకారం సైకియాట్రిస్టుల అవసరం ఉంటుందని The Mental Health Act Of India చెప్తుంది. ఎవరైనా తమ […]

Read more

ధృడగాత్రులు  

ఇంకొక లైంగిక వేధింపు. మరొక కేసు. మరో విద్యావంతుడైన పెద్దమనిషి. తిరిగి తన హోదాని దుర్వినియోగపరచడం! ఇంకొక యువతి కనపరిచిన నిర్భీతి, సాహసం. లైంగిక వేధింపు అన్న విషయం హెడ్ లైన్స్‌కి ఎక్కి, తరుణ్ తేజ్‌పాల్ని కటకటాల వెనక్కి నెట్టింది. మాజీ సుప్రీమ్ జడ్జ్ మీద నిఘా నిలిపింది. ఆ తరువాత కూడా ఒక మహా విద్యావంతుడైన రాజేంద్ర పచౌరీ తన డిపార్టుమెంట్లో పని చేసే ఒక స్త్రీని వేధించి, పీడించి తప్పించుకోగలనని అనుకున్నాడన్నది విభ్రాంతి కలిగించే విషయం. ఉన్నత చదువులు చదువుకుని, ఒక ఉన్నతస్థానంలో […]

Read more

అంకురించని అంతం

మా బాల్కనీకి ఎదురుగా ఉన్న పేవ్‌మెంటుమీద, ఎనిమిదికీ పద్నాలుగేళ్ళకీ మధ్య వయస్సులో ఉన్న కొందరు పిల్లలు ముక్కు ముందు జేబురుమాళ్ళో, గుడ్డపీలికలో అడ్డం పెట్టుకుని వరసగా కూర్చుని కనిపిస్తూ ఉండేవారు. చూసి చూసీ, అర్థం కాక ‘వాళ్ళ ముక్కుల ముందున్న గుడ్డలేమిటని?,’ ఒకరోజు పనమ్మాయిని అడిగేను. “భాభీ, వాళ్ళు నషా చేస్తున్నారు” అందామ్మాయి. ‘ఇదేమి నషా’ అని అడిగితే వివరించింది తనకున్న పరిజ్ఞానంతో- స్టేషనరీ దుకాణాల్లో అమ్మే టైప్ రైటర్ ఎరేసర్ (వైట్నర్) కొనుక్కుని, మత్తెక్కడానికని దాని వాసన పీలుస్తూ ఉంటారని. ఈ వైట్నర్లు […]

Read more

గమ్యం లేని బాల్యం

   “బచపన్ బచావ్ ఆందోలన్”- ఉద్యమాన్ని ప్రారంభించిన కైలాష్ సత్యార్థికి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా ఆయనని అభినందిస్తూ, ఆయన చేసిన నిరంతర కృషికి ప్రణామాలతో…….                              జాన్‌పుర్ నుంచి వచ్చిన ఎమ్పీకి భార్య అయిన డెంటిస్ట్ అయినా, వసంత్‌కుంజ్‌లో ఉన్న డాక్టర్ అయినా, మా ఇంటి కిందనున్న డాక్టర్ దంపతులు అయినా కానీ, తాము చదువుకున్నవారిమన్న జ్ఞానాన్ని పక్కకి నెట్టి, మానవత్వాన్ని కాలరాసి, హత్యలకీ […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

               1920 డిసెంబరులో ఆరంభమైన  సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు. ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటీషు ప్రభుత్వాన్ని మన దేశం  నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. స్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల విూద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ అలీఘర్‌ ఖిలాఫత్‌ […]

Read more

సుకన్య

సుకన్య తాననుకున్నట్లు ఆశ్రమాన్ని నిర్మించే పనిలో మునిగి పోయింది. చిన్నాన్న గోవిందయ్య అన్ని పనులు పురమాయించటం, దగ్గరుండి శ్రద్ధగా పనిచేయించటం తన కర్తవ్యంగా భావించాడు. వనజ కూడ తన సమయాన్నంతా సుకన్యతోనే గడపసాగింది. సుకన్య తండ్రి మరణవార్త విన్న చందు ఫోన్‌లోనే సుకన్యతో మాట్లాడాడు. ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయానని, తన విచారాన్ని తెలియచేసాడు. వివేక్‌ కూడ ఢిల్లీలోనే ఉండటం వల్ల అతని తల్లిదండ్రుల ద్వారా గ్రామసమాచారాలన్ని ఎప్పటికప్పుడు వివేక్‌కి తెలుస్తుంటాయి. వివేక్‌ ద్వారా చందుకి తెలుస్తాయి…    వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తుంది […]

Read more

సుకన్య

(14 వ భాగం) ”చందు! నాకు కూడ నీతోపాటు ఢిల్లీలో ఏదైనా ఉద్యోగం చూడు. నిన్ను చూడకుండ ఉండగలనా అనిపిస్తుంది” వివేక్‌ చిన్న పిల్లాడిలా మారాం చేస్తున్నట్లు అన్నాడు. చందు గబగబా వివేక్‌ వైపు నడచి అతని రెండుచేతులను తన నడుము చుట్టు బిగించుకుంటూ ”నాకు అలాగే ఉన్నది… దప్పిగొన్న వాడికి అమృతం దొరికినట్లు… మలమల మాడే ఎండలో చెట్టు నీడలోకి వెళ్ళినట్లు నీస్నేహం పన్నీటిజల్లులా, సుగంధపరిమళ భరితంగా అనిపిస్తున్నది…” ”నీ ప్రయాణం ఎపుడు?” రేపే! నేను ఢిల్లీ వెళ్ళిన వెంటనే నీకు అక్కడి […]

Read more

సుకన్య

(13 వ భాగం) ”చదువు అయింది అంతే! ఇంకా నేను సంపాదనాపరుణ్ణి కాలేదు కదమ్మా! అయినా తర్వాత ఆలోచిద్దాంలే! ఇంకా నేను చిన్నవాడ్నేనమ్మా” అంటూ చందు రెండు చేతులతో తల్లి మెడ కావలించుకొన్నాడు.  ”ఏమోరా! మాకున్నది నీవొక్కడివే! మా పంచ ప్రాణాలన్ని నీమీదనే నీకు పెళ్ళి చేస్తే నీ ఆలనా పాలనా చూచుకొనే ఒకరుంటారు మాకింక దిగులుండదు.” ”నాకిప్పుడొచ్చిన లోటేమి లేదు… ముందు నాకు ఉద్యోగం దొరకని…”  ఏమో నాయనా! నేను చెప్పవలసింది చెప్పాను…” ”అమ్మా! ఈ ఊళ్ళో వెంకయ్య అనే ఆసామి ఉన్నాడు […]

Read more

స్త్రీ యాత్రికులు (11వ భాగం)

యాండ్రియా రెక్సాన్స్ , స్టీఫెన్ వోల్లార్త్ -3             చివరికి వారు పడవ మీద కాశీకి బయలుదేరాల్సిన సమయం వస్తుంది. అది సెప్టెంబరు 1996 వ సంవత్సరం. ఆ రోజు ఉదయమే ఇద్దరూ గంగా స్నానం చేసి షోడశోపచారాలు పాటించిన సాధువుల చేత పడవకి పూజలు చేయించి, హిందూ సాంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రాలు చదువుతుండగా పడవని నీటిలోకి నడిపిస్తారు. యాండ్రియా చీరకట్టుకుని గంగాదేవిలా తయారవుతుంది. పొడవైన నల్లని గడ్డంతో ఉన్న స్టీఫెన్‌ కుర్తా, పైజమా […]

Read more