బోయ్‌ ఫ్రెండ్‌ – 9(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఏమి హాయి పిన్నీ ! ఒక చోట స్థిరంగా బ్రతక్కుండా ప్రతి చెట్టు నీడనా కాసింత సేపు గడిపి మరో చెట్టును వెతుక్కుంటూ వెళ్ళే ఈ నిర్భాగ్యుల బ్రతుకుల్లో ఏమి హాయి వుంటుంది?” అక్క కూతురుతో వాదం పెంచకుండా, చిరునవ్వు నవ్వి ఊర్కుంది నిర్మల. ఒక చోట కారు ఆపి అన్నారు రామారావు గారు. మనం ఇప్పుడు మూడువేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో వున్నాం. అక్కడ నుండి సీలేరుకు దిగాల్సి వుంటుంది.” అని ఆగి ”ఈ దారంబడే పైకి వెళ్తే ఒక గోపురం […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – 8(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఊహు. మీరు తీసుకోండి” సిగ్గుపడింది అరుణ. ”పరవాలేదు అరుణా. అందరం సరదాగా మన పిక్నిక్‌ గుర్తుగా తీయించుకుందాం రా.” కృష్ణ చాలసేపు బ్రతిమలాడగా వచ్చి మధ్యగా నిల్చుంది అరుణ. ప్రతి ఫోటో తీయాల్సి వచ్చినప్పుడల్లా అరుణను బ్రతిమలాడాల్సి వచ్చేది. నిర్మల తటస్థంగా ఎవరెలా చెప్తే అలా వినేది. కృష్ణ మంచి చెట్టునో కమనీయమైన దృశ్యాన్నో ఏరుకొని మనుష్యులను అందంగా పేర్చి అప్పుడప్పుడూ ఫోటోగ్రఫీ మీద ప్రయోగాలు ఆరంభించేది. తన నొక్కదాన్నే తెలివిగా తీయడానికి చైతన్య ప్రదర్శిస్తున్న నేర్పును వ్యర్ధం చేస్తూ అతి తెలివిగా గుంపులో […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – 7(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”అయితే ఈ రోజు మనం వెళ్ళినట్లే” అందరూ తయారయి అరగంటగా ఎదురు చూసాక, తన టాయలెట్‌ పూర్తి చేసుకుని ఇవతల కొచ్చిన అరుణ ముఖం చైతన్య వ్యంగ్యబాణానికి నల్లగా అయిపోయింది. గులాబి రంగు మెటల్‌షిఫాన్‌ చీర కట్టుకుని, అదే రంగు ‘టుబైటు’ జాకెట్టు వేసుకుంది. కుడి చేతికి ‘పింక్‌’ గాజులు వేసుకుంది. ఎడమ చేతికి నల్ల స్ట్రాప్‌తో రిస్ట్‌వాచ్‌ పెట్టుకుంది. మెడలో పింక్‌మణులు, ఆరురోస్‌ ట్విస్ట్‌ చేసి మెడచుట్టూ అలంకరించుకుంది. పొట్టి జుట్టును ముంగురులు చెంపల మీద అందంగా ఎగిరేలా దువ్వుకుని ఒక్క జడ […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – 6(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”భానూ ! ఈ వెదురు పొదలు చూడు. ఎంత బాగున్నాయో!” తన స్నేహితుడి చేతి మిద తన చెర్యు వేస్తూ అంది. ఇంతవరకు మౌనంగా వాటినే చూస్తున్న భానుమూర్తి తన స్నేహితురాలితో పూర్తిగా ఏకీభవించాడు. ”చూస్తున్నాను కృష్ణా. చాలా అందంగా వున్నారు.” ఆ నిశ్శబ్ధ నిశీధిలో అరుదుగా దొరికే ఈ ప్రకృతి తాలూకు అందాల్ని, నిద్రాదేవి కిలాడితనానికి లొంగిపోరు, పోగొట్టుకుంటున్న చైతన్యను కూడా లేపి నిద్రపోతున్న వాతావారణాన్ని చైతన్యవంతం చేయాలనిపించింది కృష్ణకు. కానీ ఒకరకమైన జంకు. ఎప్పుడూ భానుమూర్తి దగ్గర అనుభవం కాని బెదురువల్ల […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

                                       శ్రీమతి డా . పెళ్లకూరి జయప్రద సోమిరెడ్డి 1975 లో రాసిన ” బాయ్ ఫ్రెండ్” నవల వాస్తవికతలో ఈ తరానికి కూడా అద్దంపడుతుంది . సామాజిక సందేశం ఉన్న ఏ రచన అయినా చదువరులకి అవసరమే కాబట్టి దీనిని విహంగ మహిళా సాహిత్య పత్రికలో పునర్ముదిస్తున్నాం . చదువరులు మీ అభిప్రాయాల్ని పాలుపంచుకుంటూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం […]

Read more