జీవస్తరం

  నేను ఆమె పక్కనలా  ఒంటరిగా కూర్చోవడం ఇప్పటికి ఎన్ని రాత్రులో   ఆహ్లాదకరమైన గాలి ఆమె మంచం చుట్టూ అల్లుకొని సన్నజాజి పూలు, ఇంకా ఆ చెట్టుకు పండుతున్న అరటిగెల వాసనని పెరట్లోని కొత్తచిగుర్ల నవ్వుని మోసుకొస్తున్నా ఆమె చూపులు నా నుంచి కదలనే కదలవు   ఒక్కో రాతిరి సువాసన మూలికలుగల తైలంతో ఆమె జుట్టుకు మర్దన చేసేప్పుడు చేతుల్లోకి రాలిన తెల్లజుట్టును చూసి ఆమెతో ఏదో చెప్పాలని అనుకుంటాను కాని ఒలికిపోతున్న కాలంతో పాటు నా మాటలతో ఇంకా తనకి బాధనివ్వలేను   మంచం పక్కనే టేబుల్ పైన […]

Read more

చరితవిరాట్ పర్వం

“విశృంఖలత్వం, కుత్సితాభిలాష నా ప్రవర్తనలోనే కాదు, నా నరనరానా జీర్ణించుకుపోయింది. నాకేం కావాలో నాకు తెలియదు. ఏదో కావాలనుకోవడం, దాని వెనుక పరుగులు పెట్టి సాధించుకోవడం….తీరా అది దొరికాక, నాకు కావల్సింది అది కాదని అర్థం కావడం! ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకూ…. అనుకున్నవన్నీ దొరికాయి. దొరికాక తెలియని అసంతృప్తి. వెర్రి వేయి విధాలన్నట్లుగా నా వెర్రి పరిపరి విధాలుగా పోయేది.” నేను చెప్తున్నది ఆమెకు అర్థం అవుతుందో, లేదో నాకు తెలియలేదు. ఆమె ముఖంలోకి తేరిపార చూసాను. ఆ చిన్ని కళ్ళల్లో […]

Read more

టగ్ ఆఫ్ వార్

నిజమే, ‘చంప’ మంచి బాంక్ ఉద్యోగం పిల్లలకోసమే వదిలేసింది. అలాగని పెద్ద డబ్బున్న పరిస్థితీ కాదు, కాని ఆడపిల్లలకు తల్లి అవసరం, ప్రతి నిమిషం చూసుకోవలసిన ఆవశ్యకత   ఉందని పించి మానేసింది. ఇంట్లోనే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా చిన్న బోటీక్ తెరిచి తీరిక సమయాల్లో చిన్నపాటి కాలక్షేపాన్ని అలవరచుకుంది. రత్నబాల తలదించుకుంది. “సరే ఇప్పుడైపోయిన వాటికేం గాని జరగవలసిన వాటి గురించి ఆలోచిద్దాం, పిల్లను ఇక్కడ ఉంచి మీరు వెళ్లి ముందు ఆ శంకర్ ని కదిలించి  నయానో భయానో ఏదో ముట్టజెప్పి, ఫోటోలు గట్రా […]

Read more