కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్ధిక, రాజకీయ నేపథ్యం

”ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా, సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరివల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు. ముడిపదార్థం జీవితం”. – ఈ వాక్యాలను రాసింది మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించి ఆ ముడి పదార్ధంతో ఎన్నో అద్భుతమైన కథలను, నవలలను, నాటికలను, గల్పికలను, మలిచిన అక్షరశిల్పి కొడవటిగంటి కుటుంబరావుగారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1908-80 సంవత్సరాలు మధ్యగల సుమారు 72 సంవత్సరాల జీవితకాలంలో 1931-80 మధ్యగల సుమారు అర్ధశతాబ్ధి […]

Read more

తెలుగు లేఖా సాహిత్యానికి అగ్రగణ్యురాలు ‘ కనుపర్తి వరలక్ష్మమ్మ’ – అరసి

 ISSN 2278 – 4780                    వాస్తవమైన వ్యక్తుల మధ్యగాని , ఊహాజనితమైన వ్యక్తుల మధ్య కాని లేఖ ద్వారా సంభాషణలు జరుగుతాయి . సాహిత్య సంస్కృతమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెప్ప వచ్చు. తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలలో లేఖా సాహిత్యం ఒకటి . మిగిలిన  ప్రక్రియ లాగ విస్తరించక పోయిన వచ్చిన కొద్దిపాటి సాహిత్యం లోనే అనంతమైన విషయాల్ని ఈ సాహిత్యం అందించింది .  ఈ సాహిత్యం రెండు రకాలుగా వచ్చింది .                  ఒకటి కవులు , […]

Read more

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

జాతీయోద్యమకారులచే ‘ అమ్మ’ గా పిలిపించుకున్న ఆబాది బానో బేగం (1852-1924)    జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడా అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీషు ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన  మహిళలు  ఉద్యమకారులలో ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండా, నిర్భయంగా ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆనాటి తొలితరం మహిళలలో శ్రీమతి ఆబాది బానో బేగం అగ్రగణ్యురాలు. ఆమె ఎంతో ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించటం వలన ఆమె నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమకారులు  ఎంతో ప్రేమతో బీబీ అమ్మ అని ఆమెను పిలుచుకున్నారు.                     ఆబాది […]

Read more

భారత స్వాతంత్య్రోద్యమం – ముస్లిం మహిళలు

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి,నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక శతాబ్దంపైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు పోటీపడటం అపూర్వం. లక్షలాదిప్రజానీకం ఒకే నినాదం, ఒకే లక్ష్యం కోసం ఒకే బాటన ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.      ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జన […]

Read more