ఈ మహిళా దినోత్సవం వరకూ…

పోయిన సంవత్సరం మహిళా దినోత్సవం నుండి ఈ మహిళా దినోత్సవం వరకూ, మహిళల పరంగా సాగిన స్టడీస్/ అభివృద్ధి/ రాజకీయ అభివృద్ధి/ సామాజిక విజయాలు/ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో అమలుకి నోచుకున్నవి….మొదలైనవేవైనా… మీకు తెలిస్తే, ఇక్కడ షేర్ చేయగలరు! – విజయభాను కోటే ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more

మీరేమంటారు? (చర్చ)

“ఆధునికత” ప్రతి కాలంలోనూ, ప్రతి సాంఘిక అధ్యాయంలోనూ, ఆయా కాలాలకు సరితూగే పదమే! పూర్వ పద్ధతులను ప్రశ్నించి, తన మార్గాలను బయల్పరచి, క్రొత్త దారులను ఏర్పరచేదే! సమాజం ప్రతి సందర్భంలోనూ (ఫేజ్) ఆధునికతను నాగరికత పేరిట సంతరించుకుంటూనే ఉంటుంది. ఆధునికత రెండు రకాలు. (౧) మార్పుని అప్పటికప్పుడు సమాజంలో ప్రతిబింబించేది. (౨) ఒక అడుగుగా మొదలైనా, కాలక్రమేణా ఇంకా వర్ణాలను సంతరించుకుని, రెక్కలను తొడుక్కుని కొన్నాళ్ళకు అనామకంగా ఉన్న దశ నుండి సీతాకోకచిలుకగా మార్పు చెందేది. ఇహ జెండర్ విషయానికి వస్తే, ఆధునిక పురుషుడు/ […]

Read more

పద చైతన్యం (చర్చ)

సాహిత్యంలోనో , నిజజీవితం లోనో సాటి మనుషుల పట్ల ,తక్కువగా చూడబడే సామాజిక వర్గాల వారి పట్లా , ముఖ్యంగా మనిషికి జన్మనిచ్చి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర నిర్వహించే స్త్రీల పట్ల ఉపయోగించబడే పదజాలానికి ఎలాంటి పరిమితులున్నాయి? అస్తిత్వ పోరాటాల నేపథ్యంలో స్త్రీల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని గౌరవిస్తూ ఇతరులు ఏ విధంగా వారిని సంబోధించాలి? గౌరవించాలి? సాహిత్యంలో కొన్ని వందల ఏళ్లుగా స్త్రీల పట్ల వాడబడుతున్న పరుష ,అగౌరవ ,అంగాంగ వర్ణనల పదజాలంపై వచ్చిన చైతన్యం ,తిరుగుబాటు ఇప్పుడు ఏ దిశగా […]

Read more

అతివలపై అత్యాచారాలు

               ఒక నెలలో పదిహేను మంది అతివలపై అత్యాచారాలు! మన దేశం లో హర్యానా రాష్ట్రం లో ని పరిస్తితి ఇది. ఒక కల్పనాచావ్లా , ఒక నైనా సేహ్వాల్ వంటి ఆణి ముత్యాలను జాతి కి అందించిన రాష్ట్రంలోని మహిళల ప్రస్తుత పరిస్తితి ఇది.11 సంవత్సరాల పాపాయి మొదలుకుని 40 సంవత్సరాల ప్రౌఢ  వరకూ ఎవ్వరినీ వదలలేదు .అందరూ భంగ పడ్డవాళ్ళే .అత్యాచారమంటే కేవలం ఒక స్త్రీ ని పాశ వికంగా ప్రవర్తించి శారీరకంగా లొంగ […]

Read more

ఓ..కాంత ..ఏకాంత గాధ..”తన్హాయి”

             “తన్హాయి” నవలని నేను నవలగానే చదివాను.నేను ఆ నవలని చదకముందు.. ఆ నవల పై వచ్చిన సమీక్షలని చదవాలనుకున్నాను కానీ.. సమీక్షలుచదివి నవల చదివితే.. ఆ సమీక్షల ప్రభావం నాలో ఉన్న పఠనా శక్తినిచంపేస్తుందేమో అని అనిపించింది. తన్హాయి నవలని చదవడం మొదలెట్టగానే.. కొంచెం ఆసక్తి. ..ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం అనుకుంటూ ఏక బిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను..మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక […]

Read more

స్త్రీల వస్త్రధారణే లైంగిక దాడులకు కారణమా? (చర్చ)

మహిళా దినోత్సవం సందర్భంగా – పాఠకుల కోరిక మేరకు ఉన్నత పదవిలోవున్న ఒక ప్రముఖ వ్యక్తి  స్త్రీల వస్త్ర ధారణ పై చేసిన వ్యాఖ్యలపై  చర్చ ప్రారంభిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్లో   నిజం వుందా? పురుషులంతా ఇలా భావిస్తున్నారా? లేక కొంతమంది స్త్రీలకి కూడా ఇలాంటి అభిప్రాయా లున్నాయా ? మరి చిన్న పిల్లలు,వృద్ధులపై జరుగుతున్న లైంగిక దాడులకి వస్త్ర దారణే  కారణమా? పలు రంగాలకు చెందిన వ్యక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల సమాహారం ఇది.   ఇక్కడ వెలిబుచ్చే అభిప్రాయాలకు వారే భాధ్యులు.  వారి సొంత […]

Read more

ఒక పురుషుడిగా నేనిలా రాయొచ్చా ?

ఒకానొక స్త్రీల పత్రికలో పురుషులకి ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించడం అనేది, పురుషులని శత్రువుల్లా  కాకుండా మిత్రుల్లా చూసే ఒక సమరస భావంతో చేసిన మంచి పని. మరి, దాన్ని ఇంతవరకూ పురుషులేవ్వరూ ఉపయోగించుకోకపోవడం అంటే ఏమిటి ? ఇది చాలా లోతయిన ప్రాతిపదికని కలిగి,  తరతరాల చరిత్రని ఇముడ్చుకున్న బలమైన ప్రశ్న. ఈ ప్రశ్నని అడిగే పరిస్థితి ఎదురు కాకూడదు  అంటే మగవాళ్ళు తమంత తామే ముందుకి వచ్చి వివరణ ఇచ్చుకోవలసి వుంటుంది. ఎందుకంటే, ఎదుటివారు నేరారోపణ చేసేంతవరకూ చేతులు ముడుచుకుని కూర్చుంటే, […]

Read more

ఏం చదవాలి ? ( కెరీర్ గైడెన్స్ గురించి )

కెరీర్ అనేది ఒక సుడిగుండం లాంటిది. అందులో పడటమే కానీ లేవడమనేది ఉండదు.  ఎందుకంటే.., సమాజంలో నివసించే ఏ మనిషీ ఒంటరి కాదు. ఎంత ఒంటరితనం అనుభవించే మనిషి అయినా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిమీద ఆధార పడకుండా జీవించడం అసాధ్యం. జీవించడానికి మాత్రమే కాదు చివరికి చావాలన్నా కూడా నలుగురి సహాయమూ  కావాలి. నాకు ఎవరూ అక్కరలేదు, నా చావు నేను చస్తానంటే కుదరదు. చచ్చాక కుళ్లిపోయే లోపుగా అంతిమ సంస్కారం చెయ్యడానికయినా […]

Read more

నామిని నెంబర్ వన్ పుడింగి

ఒక రచయిత, తన జీవితాన్ని గురించి ఇంత ధైర్యంగా నిజాయితీగా నిర్లజ్జగా నిర్మొహమాటంగా నిర్మోహత్వంతో రాసిన పుస్తకం ఇదొక్కటే అయి ఉండచ్చు. బహుశా ఇతర భాషల్లో కూడా ఇన్ని జీవన  వైవిధ్యాలూ వైరుధ్యాలూ కలిగిన జీవిత చిత్ర ప్రదర్శన వెలువడిన దాఖలాలు లేవు. ఇందుకు నామిని సుబ్రహ్మణ్యం నాయుడిని అభినందించకుండా ఉండలేము. అందుకే దీనిగురించి ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకోవలసి వస్తోంది. పుడింగి అంటే ఏమిటో నాకు తెలీదు కానీ నామిని నెంబర్ వన్ పుడింగి అని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. ఉదాహరణకి నామిని సుబ్రహ్మణ్యం […]

Read more

ఏం చదవాలి ?

( మొదటి భాగం – పాఠ్య పుస్తకాల గురించి ) మనకి తెలిసినంత వరకూ చదువు మార్కులనిస్తుంది మార్కులు ర్యాంకులనిస్తాయి ర్యాంకులు ఉద్యోగాలనిస్తాయి ఉద్యోగాలు జీతాలిస్తాయి జీతాలు జీవితాలనిస్తాయి… ఇదీ  చదువు పట్ల మనలో చాలామందికున్న  అవగాహన. ఈ విషయం ఆయా పాఠ్య పుస్తకాలు రాసిన పెద్దలకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ? మేము అష్ట కష్టాలూ పడి తయారు చేసిన పాఠాల విలువ ఇంతేనా అని ఆవేదనతో తల్లడిల్లి పోతారు. ఎందుకంటే, విద్య వినయాన్నీ వినయం వివేకాన్నీ వివేకం విజ్ఞతనీ విజ్ఞత విచక్షణనీ […]

Read more
1 2