సమకాలీనం – విజయభాను కోటే

మరణం ఎప్పుడైనా రావచ్చు…స్వయంకృతాపరాధానికి బలి కావచ్చు! ——————————————————————————– యంత్రాలమైపోయిన తర్వాత భయాలు కూడా ఉండకూడదు. అవును. పరిణామ క్రమంలో మనిషి తయారీ భూగోళానికి పరిణమించిన శాపంగా చరిత్రలో నిలిచిపోనుంది. చరిత్రను చదివేందుకు భవిష్యత్ తరం మిగిలి ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్నే! చిన్నగా మొదలై, 20, ౩౦ సెకన్ల పాటు ముందు ఇంట్లో వస్తువులు, తర్వాత మొత్తం బిల్డింగ్ ఊగిపోతుంటే, ఇదివరకు భయం వేసేది. ఇంట్లోంచి పరుగెత్తి బయటకు పారిపోయేవాళ్ళం. ఇపుడు భయం తగ్గింది. ఒక రకమైన నిర్లిప్తత ఆవరించింది. ఏదో ఒక […]

Read more

నల్ల జాతి చరిత్ర లో నిలిచిపోయే నక్షత్రం

ఎనిమిదేళ్ళ ఆడ పిల్ల అత్యాచారానికి గురైతే,ఆమె మానసిక స్థితి ఎలా వుంటుంది?ఏమి తెలియని వయసులో తనపై ఆ దారుణం ఎందుకు జరిగిందో అర్ధం కాక తల్లడిల్లుతుంది.తల్లి దండ్రులతో సహా ఎవరికీ చెప్పుకోలేక, వొంటరితనాన్ని కోరుకుని క్రుంగి పోతుంది.అనుదినం ఆ దుర్ఘటన గుర్తు చేసుకుంటూ మానసిక సంఘర్షణకు గురవుతుంది.కొందరు పెద్ద వాళ్ళే అలాంటి సంఘటనల ప్రభావంతో తమ జీవితాలనే చీకటి మయం చేసుకుంటే, మరికొందరు వాటిని త్రోవలో ఎదురయ్యే అడ్డంకులుగా భావించి, తప్పుకుని ముందుకు సాగుతారు.మాయా ఎంజేలో ప్రసిద్ది చెందిన ఆఫ్రో అమెరికన్ రచయిత్రి. ఎనిమిదేళ్ళ […]

Read more

బహురూపం

అక్షరం … బహురూపం అప్పుడే పుట్టిన శిశువు గొంతులోంచి ‘వూ ‘ అంటూ వురికే  అక్షరం ఎప్పుడూ  ఒంటరిదే వూ .. కాస్తా వుంగాగా మారాక … నెమ్మది నెమ్మదిగా నవ్వుల హరివిల్లుల్లోకి జారాకే .. మాటల కెరటాల్లో అంతర్ధానమైన అక్షరం … వాక్యాలుగా అక్షయమౌతుంది . ఒక్క సిరాచుక్క కొసన పురుడు పోసుకున్న అక్షర ప్రస్థానం  యెంత  గొప్పదీ … అది లక్షల మెదళ్ల ను కదిలిస్తుంది .. తన అక్షేహిణిలోకి పదాల  పదాతి దళాలను సమకూర్చుకుని .. చరిత్ర సారాంశాల నిస్వాసాల్లోంచి […]

Read more

గౌతమీ గంగ

     కూర్మా వేంకటరెడ్డి నాయుడి గారి కుమార్తె సుగుణ రత్నం పాఠశాలలో సహాధ్యాయులు. వారి ఇద్దరి మధ్య మంచి మైత్రీ బంధం ఏర్పడిరది. వారికి రత్నం సుందరరూపం శ్రావ్య కంఠం అంటే ఎంతో ఇష్టం. వారి మేడ ఒక పెద్ద తోటలో వుంటుంది. ఆ తోట ప్రహరీగోడను ఆనుకునే రత్నం వాళ్లు వుండే ఇల్లు వుంది. వీరి మేడ మీద నుంచి చూస్తే రత్నం వాళ్ల ఇల్లు కనిపిస్తుంది. వారి మేడ మీద నుంచి సుబ్బమ్మగారూ, రత్నం ఆవరణలో తీర్చి దిద్దే రంగవల్లులు చూసీ, […]

Read more

వీరనారి ఝాన్సీ ఝల్ కారీ బాయి

                                 చరిత్రలో అంతరించిపోయి న  సాహసగాథలు , సాహస వీరులు ఎంతో మంది ఉన్నారు . కొందరి చరిత్రలు గ్రంధస్థమైతే , మరికొందరి సాహసాలు చరిత్ర పొరల్లో భూస్థాపితం అయిపోయి ఉంటాయి .                                       స్త్రీల విజయాలు . సాహసాలు , త్యాగాలని ఈ రోజుకి బాహాటంగా అంగీకరించని పరిస్థితులు  కన్పిస్తాయి.  స్త్రీలనే  వంకతోనో , చులకన భావనతోనో ఆమెకు దక్కాల్సిన కీర్తి ,గౌరవం అందటం లేదు . ఇప్పటి  పరిస్థితే ఇలా  ఉంటే  రెండు శతాబ్దాల క్రితం స్త్రీల పరిస్థితి  అందులోనూ దళిత కులాలకిసంబంధించిన […]

Read more

ఎన్న ముద్ద నా బాస

చీలికలు పడ్డనేల  విడివడ్డ ఖండాలం  చూపుకు మాత్రం ఒకలాంటి  మనుషులమే అంతా తెలుగోల్లమే …   వేరు చరిత్రలు భిన్న సంస్కృతులు విభిన్న రాజకీయార్ధిక జీవన ప్రపంచాలు వేరు భాషా  వ్యక్తీకరణలు …   ఇప్పటిదాకా మనమొక అసమ వ్యవస్థ  ఇరు భాగాలం అసమాంతర  వంకర గీతలం మనిషితనపు  హొదాలను భాషలో సమాధి చేసిన అభాగ్యులం   అధికారం కదా  అణిచివేతను ఆయుధం చేసుకునేది  దోపిడీ కేదైతే  ఏందట  భాషైనా  భావమైనా బతుకైనా  పెత్తనం చాలదా  ప్రజల మెదళ్లను పరుల సంపదల మొదళ్ళను  పక్కదారులంట […]

Read more

తెలుగు సాంఘిక నాటక దృక్పధం – ఆంధ్ర నాటక కళాపరిషత్తు – అరసి

ISSN 2278 – 4780   “కావ్యేషు నాటకం రమ్యం”, ‘నాటకాంతం నా సాహిత్యం”అని నాటక ప్రక్రియను ఉత్కృష్ట సృష్టిగా  సంస్కృత పండితులు సంభావించారు. జాతిని జాగృతం చేసేది జాతి జీవనాన్ని   ప్రతిబింబించేది నాటకం.తెలుగు సాహిత్య వనంలో విరిసిన కుసుమాలలో నాటక కుసుమం  తన పరిమాళాలను సుమారు ఒక శతాబ్దం పైనే నాటక ప్రియుల్ని అలరించింది. అన్ని ప్రక్రియలలోను సంస్కృత కవులను అనుసరించిన తెలుగు కవులు ఈ విషయం లో మినహాయింపనే చెప్పాలి. ప్రపంచ సాహిత్య చరిత్ర లో నాటకానికి కొన్ని శతాబ్దాల చరిత్ర […]

Read more

ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్

 అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే ధ్యేయం .దీనికి సాహసం, ధైర్యం కావాలి .ఆ రెండూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి .సంకల్పం గట్టిదైతే కృషి తప్పక ఫలిస్తుంది .అలాంటి అద్భుత సాహసం చేసి తీవ్ర ప్రమాదం లో చిక్కుకొన్న నావికా ప్రయాణీకులను అరుదైన ధైర్య సాహసాలతో రక్షించిన మానవీయ మూర్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన గ్రేస్ డార్లింగ్ […]

Read more

ముస్లిం మహిళలు

జాతీయోద్యమకారులను ఉత్తరాలతో ఉత్తేజపరచిన  బేగం జాఫర్‌ అలీ ఖాన్‌                     జాతీయోద్యమ చరిత్ర పుటలను కాస్త ఓపిగ్గా తెరిస్తే స్వాతంత్య్రోద్యమంలో భర్తలతో పాటుగా పలు త్యాగాలకు సిద్ధపడి, మాతృభూమి విముక్తికి పోరుబాటను ఎంచుకున్న తల్లులు ఎందరో మనల్ని పలకరిస్తారు.  భర్త అడుగుజాడల్లో నడుస్తూ, జీవిత భాగస్వామికి సంపూర్ణ తోడ్పాటు అందచేయటం ఒకవంతైతే, బ్రిటీష్‌ పాలకుల కుయుక్తుల వల్ల భర్తలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిన సమయంలో, తామున్నామని  రంగం విూదకు వచ్చి భర్త బాధ్యతల భారాన్ని స్వీకరించి సమర్ధవంతంగా మాత్రమేకాదు స్ఫూర్తిదాయకంగా నిర్వహించగలగటం […]

Read more
1 2