నా జీవనయానంలో (ఆత్మ కథ )-63- భక్తి నిర్వేదం – కె వరలక్ష్మి

ఇల్లుగలావిడ కూడా ‘నీళ్ళోసుకున్నప్పుడు ఏం తినాలన్పిస్తే అయ్యి తినాలమ్మా’ అంటూ ఒక తపేలాలో బియ్యం నింపి ఇస్తుండేది. ఆ సమయంలో అంత ఇష్టంగా, చివరికి కాన్పు బల్లమీద కూడా తినాలన్పించిన బియ్యం కాన్పు తర్వాత వాటి జోలికి పోవాలన్పించలేదు. అన్నం వండటానికి బియ్యం కడుగుతున్నప్పుడు కూడా నోట్లో వేసుకోవాలనిపించేది కాదు. ఇల్లు గల వాళ్ళ పిల్లలు నారిబాబు, కృష్ణ వాళ్ల చెల్లెలు, ‘అక్కా, అక్కా’ అంటూ నాతో ఇష్టంగా మసలేవాళ్ళు. మోహన్ కి స్కూల్లో పాఠాలు బాగా చెప్తాడని మంచి పేరొచ్చింది. ‘స్కూల్ ముగిసాక […]

Read more

ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

ఎనిమిదో అడుగు – 23

‘‘స్నేహితా! ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్‌ కావాలన్నా చేస్తాను. ఒక్క నీ భర్తలో శుక్రకణాలు తప్ప….’’ అంది డాక్టర్‌. ‘‘సరే! మేడమ్‌! నేను ఆలోచించుకుంటాను. నాకు కొంత టైం కావాలి.’’ అంది స్నేహిత. ‘‘ఓ.కె. ఆల్‌ ద బెస్ట్‌. ఇది నా ఫోన్‌ నెంబర్‌! ఈ విషయంపై ఏదైనా మాట్లాడాలనిపిస్తే కాల్‌ చెయ్యి…’’ అంది డాక్టర్‌. ‘‘ అలాగే’’ అంటూ సెలవు తీసుకుంది స్నేహిత. హాస్పిటల్‌ నుండి ఇంటికెళ్లింది స్నేహిత. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వున్నారు. ఆమె నేరుగా తన గదిలోకి వెళ్లి ఆ […]

Read more

ఓయినం

”ఏమైనా ఒక ఆడిపోరి ఎన్క గిట్ల జరగొద్దన్నా” అన్నది అంజమ్మ. ”ఏం జేస్తం మా కిస్మత్తుల గిట్ల జరిగేదుంది జర్గింది మీద దేవుడున్నడు” అని గుడి దిక్కు తిరిగి దండం పెట్టి చంద్రయ్య దిక్కుచూస్తూ, ”ఓరి చెంద్రి జెర మనమందరం మల్లా ఒకసారి పంచాయతీకి కూకోవాలెరా” అని అంటుంటే, ”అన్ని ఫైసలాలు అయిపాయె యింకెందుకు” అన్నాడు ఆశ్చర్యంగా. ”ఏంలే జెర మాట్లాడేదుంది కూకున్నప్పుడు సెప్తగా” అంటుంటే చంద్రయ్య అర్థంకానట్టు చూశాడు కాని సత్తయ్య మాట తీసిపుచ్చలేక ”సరే” అంటూ తలాడించాడు. ”ఇంక జరిగే ఫైసలా […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌

”అసలు వస్తుందో రాదో!” అని గబగబ నవ్వుతూ వెళ్ళిపోయే కృష్ణకాంతి వంక అలా చూస్తూ వుండిపోయాడు భానుమూర్తి. ఆ రోజు అలా అతి సామాన్యంగా అరున పరిచయం ఇంత గాఢంగా అల్లుకుంటుందనీ, కష్టాలలోనూ, సుఖాలలోనూ ఒకరి కొకరు తోడు అవుతారని అతనుగాని ఆమెగాని అనుకోలేదు. ”అదేమిటి భానూ! ఇల్లు వచ్చేసింది.” అని కృష్ణ గుర్తు చేసేవరకు అతను తన స్మృతుల నుండి బయట పడలేకపోయాడు. స్నేహితురాల్ని వాకిట వరకు దింపి వెనక్కు తిరిగి వెళ్ళబోతున్న భానుతో అంది కృష్ణ- ”లోపలికిరా నిన్న ఎందుకో అమ్మ […]

Read more

గౌతమీగంగ

నలుగుల వేళ రా। రా। కుమార నల్గుకు శ్రీరామ అలుగక పోరాటమేల సీతతో భూపాల చంద్రమా ॥రారా కుమారా॥ తప్పేమి చేసెనో దశరథ నందనా। ఒప్పుల కుప్ప జానకీ హృదయేశా! నందనా ॥రారా కుమారా॥ అని రత్నం పాడిరది. ప॥ కృష్ణ నలుగుకూ రారా నంద కుమారా శ్యామ సుందరా। చ॥ అత్తరు పన్నీరు అమరిన గంధము తెచ్చియున్నామురా। పుత్తడి బొమ్మ సత్తె భామ నీ చెంతనున్నది ॥రారా కుమారా॥ అని రావమ్మా గారూ, సీతమ్మ గారూ పాడారు. మగపెళ్ళి వారి తరపున ఎవరూ […]

Read more

ఓయినం

నేను సెయ్యబోతున్నది గూడా గదే జెర నా ఎన్క ఉషారుగుండు ఏడా తేడా రావద్దు పో పోయి రాజుగాని పిల్సుకురా” అన్నాడు. ఎల్లయ్య సేన్లల్లకెని అడ్డంపడిపోయి రాజుని పిల్చుకొచ్చాడు. ”ఏంది పెద్దనాయినా పిల్సినవంటా” అంటూ రాజు వస్తూనే అడిగేసరికి ”ఓరి రాజు మీ కల్లం గియ్యాలనే అయిపోయినట్లుంది” అన్నాడు. ”ఔనే గియ్యాలనే ఒడ్లన్ని యింట్ల ఏసినం ఇగ రేపటినుంచి గడ్డి కట్టుడుంటది” అన్నాడు. ”ఏం లేదురా మా కల్లంల గూడా గియ్యాలనే పనైంది నెల రోజులనుండి పనిసేసి సేసి పెయ్యంతా పులిసినట్లైందిరా గందుకని నువ్వు […]

Read more

దీపం ఆరకముందే చక్కదిద్దుకో…

మొబైల్ ఫోన్ మళ్ళీ మళ్ళీ మోగుతోంది.  ఆ చప్పుడికి మెలకువ వచ్చిన సులేఖ అబ్బ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ మూసుకుపోతున్న కళ్ళని విప్పార్చే ప్రయత్నం చేస్తోంది.  ఆమె కళ్ళు విడివడడంలేదు.  కళ్ళు బరువుగా మూసుకుపోతున్నాయి.  రాత్రి ఒంటి గంట వరకూ కంప్యూటర్ లో పనిచేసుకుంటూ ఉంది.  నిద్ర  మధ్యలో లేచిన అత్తగారు రేపు ఆదివారమే కదా!   పడుకోమ్మా సులేఖా అంటూ కేకేసేవరకు సమయమే చూసుకోలేదు.   పూనాలో ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన ఆమె కొడుకు సుబోధ్  వీకెండ్ అని నిన్న ఉదయం వచ్చాడు. […]

Read more

ముకుతాడు

(చివరి భాగం) “ చంద్రా, గుర్తు చేసుకో! నన్ను ఈ పెళ్ళికి బలవంత పెట్టింది నువ్వే. నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించావు. ఇప్పుడేమో నన్నొక రాక్షసుడిగా చిత్రిద్దామని చూస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నీ మాటలు తేలిగా తీసుకుంటానని అనుకుంటున్నావా? చూడు, నీ తల పగలకొట్టి, పళ్ళు రాలగొడతాను. నిన్ను చంపి పారేస్తాను ఏమనుకుంటున్నావో?” హుంకరించాడు. మనో కుర్చీ లోంచి లేవబోయాడు. చంద్ర అతన్ని ఆపుచేసింది. “అలాగేం? ప్రయత్నించి చూడు మూర్తీ! మర్చిపోబోకు, మనో ఇక్కడే వున్నాడు. ఇప్పుడు నీ కన్నా వాడు చాలా బలవంతుడు. […]

Read more

కేర్ టేకర్

రచయిత్రి;సి.ఉమాదేవి ఉమాదేవి గారు జూనియర్ కాలేజిలో పబ్లిక్ అడ్మినిస్రేషన్ లెక్చరర్ గా,అనుబంధ పాఠశాలకు కో ఆర్డినేటర్ గా,వైస్ ప్రిన్సిపల్ గా విద్యారంగానికి తగిన సేవలందించి,ఆపై ఫౌండర్ ప్రిన్సిపల్ గా శ్రీనగర్ విద్యానికేతన్ స్తాపించి తన పర్యవేక్షణలో విద్యార్ధినీ , విధ్యార్ధులకు విద్య నందించారు.ఎన్ని పనులున్నా మనసు మాత్రం రచనాభిలాష నుంచి మరలిపోలేదు.అన్ని ప్రక్రియలలోను రచనలు చేసారు. స్కూల్ పిల్లలకై చిన్నచిన్న నాటికలు,లలితగీతాలు,కవితలు రాసి బాలానందంలో పిల్లల ద్వారా ప్రసారం చెయ్యడం,ఆకాశవాణిలో చదివిన కథలు,మహిళాసమాజంలో పాలుపంచుకున్న చర్చా కార్యక్రమాలు , విస్సా టి.విలో ఇంటర్వ్యూ, ఈటివిలో […]

Read more
1 2