వానంటే భయంలేదు(కవిత ) -డా|| కె.గీత

వాన నిలువెల్లా వెయ్యి నాలుకలతో విరుచుకుపడినా భయం లేదు నాకు గాలి ప్రచండమై విను వీధికి విసిరేసినా బాధ లేదు నాకు ఈ గాలీ, ఈ నీరూ ఇవి లేకేగా ఇన్నాళ్లూ కళ్లకు కన్నీటి కాయలు కాసింది! రాత్రంతా చెట్ల విలయతాండవం గొప్ప మహోధ్రుత వర్షోద్రేకం ఆకాశం విరిగి నేలను కూలినట్లు రోజంతా చిల్లులు పడ్డ గగన తలం ఈ నీరేగా ప్రాణాధారం- రాత్రంతా నిద్ర పోతున్న ఇంటి తలనెవరో భయంకరంగా గీరుతున్నారు హోరున వేల నీటి చేతుల్తో అద్దాల తలుపుల్నెవరో దబా దబా […]

Read more

నా కళ్లతో అమెరికా-64 (యాత్రా సాహిత్యం )-కె.గీత

మెక్సికో నౌకా యానం- భాగం-1 అమెరికాలో ఇప్పటి వరకు మేం కార్లలోనూ, విమానాల్లోనూ తిరిగే టూర్లకే వెళ్ళేం. కానీ జల యాత్ర చెయ్యలేదు. అంటే చిన్న బోట్లలోనో, పడవల్లోనో ఆ రేవు నించి ఈ రేవు వరకూ ఎక్కి దిగడం కాదు. సముద్రం మీద రోజుల పాటు ప్రయాణం చేసే నౌక యాత్ర. గాంధీ ఆత్మకథ లో ఆయన మూడేసి నెలలు నౌక యానం చేసిన సందర్భాలు చదివినప్పుడల్లా, నౌకా యాత్ర ఎలా ఉంటుందోననే కుతూహలం కలుగుతూ ఉండేది. అమెరికాలో పాపులర్ టూర్లలో క్రూయిజ్ […]

Read more

నా కళ్లతో అమెరికా-62 (హానోలూలూ-భాగం-2)- కె.గీత

డైమండ్ హెడ్ మాన్యుమెంట్: ఉదయం హానోలూలూ లో స్నోర్కిలింగు టూరు నించి తిరిగొచ్చి అలిసిపోయి ఉన్నా, హానోలూలూలో మాకున్న రెండు రోజుల సమయంలో చూడాల్సిన లిస్టు లో ఆ రోజు రెండు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంది. మొదటిది డైమండ్ హెడ్ మాన్యుమెంట్. రెండు లక్షల సంవత్సరాల కిందట పెల్లుబికిన అగ్నిపర్వతపు కొన. రెండవ ప్రప్రంచ యుద్ధ కాలం నాటి మిలటరీ స్థావరం. హవాయీ లో అమెరికా కు చెందిన మొదటి యుద్ధ స్థావరం. [spacer height=”20px”]సాయంత్రం నాలుగైదు గంటల వేళకు డైమండ్ హెడ్ ప్రాంతానికి […]

Read more

వయసొచ్చిన పుట్టినరోజు(కవిత) – కె.గీత

వయసొచ్చిన పుట్టిన రోజు మిగిలున్న పుట్టినరోజులెన్ననే ఆలోచనతో ప్రారంభమవుతుంది మిగులున్న పనుల వివేచన మొదలవుతుంది ఎక్కడో ఒకచోట మొదలయ్యి ఎక్కడో ఒక చోట ఆగిపోయే జీవన ప్రయాణం లో పుట్టిన రోజొక మైలురాయి బతుకు భారాన్ని కొలిచే తూకపు రాయి గుండెల మీద ఎదగాల్సిన పిల్లల భవిష్యత్తు చక్కదిద్దాల్సిన జీవితాల కసరత్తు గుండెచాటున మోగే విరిగిన తంత్రుల కఠోర నాదం ఎప్పటికప్పుడు తెగిన నాడుల్ని వేళ్లకి చుట్టుకుని గుండె చిక్కబట్టుకుని కొత్త రాగాల్ని ఆలపించాల్సిందే అయినా విచిత్రంగా ప్రతీ మైలురాయీ విడిచే నిశ్వాసం మీంచి […]

Read more

నా కళ్లతో అమెరికా-61 (యాత్రా సాహిత్యం )- కె.గీత

(హానోలూలూ-ఒవాహు ద్వీపం- భాగం-1) సాయంత్రం పొద్దుగుంకుతున్న వేళ బిగ్ ఐలాండ్ కు వీడ్కోలు పలికి ఒవాహూ ఐలాండ్ లో ఉన్న రాజధానీ నగరం, హానోలూలూకు గంట విమాణ ప్రయాణం లో చేరేం. అప్పుడప్పుడే చీకటి పడ్తున్న వేళ, మబ్బుకమ్మిన ఆకాశంలోంచి కింద మరో రెండు మూడు ద్వీపాలు కూడా ఛాయా చిత్రాల్లా అగుపించాయి. ఒవాహూ తీరం వెంబడి హానోలూలూ నగరపు ధగద్ధగమాన విద్యుత్కాంతులు నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యంగా మెరుస్తున్నాయి. ఆకాశంలోంచి అప్పుడప్పుడే ఆ ద్వీప సందర్శనకు విచ్చేసిన అంతరిక్ష జీవిలా అపురూపంగా చూస్తూ అడుగుపెట్టాను. […]

Read more

నా కళ్ళతో అమెరికా-60(యాత్రా సాహిత్యం )-డా .కె .గీత

హవాయీ భాగం-6 (బిగ్ ఐలాండ్ – చివరి రోజు) హవాయీ యాత్రలో మొదటిదైన బిగ్ ఐలాండ్ లో చివరి రోజు అది. సాయంత్రం ఆరు, ఏడు గంటల వేళ బిగ్ ఐలాండ్ నించి హవాయీ రాజధానీ నగరం హానోలూలూ ఉన్న ఒవాహూ ద్వీపానికి మేం విమానం ఎక్కాల్సి ఉంది. అప్పటికి గత రెండు రోజులుగా ద్వీపాన్ని ఉత్తరంగానూ, దక్షిణం గానూ పూర్తిగాచుట్టి, మేమున్న పడమటి తీరం నించి తూర్పు తీరానికి రోజూ వెళ్లొస్తూ , దాదాపు అన్ని ప్రధాన సందర్శక ప్రదేశాలూ చూసేసాం. అయితే […]

Read more

నా కళ్లతో అమెరికా-51(యాత్రా సాహిత్యం) – కె.గీత

                                                 డాడ్జిరిడ్జ్(భాగం-1) అమెరికాలో శీతాకాలం నవంబరు, డిసెంబరు నించి మొదలుకుని ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఫిబ్రవరి రెండూ, మూడు వారాల లో వచ్చే శీతాకాలపు సెలవులకి పిల్లలు ఎపుడూ స్కీయింగ్ అంటూ పెచీ పెట్టడం మామూలే. మేమున్న బే ఏరియాలో మంచు కురవక పోయినా 150- 200 మైళ్ల దూరంలో తూర్పున సియర్రా […]

Read more

ఇంటినొదల్లేని బెంగ(కవిత ) -డా.కె.గీత

ఆదమరిచి నిద్రపోతున్న భార్యనొదిలి ముద్దుగా ఒత్తిగిలిన చంటాడి నొదిలి గౌతముడెలా వెళ్లాడో తెలీదు గానీ ఆదివారం ఉదయం ఎవరూ నిద్రలేవని బద్ధకపు మంచు ఉదయం ఒంట్లోని వెచ్చదనాన్ని దుప్పటీలోనే ఒదిలి కాలేజీ చదువు కళ్లని నులుముకుంటూ ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న అతన్ని అందాల కుందేలు పిల్లై పక్కనే ముడుచుకున్న పసిపాపని ఒదిలి ఎలా వెళ్లగలను?! సాయంత్రానికి గూటికి చేరగలిగిన రెక్కల ధైర్యమున్నా మనసు ఇంటినల్లుకున్న జూకా మల్లెతీగ పరిమళమై అక్కడక్కడే తిరుగుతూ ఉన్నా ఇప్పటికెందుకో ఇంటినొదల్లేని బెంగ ఉదయం నించి సాయంత్రం వరకూ మెదడు […]

Read more

నా కళ్లతో అమెరికా-42

                                                         ఎల్లోస్టోన్- చివరి భాగం ఎల్లోస్టోన్ యాత్రలో తిరిగి వెనక్కి వచ్చే రోజు వచ్చింది. మేం వెనక్కి వచ్చేటపుడు మేం వెళ్లేటపుడు వెళ్లిన దక్షిణపు దారిలో కాకుండా పశ్చిమపు దారిలో వెళ్లాలని అనుకున్నాం.  కానీ ఆ దారి నోరిస్ మీంచి వెళ్తుంది. ముందు రోజు నాటి […]

Read more

నా కళ్లతో అమెరికా – 40

ఎల్లోస్టోన్ -4 మర్నాడు ఉదయం ఎప్పుడెప్పుడు “దోమల రిసార్టు” నించి బయట పడతామా అన్నట్లు త్వరగా బయలుదేరేం. సమయం లేనందు వల్ల ఇక అక్కడ బ్రేక్ ఫాస్టు వంటివి చెయ్యదల్చుకోలేదు. గ్రాండ్ టేటన్ నేషనల్ పార్కు : ఎల్లోస్టోన్ నేషనల్ పార్కుకు వెళ్లాలంటే ముందుగా “గ్రాండ్ టేటన్ నేషనల్ పార్కు” దాటి వెళ్లాలి. రెంటికీ కలిపి ఎంట్రన్సు టిక్కెట్టు $25 పెట్టి ఒక్కసారే తీసుకోవాలి. మేం వెళ్లింది జూలై నెల, మంచి వేసవి కాలం. అయినా ఈ టేటన్ లో చుట్టు మంచు కొండలు […]

Read more
1 2