జోగిని ( ధారావాహిక ) – వి . శాంతి ప్రబోధ

            ఇగజూడు.. కాళికాదేవోలె మా అమ్మ కాల్ల గజ్జేలు తీసి ఆ పోరగాల్ల మీదకు ఇసిరి కొట్టింది. ” ఎవడ్రా.. నా బిడ్డకు ఆడుమనేది. ముందుగాల్ల మీ ఇంట్ల మీ అవ్వతోని ఆడిపిచ్చి, మీ అక్కతోని ఆడిపిచ్చు, నీ ఆలితోని ఆడిపిచ్చు. గజ్జేకట్టిపిచ్చున్రి. ఆల్లందరాడ్తే అటెనుక నా బిడ్డ గజ్జే గడ్తది. ఆడ్తది” అని అమ్మోరి లెక్క ఉరుమిరిమి జూసింది. మీది మీదికి బోయింది.             నన్ను తోల్కోని ఆటలేదు. పాటలేదని ఇంటికొచ్చింది.             గప్పుడు సూడాలె.. నా సావిరంగా. జనం మొకాల్ల నెత్తురు […]

Read more

ఎనిమిదో అడుగు – 22

సిరిప్రియ వైపు చూశాడు హేమేంద్ర. .. ఆమె ఆవుపాలతో కడిగిన బంగారు ప్రతిమలా, వెన్నెల శిల్పంలా ముడుచుకొని కూర్చుని వుంది. ఆమె చేతిని మెల్లగా సృశిస్తూ…. ‘‘ ఈ ఊరు, ఈ వాతావరణం, ఈ మానవ సంబంధాలు నాకు నచ్చాయి. కానీ మన పెళ్ళి మిా ఊరిలో చేసి. ఇది మాత్రం ఈ ఊరిలో ఎందుకు చేస్తున్నట్లు…’’ అన్నాడు హేమేంద్ర. అతనికి ఆమెతో మాట్లాడే ఏకాంతం అప్పుడే దొరికింది. ఆమె కాస్త సిగ్గుపడ్తూ ‘‘మా తాతయ్య వంశంలో పుట్టిన ఆడపిల్లలకి ఎక్కడపెళ్లి జరిగినా ఈ […]

Read more

గోల్డెన్ మ్యాంగో (Golden Mango)

Golden Mango Director:Govinda Raju Country:India Language : Marathi (English Subtitles) Duration : 10 minutes Age Groups : 8 years and above. “కిట్టూ” అనే ఎనిమిదేళ్ళ బాలుడికి మామిడి పళ్ళంటే వల్లమాలిన ఇష్టం.వాస్తవ పరిస్థితిని-జానపదకథల్లోని పిల్లలకి మాత్రమే సాధ్యమైన అందమైన ఊహల లోకాన్ని కలగలిపి కళాత్మకంగా రూపొందించిన 10 నిమిషాల అపురూప చిత్రమిది. కిట్టూకి మామిడి పళ్ళు తనివితీరా తినాలనే బలమైన కోరిక ఉంటుంది. వాళ్ళుంటున్న ఊళ్ళో మామిడి పళ్ళ ఖరీదు చాలా ఎక్కువ.వాళ్ళమ్మా నాన్నల కేమో […]

Read more

గాయాల చుండూరు

ముద్దాయిలకు ముద్దబంతుల దండలేసి ముక్తి ప్రసాదించారు అన్యాయమంటూ ధర్మ దేవత గొంతు పిసికి నిర్దోషులుగా పరిగణించారు   ****                 ****                 ***** కళ్లు మూస్తే గాయాల చుండూరు కళ్లు తెరచి చూస్తే అన్యాయాల పుండూరు మనుషుల్ని చంపడం ఎంత ఎడ్డి తనం కాపు కాసి మట్టు బెట్టడం ఎంత మడ్డితనం పోలీసు స్టేషనో న్యాయ స్థానమో ఉంది కదా పట్టపగలే గొంతులు కోయడం ఎంత గిడ్డితనం   ****                 ****     […]

Read more

లాటరీ టిక్కెట్

ఈ కధ ఇంతకుముందే విన్నారా?ఫర్లేదు,నేను మళ్ళీ చెపుతాను,ఎందుకంటే, ఇందులో ఒక నీతి ఉంది,దానికంటే ఒకరకమైన మానసిక స్థితిని వివరిస్తుంది.ఇవ్వాళకూడా ఈ కధ ఆసక్తికరంగానే ఉంటుంది.                      పదిహేనేళ్ళక్రితం ఒక నర్తకి,సౌందర్యరసాధిదేవత వీనస్ లా ఉండేది.ఆమెను ‘సీలిటో’అందాం.ఆకాశంలోకి వేలు చూయిస్తూ సీలిటో ‘రంబ’ డాన్సు చేస్తుంటే జనం ఇంకోసారి,ఇంకోసారంటూ అరుస్తూ ఎంతగగ్గోలు పెట్టేవారో!ఒక్కక్షణం ఎలా నవ్వేదంటే,నరకంలో దేవతపడినట్టు.నర్తించేటప్పుడు ఉద్దేశ్యపూర్వకంగానే మనలో కామాన్ని రెచ్చగొట్టి వదిలేది.అరేబియా సీతాకోకచిలుకలా ఆమె ఎప్పుడూ నిప్పుతో ఆడుకునేది,కానీ అగ్నిమాత్రం […]

Read more

జీవితేచ్ఛ …

– వనజ వనమాలి ”అమ్మాయి గారు ..ఆమ్మాయి గారు .. రండమ్మా.. నెత్తి మీద తట్ట బరువుగా ఉంది దించడానికి ఓ..చెయ్యి వేయాలి” అంటూ.పిలుస్తుంది.ముసలి అవ్వ. మంచి పుస్తకం చదువుకుంటూ ఉండగా . ఇంతలోనే ఈ ముసలమ్మ వచ్చి చదువుకోనీయకుండా చేసినందుకు వచ్చిన చిరాకును అణుచు కుంటూ బయటకి వచ్చింది..పద్మ అబ్బా..మళ్ళీ వచ్చావా?.. ! వద్దు అంటే ఇప్పుడు ఊరుకోవు కదా! అంది పద్మ. మంచి ఆహారం తల్లీ! రోగం,రొస్టు రాకుండా ఉండాలంటే ఇవే తినాలి..అంటూ..నిండు గంపలో నుండి నాలుగు మొక్క జొన్న పొత్తులు […]

Read more