కరెక్టివ్ రేప్ (కథ ) – మానస ఎండ్లూరి

 ‘పిల్ల కాలేజికెళ్ళిపోగానే రమ్మంటాను. ఎప్పుడూ ఆలస్యమే! ఛ!!’ అనుకుంటూ చికాగ్గా వరండాలో పచార్లు కొడుతున్నాను…గడియారం యాభై సార్లు చూసినా రాడు! పది మెటికలు విరిచినా రాడు! ఇరవై కూని రాగాలు తీసినా రాడు! ఫోన్ చేద్దామా అంటే బండి నడిపిస్తుంటాడేమోనని భయం!           కాసేపటికి లీలగా టీవీ చప్పుళ్ళలో వినబడుతోంది అతనొచ్చే బుల్లెట్ ధ్వని! ఎన్నిసార్లు ఆ శబ్దం విన్నా అలజడే నాకు! చివాలున లేచి ఫ్రిజ్ తెరిచి మల్లెపూలు జళ్ళో తురుముకున్నాను. చల్లని బిందువులు నా వీపుని […]

Read more

బుచ్చిబాబు కథలు – మనోవైజ్ఞానిక దృక్పథం

తెలుగు సాహిత్యంలో కథకుల సంఖ్యకు కొదవలేదుగాని, మంచి కథకుల గురించి చెప్పాలంటే, ఆ సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఆ కొద్దిమంది కథకుల్లో ఎన్నదగినవాడు బుచ్చిబాబు. జీవితాన్నీ, జీవితంలో తనకెదురయిన వ్యక్తులనీ, ఆ వ్యక్తుల జ్ఞాపకాలు అందిచ్చే అనుభూతుల్నీ, నిశితంగా పరిశీలించి గుండెల్లో పదిలపరుచుకొని, ఒక్కొక్క పాత్రగా తీర్చిదిద్దాడు బుచ్చిబాబు. అయితే, ఆ పాత్రలను సృష్టించిన కథకుడు అటు విశ్వసాహిత్యంలోని ఆధునిక పోకడలను, ఇటు మనస్తత్వశాస్త్ర, తత్వశాస్త్ర సిద్ధాంతాల సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న మేధావికావడంతో – అతని కథలు కాలక్షేపపు పరిధిని దాటి ముందుకు వెళ్ళగలిగాయి. […]

Read more

చరితవిరాట్ పర్వం

“విశృంఖలత్వం, కుత్సితాభిలాష నా ప్రవర్తనలోనే కాదు, నా నరనరానా జీర్ణించుకుపోయింది. నాకేం కావాలో నాకు తెలియదు. ఏదో కావాలనుకోవడం, దాని వెనుక పరుగులు పెట్టి సాధించుకోవడం….తీరా అది దొరికాక, నాకు కావల్సింది అది కాదని అర్థం కావడం! ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకూ…. అనుకున్నవన్నీ దొరికాయి. దొరికాక తెలియని అసంతృప్తి. వెర్రి వేయి విధాలన్నట్లుగా నా వెర్రి పరిపరి విధాలుగా పోయేది.” నేను చెప్తున్నది ఆమెకు అర్థం అవుతుందో, లేదో నాకు తెలియలేదు. ఆమె ముఖంలోకి తేరిపార చూసాను. ఆ చిన్ని కళ్ళల్లో […]

Read more

టగ్ ఆఫ్ వార్

నిజమే, ‘చంప’ మంచి బాంక్ ఉద్యోగం పిల్లలకోసమే వదిలేసింది. అలాగని పెద్ద డబ్బున్న పరిస్థితీ కాదు, కాని ఆడపిల్లలకు తల్లి అవసరం, ప్రతి నిమిషం చూసుకోవలసిన ఆవశ్యకత   ఉందని పించి మానేసింది. ఇంట్లోనే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా చిన్న బోటీక్ తెరిచి తీరిక సమయాల్లో చిన్నపాటి కాలక్షేపాన్ని అలవరచుకుంది. రత్నబాల తలదించుకుంది. “సరే ఇప్పుడైపోయిన వాటికేం గాని జరగవలసిన వాటి గురించి ఆలోచిద్దాం, పిల్లను ఇక్కడ ఉంచి మీరు వెళ్లి ముందు ఆ శంకర్ ని కదిలించి  నయానో భయానో ఏదో ముట్టజెప్పి, ఫోటోలు గట్రా […]

Read more

సుకన్య

”నీవయితే వనజకు ధైర్యం చెబుతావని నిన్ను పిలిపించాం. నీవు దాన్ని ఓదార్చాలి.” వనజ తండ్రి అభ్యర్ధన. ”బాబాయి!  మీరు చెప్పాలా? వనజ పరిస్ధితి అంతా కనుక్కొని నేను ధైర్యం చెబుతానుగా” హామి ఇస్తున్నట్లు అంది సుకన్య. రాత్రి ఎనిమిది గంటలవుతుండగా డాక్టర్‌ మళ్ళీ వనజను పరీక్షించారు ‘అమ్మా’ అని ఒక్కసారి కదిలింది. డాక్టర్‌ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ‘ఆ అమ్మాయి పరిస్ధితి పర్వాలేదు’ అని చెప్పాడు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరిసింది. ఇప్పటి వరకు ఆవార్త కోసం ఎదురు చూచిన వాళ్ళంతా ఎపుడు […]

Read more

మలి సంధ్యలో…

58 – 60 ఏళ్లు దాటిన తరువాత ఉద్యోగస్తులుగా వున్న వాళ్ళకు మొదట వచ్చేది రిటైర్మెంట్!. ఉద్యోగ విరమణ తో కావలసినంత తీరిక అనుకోవడం కన్నా రోజంతా ఏమిచెయ్యాలి అన్నది సమస్య!! దీనితో పాటు ఇంట్లోవాళ్ళతో వచ్చేవి అనేక సమస్యలు. .. ఇప్పుడేమి పని పాటా లేదుగా .ఇదీ చెయ్యండి , అది చెయ్యండి “ అని చెప్పడం మనసుకు ఘాటుగా తగులుతుంది.అదే విషయాన్ని “ కాస్త ఈ పని చేసి పెట్టగలరా “ అని అడిగితే సంతోషం గా చేస్తారు .ఏదైనా చెప్పే […]

Read more

ఎన్‌కౌంటర్

                  మీడియా మొత్తం హడావిడి.  ప్రశ్నల వర్షం కురిపిస్తూనే వున్నారు.  కెమేరాలు రకరకాల కోణాలలో క్లిక్‌మనిపిస్తున్నాయి. హాస్టలు చుట్టూ జనాలు ఆఫీసరుకు ఊపిరాడటం లేదు.  జర్నలిస్టుగా వెళ్ళిన నేను పరిస్థితిని అవగాహన చేసుకునే క్రమంలో గుండెల్లో నుండి ‘మాతృహృదయం’ అనే చిన్న స్పర్శ తన్నుకొని వచ్చింది.  మూడు నెలల పసిగుడ్డు.  కళ్ళు ఎంత పెద్దగా వున్నాయి.  తలంతా రింగుల జుట్టు.  చూస్తుంటే కడుపులో  దేవినట్లు వుంది.  యిక జనాల గుసగుసలు.  పాపం అప్పుడే ఆయుష్షు తీరింది.  ఏ తల్లికి మనస్సు వచ్చిందో, కన్నీళ్లు రాని […]

Read more