మన ఆరోగ్యం మన చేతుల్లో- రాగులు,సబ్జాలు – అలౌకిక శ్రీ

రాగుల వల్ల ఉపయోగాలు : రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి. రాగి జావని డైట్‌లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. శరీరంలో సత్తువ పెంచుతుంది. ప్రతి రోజూ రాగి డైట్‌ ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు. రాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు. తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. […]

Read more

“డ్రై ఫ్రూట్స్ “తో ఆరోగ్యానికి డోంట్ వర్రీ – అలౌకికశ్రీ

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. రోజూ గుప్పెడు డ్రై ప్రూట్స్ తినండి . ఆరోగ్యంగా చలాకీగా ఉండండి …” ఇదే ఈ మధ్య పోషక నిపుణులు వల్లే వేస్తున్న ఆరోగ్య మంత్రం . అందులోనూ జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ ఈ నాలుగూ అందరూ తప్పక తినితీరాలి అంటూ పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నా మనం పెద్దగా పట్టించుకోం. వీలయినప్పుడు తింటాం. లేదంటే లేదు. అవునా! కానీ గుండె ఆరోగ్యంగా వుండాలంటే జీడిపప్పులు రోజూ ఓ నాలుగు అయినా తినాలిట. వీటిలో […]

Read more

మన ఆరోగ్యం మన చేతుల్లో- గుడ్డు (ఎగ్) – అలౌకిక శ్రీ

గుడ్డు గుడ్డంటే చాలా మందికి అలుసు , బహుశా చౌకగా దొరుకుతుందని .ప్రతి భారతీయుడు సగటున ఏడాదికి నలభై మూడు గ్రుడ్లు మాత్రమే తింతున్నాడట . అదే జపనీయులైతే (346) మూడు వందల నలభై ఆరు గుడ్లు అవలీలగా మింగేస్తారు . మెక్సికన్లు మూడు వందల ఆరు (306) , చైనీయులైతే మూడు వందల పన్నెండు (312). ఇతరత్రా సమస్యలు ఏమీ లేకపోతే ఎవరైనా సరే రోజుకో గుడ్డు నిక్షేపంగా తినోచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు . కనీసం ఏడాదికి 180 తిన్నా పర్వాలేదని […]

Read more

మన ఆరోగ్యం మన చేతుల్లో-‘జాం కాయ’- అలౌకిక శ్రీ

జాంకాయ మనకు ఒంట్లో నలతగా ఉందని డాక్టర్ దగ్గరకు వెళ్తే , డాక్టరు ఆహారంతో పాటు , మందులు వాటితో పాటు పండ్లుని కూడా జత చేసి అడుగుతారు . ఏ కాలంలో పండే పండ్లను ఆ యా కాలంలో తీసుకోవడం వలన చాలా వరకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని పెద్దల నమ్మకం . పెరటి చెట్టు అనగానే గుర్తుకు వచ్చేది ? పచ్చిగా ఉన్న కొరికేది ? దొరకాయ కావాలని కోరి ఎంచుకునేది ? పండులా ఉన్నాడు అనగానే […]

Read more

మన ఆరోగ్యం మన చేతుల్లో- బ్రేక్ ఫాస్ట్ – అలౌకిక శ్రీ

అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)                                  ఫాస్ట్ ని బ్రేక్ చేశారా ? అదేనండి బ్రేక్ ఫాస్ట్ చేశారా ?  అని అడుగుతున్నాను . మనకు భోజనం మీదున్న శ్రద్ధ బ్రేక్ ఫాస్ట్ మీద ఉండదు . తిన్న తినకపోయినా నష్టం లేదని సర్డుకుపోతాం . ఈ అభిప్రాయం తప్పని తేలింది . చురుగ్గా ఆలోచించాలన్నా , సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా బ్రేక్ […]

Read more

మన ఆరోగ్యం మన చేతుల్లో – అలౌకిక శ్రీ

మనిషి శరీరం ఓ యంత్రంలాంటిది . దానికి సరైన ‘ఇంధనం ‘ పడితేనే సక్రమంగా పని చేస్తుంది . లేకపోతే పని చేయనని మొండికేస్తుంది . ఇక్కడ ‘ ఇంధనం ‘ అంటే ఆహారం అన్నమాట . “తినేందుకు జీవించడం ‘ అని కాకుండా జీవించడానికి తినాలి అన్నది ప్రస్తుతం తారక మంత్రంగా మారింది . ఎంత తింటున్నాం అనే దానిపైనే కాకుండా ఏమి తింటున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన సమయమిది . ఇక్కడ మీకు చిన్న కథ చెప్పాలి . ఒక చోట […]

Read more

ఆమె ప్రియుడు

మేక్సిమ్ గోర్కీ కథ నా  పరిచయస్తుడొకాయన నాకీ కథ చెప్పారు. మాస్కో లో నేను విద్యార్ధి గా ఉన్నప్పుడు మా ఇంటి చుట్టు పక్కల్లో ఉండే ఆడవాళ్ళ ప్రవర్తన చాలా సందేహాస్పదంగా ఉండేది.మా పక్కింట్లో తెరెసా అనే పోలిష్ మహిళ ఉండేది. ఆమె ఇంగ్లీష్ వారికంటే కొంచెం చాయ తక్కువగా, చాలా పొడవుగా, బలిష్టమైన శరీరంతో, నల్లని ఒత్తైన కనుబొమ్మలతో, జిడ్డుగా,వికారంగా ఉన్న పెద్ద కోల ముఖాన్ని ఎవరో చిన్న చేతి గొడ్డలి తో చెక్కినట్లుండేది-వీర తాగుడు తో మత్తెక్కిన కళ్ళతో,మంద్ర స్వరంతో,కార్ డ్రైవర్ లాగా నడిచే నడకతో,అపారమైన […]

Read more

మధ్య యుగపు గ్రీకు మహిళ

గ్రీకు సమాజం                      ముందు గా ఆ నాటి సమాజ స్థితి తెలుసు కొందాం .పోలిస్ అంటే సిటి స్టేట్ అని అర్ధం .దాని లోంచే పోలిటిక్స్ అనే పదం వచ్చింది ..ఏ రెండు పోలిస్ లు ఒకటి గా ఉండవు .అలాగే పాలిటిక్స్ కూడా అలానేఉంటున్న సంగతి మనకు తెలిసిందే .నాగరక పట్టణాల ముఖ్య కేంద్రాలనే పోలిస్ అంటారు .అందు లోని జనాన్ని ”పోలిటిసి ”అంటారు .అంటే పౌరులు అని భావం .గ్రీకులు మొదటగా మాసిడోనియన్లకు ,తర్వాత రోమ్ కు స్వాతంత్రాన్ని కోల్పోయారు .గ్రీకులు అంటే రాజకీయం గా స్వంతత్రం గా ఉండే సమాజం .(కమ్యూనిటి ).దీన్నే గ్రీకిజం అన్నారు .భాషా ,మత ,సాంఘికంగా గ్రీసును ”మాగ్నా గ్రేషియా ”అంటే గొప్ప గ్రీసు అనిఅంటారు .630-480 b.c.కాలాన్ని ”ఆర్కాయిక్ ”లేక ప్రాచీన కాలం అంటారు .600-700 b.c.కాలాన్ని ”టి రంట్ ”కాలం అన్నారు .అంటే ఎవరికి వారు తనను రాజుగా ప్రకటించు కొన్న కాలం .507 b.c.లో”క్లీస్తేనిస్ ” అనే రాజు జనాన్ని వర్గీకరించాడు .”డెమి”అంటే గ్రామాలుగా వర్గీక రించాడు . ఏగ్రామం లో ఏ తండ్రికి ఏ కొడుకో అనే విషయాన్ని రికార్డ్ చేయించాడు .అప్పటికి 39 దేమ్స్ఏర్పడ్డాయి .పది కొత్తఆటవిక జాతుల వారు ”సింగిల్ జీనో ”గా ఉన్నారు .జనం అంతా అనేక తెగలుగా విడి పోయారు .దీనినే ”నోబుల్ కింగ్ గ్రూప్”అన్నారు .అందుకనే క్లీస్తేన్స్ ను ”ఫాదర్ ఆఫ్ డేమోక్రసి ”అని పిలుచు కుంటారు . అలెగ్జాండర్ మరణం తర్వాత రోమన్ దండ యాత్ర వరకు ఉన్న కాలాన్ని ”హెల్లెనిస్టిక్ పీరియడ్ ”అంటారు .అంటే గ్రీకు సంస్కృతి సజీవం గా ఉన్న కాలం అని అర్ధం .776 b.c.నుంచే గ్రీకు చరిత్ర లభ్యమవుతోంది.అదే ఒలిమ్పిల్ క్రీడలు ప్రారంభ మైన సంవత్సరం .ఏధెన్స్ నగర రికార్డు 683 b.c.లో దొరికింది .గ్రీకులు నెలలో28 వ రోజున ”ఎథీనా పోలియాస్ ”అనే దేవత ను పూజించే వారు .”కేక్రోప్” ఏధెన్స్ కు మొదటిరాజు . సంవత్సర గణనం ఏధెన్స్ వారికి సంవత్సరాది లేదు .దీనికి కారణం వారి పంచాంగం చాంద్రమానం మీద ఆధార పడి ఉండటమే .నెల వారీ పనులు ,అప్పులు తీర్చే నెల మాత్రం గుర్తుంచు కొనే వారు .సూర్య మానం ప్రకారం సంవత్సరానికి పద కొండు రోజులు తక్కువ వీరి ఏడాది .కనుక 19 ఏళ్లలో ఏడు నెలల కాలాన్ని కలుపు కొని సరి చేసుకొంటారు .అప్పుడే సూర్య సిద్ధాంతానికి సరి పోతుంది ”.Esoids works and days”ప్రకారం కంచుయుగం ముగిసి ,ఇనుప యుగం ప్రారంభం అవుతుంది .దీనితో జీవిత కాలం తగ్గి పోతుందనే భావన .మన కలికాలం లాగా అన్న మాట .పసి తనం ముసలి తనం తేడా ఉండదు .తండ్రికి కొడుక్కి పోలిక ఉండదు.స్నేహితుల మధ్య సయోధ్య ఉండదు .అన్న దమ్ముల మధ్య సఖ్యత లేదు .దేవుడంటే భయం ఉండదు .ఒకర్నొకరు తిట్టు కోవటం ,కొట్టు కోవటం ఎక్కువ అవుతుంది .పెద్ద వాళ్ళు అంటే కొద్దిగా కూడా గౌరవంఉండదు .నైతిక విలువలు ,వావి వరుసలు పాటించరు .zeus అనే దేవత మాన వాలిని అంతం చేస్తాడు .”అయ్యో నేను ఆ కాలం లో నూ లేను ,ఈ కాలం లోను లేను మధ్య ఇనుప యుగం లో ఉండి పోయానే ”అనిఒక కవి వాపోతాడు .మళ్ళీ స్వర్ణ యుగం వస్తుందని ఆశ గా ఎదురు చూస్తూ ఉంటారు జనం .అప్పటికి 139 స్థానిక జిల్లాలు అంటే demesఉన్నాయి . గ్రీకు మహిళ స్త్రీ ని అందం ,అఆకర్షణ ,తెలివి ,వంచన తో కూడిన దానిని గా గ్రీకులు భావించే వారు .ఆమె భర్త కు విశ్వాసం తో సేవ చేయాలి .తమ కంటే ఎక్కువ వయసు లో ఉన్న వారితోను ,ముసలి వారితోను చిన్న తనంలోనే ఆడ పిల్లలకు వివాహాలు చేసే వారు .ఆడపిల్లకు అయిదేళ్ళు వస్తే చాలు పెళ్లి చేసేసే వారు .అప్పటికి ఆమెకు కన్యత్వం వచ్చి నట్లే .మగాడికి ముప్ఫై ఏళ్లకు పెళ్లి వయసు .చట్టం లో పన్నెండేళ్ళు దాటినతరువాతే అని ఉన్నా అతి బాల్య వివాహాలే చేసే వారు . తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలే ఎక్కువ . రాత్రి పడక సుఖానికే ఆడది అనే భావం మరీ బలం గా ఉండేది .కన్య తలిదండ్రులనుప్ర లోభ పెట్టివివాహం చేసేవారు .పెళ్ళికి ముందు చర్చోప చర్చలు జరుగు తాయి .డబ్బు ,అధికారం మాత్రమె వరుడికి కావలసిన లక్షణాలు .ఆప్యాయతా ,ప్రేమ ,అనురాగాల వంటి మనో భావాలక్కర లేదు .పిల్లల్ని కనీ ,వంశంనిలబెట్టడమే ఆడ దాని పని .మన లాగ ”వర శుల్కం ”ఇచ్చి వరుడిని కొనుక్కోవటమే .లేక పోతే పెళ్లి జరగదు పైగా సంఘ బహిష్కరణ చేసే వారు .కట్నం ఎందుకు అంటే పెళ్ళానికి అన్నం పెట్ట టానికే నని ఘంటాపధం గా చెప్పే వారు .ఒక వేళఇద్దరికీ పడక విడాకులు ఇవ్వాల్సి వస్తే తీసు కొన్న కట్నం అంతా పిల్ల తండ్రికి తిరిగి ఇచ్చి వేయాల్సిందే .సకాలం లో చెల్లించ లేక పోతే వడ్డీ తో సహా చెల్లించాల్సిందే .పుట్టినింటినుంచి ఆమె తెచ్చుకొన్న సామగ్రిని అంతా పూచిక పుల్లతో సహా అల్లుడు తిరిగి ఇచ్చి వేయాల్సిందే .ఇది ఒక రకం గా విడాకుల తో బయట పడ్డ ఆడపిల్లలకు ఉపశమనం . మగ పిల్లలు లేకుండా తండ్రి చని పోతే ఆ ఇంటి ఆస్తి epikloros అవుతుంది .అంటే ప్రభుత్వాధీనం అవుతుంది .పెళ్లి చేసుకొంటే ,ఆమె ఆస్తిని ప్రభుత్వం తిరిగి అప్ప గిస్తుంది .దగ్గర బంధువు ఆమె ను ,ఆమె ఆస్తి నితనది అని వాదించి(claim ) పొందే అవకాశం ఉంది .ఆస్తి పరులకు దక్కకుండా ,కుటుంబం లోనే ఉండి పోవటానికే ఈ ఏర్పాటు .అందుకనే ఎక్కువ వివాహాలు బంధుత్వం లోనే జరిగేవి .అందులోనూ డబ్బున్నవారితోనే పెళ్ళిళ్ళు . పెళ్లి సంబరం వివాహం అవగానే అత్తా వారిల్లూ ,సంసార బాధ్యతలు చేబట్టాల్సిందే .పిల్లల్ని కనీ పెంచటమే పని .శీతా కాలం లో నే పెళ్ళిళ్ళు ఎక్కువ గా జరుగు తాయి మంగళ స్నానాలు చేయిస్తారు .దీన్నే loutra sacred water అంటారు .తర్వాతా విందు జరుగుతుంది  .పెళ్లి కూతురు ప్రక్కన ముసలి ముత్తైదువు కూర్చోవాలి .ఆమెను nympheutria అంటారు .ఆమె ఆధ్వర్యం లోనే పెళ్లి .చిన్న చిన్న కేకులు నువ్వులతో కలిపిఅందరికి పంచి  పెడ తారు .ఇవి ఆమె ను సంతాన వతి ని చేస్తాయనే నమ్మకం .మన ”చిమ్మిరి” లాంటిది . దంపతులను బండిలో ఊరేగిస్తారు .మంత్రాలు చదువు తారు . అత్తవారిల్లు ఊరేగింపుతో అత్తవారింట్లో ప్రవేశిస్తుంది పెళ్లి అయిన అమ్మాయి .ఇంట్లో కాలు పెట్ట గానే వక్కలు ,ఎండిన పళ్ళు దంపతుల మీద చల్లుతారు .పడకటింటి  లోకి  కాలు పెట్టే  ముందు epithalamion అనేమంత్రంబిగ్గరగా . చదువు తారు –లోపల రతి కార్యం లో ఆమె చేసే ఆక్రందనలు బయటికి విని పించ కుండా .ఇవన్నీ ప్రైవేట్ పెళ్లిళ్ళే  -ప్రభుత్వానికేమీ సంబంధం లేదు. మగ పిల్లాడినే కనాలి .మగ పిల్లాడి కోసం కుటుంబం ,సమాజం స్త్రీ పై ఎక్కువ గా ఒత్తిడి తెస్తారు .కనీసం అయిదుగురి నైనా కనాలి .రతి కార్యానికి విముఖ మైతే ఆరోగ్యం చెడి పోతుందనే ప్రచారం ఎక్కువ గాఉంటుంది .ఇంకా పూర్తిగా కన్యత్వం రాకుండానే స్త్రీలు పిల్లల్ని కనే వారు .ఆరోగ్యాలు పాడై పోయేవి .”ఈ ప్రసవం కంటే మూడు సార్లు యుద్ధానికి వెళ్లి పోట్లాడతాను ”అని మహిళ అనుకునేదని ఒక కవి రాశాడు .అంటేపాపం ఆమె అంత నరక యాతన పడేదని భావం .స్త్రీ గర్భం ధరించక పోతే ,ఆమె మీదనే అనుమానం తో బాటు అవమానం కూడా.ఆడ వాళ్ళ ను బహిరంగం గా పొగడటం నేరం కిందే లెక్క . వూలు వడకటం బట్టలు నేయటం ఆమె నిత్య కృత్యం .మగాళ్ళు వీధుల్లో గప్పాలు కొడుతూ బె ఫర్వాగా ,దసరా బుల్లోళ్ళలాగా తిరుగుతుండే వాళ్ళు .మహిళ అవసరం వచ్చి బయటకు వెళ్ళాలి అంటే బానిసలు వెంట రక్షణ గాఉండాల్సిందే . పండుగలు -పబ్బాలు –పునర్వివాహాలు       The Smophoria అనే పండుగకు మగ వాళ్లెవరు హాజరు కారు .అంత్య క్రియల్లో ఆడ వాళ్ళు పాల్గొంటారు .శవాన్ని పాతటానికి ఆడ వాళ్ళే గోతులు తవ్వుతారు .ఆడదానికి పొలం,ఇల్లూ అమ్మే హక్కులేదు .ఆస్తి సంక్రమించినా ,ఇంట్లో ఎవడో ఒక మగాడే పెత్తందారు .ఆమె కొడుకులకే అధికారాలు సంక్రమిస్తాయి . ఇరవై ఏళ్ళ కే స్త్రీలు విధవలు గా మారి పోయే వారు .కారణం” ముసలి మొగుడు -పసి పెళ్ళాం ”.యువ విధవలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు .వయసు ముదిరిన వారు వారికి ఇష్టమైతే మళ్ళీ పెళ్లి చేసుకొనేఅవకాశం ఉంది .విధవలకు ,విడాకులు పొందిన మహిళలకు తండ్రి ఇంట్లో ఆర్ధిక సౌకర్యం ఉండేది. . ఇతర దేశస్తులతో ,వేశ్య లతో ,కట్నం లేని విధవ లతో వివాహాలు జరుపుకో వచ్చు .దీన్నిpallaki అంటారు .ఆ భర్త అసలు భర్త లాంటి వాడే అవుతాడు .కాని విడాకులు పొందితే కట్నం తిరిగి రాదు .వీరిసంతానాన్ని పౌరులు గా భావించరు .ఇప్పటి వరకు మనం చెప్పు కున్నది అంతా ఉన్నత ,ధనిక కుటుంబాలకు చెందినా విషయాలు మాత్రమే . పేద ఆడ పిల్లలు ,విధవలు రోడ్ల పాలే .వారినెవరూ పట్టించుకోరు .ఎవరికీ సంబంధం లేకుండా ఆడ పిల్ల పుడితే ఆమెకు వేశ్యా వృత్తే శరణ్యం .వేశ్యలపై పన్నులు వేస్తారు .ఆమె ను female companionఅంటారు .వీళ్ళు సభలకు వెళ్ళవచ్చు .వేదాంత విషయాలలో ఆమెను సంప్రదిస్తారు .ఆమె మాటకు విలువ ఎక్కువ .మగ వారి కంటే ,ఆడ వారి జీవిత కాలంతక్కువ.మహిళ చదువు కొనే వీలే లేదు .స్త్రీ ని”మైనర్”అనే భావిస్తారు . ప్రసవం -మైల -పుట్ట్టిన రోజు పండుగ ప్రసవ సమయం లో మగ డాక్టర్లు ఉంటారు .”maia”అనే మంత్ర సాని ఉంటుంది .ఆమెను దేవత గా భావిస్తారు .పురుడు వల్ల ఇల్లు మైల పడుతుందని (pollute )భావిస్తారు .మగ పిల్లాడు పుడితే ఆలివ్ కొమ్మ ను,ఆడ పిల్ల పుడితే వూల్ ముక్క ను ముందు గది తలుపు పై  పెడ తారు .గది గోడలను పిచ్ తో అలికి మైల తగల కుండా సమాజం లోకి ఆ మైల వ్యాపించ కుండా చేస్తారు . […]

Read more