బెంగుళూరు నాగరత్నమ్మ

జనం అంతా ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టారు. ఆమె చేసిన పోరాట ఫలితం ఆ విజయం.                 1942 ఆరాధన కూడా ఇలాగే విరాళాల కోసం మద్రాసులో కచేరీలు, ఆర్భాటంగా ప్రారంభోత్సవం, పెద్ద ఎత్తున 5రోజుల ఆరాధనోత్సవాలతో జరిగింది. సమాధి దగ్గర త్యాగరాజు ప్రశంసగా నాగరత్నమ్మ పాడిన ప్రార్థనా గీతంతో ఉత్సవాలు మొదలయ్యాయి.                 1942లో మరో రకమైన సవాలు నెదుర్కొంది నాగరత్నమ్మ నగలు అమ్ముకోవడం, పరిస్థితుల మార్పులతో ఆస్తి గురించి కథలు పుట్టాయి. ఒక రాత్రి దొంగలు పడి […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

అవశేషంగా మిగిలిన దేవదాసీ వ్యవస్థ మిద 1935-37లలో దాడులు జరిగాయి. దేవాలయాలకి స్త్రీలని అంకితమివ్వడం చట్టరీత్యా నేరమని 1934లో బాంబే ప్రెసిడెన్సీ చట్టం చేసింది. కొత్తగా నిర్మాణమయిన మద్రాసు శాసనమండలి దేవదాసీల అంకితాన్ని నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. సెలెక్ట్‌ కమిటీకి దీన్ని అప్పజెప్పారు. దాని నివేదిక పూర్తయ్యేలోపే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. రాష్ట్రప్రభుత్వాల్ని సంప్రదించకుండా వైస్రాయి లార్డ్‌ లిన్‌లిత్‌గో యుద్ధంలో భారతదేశం పాల్గొంటున్నట్టు ప్రకటించాడు. దీనికి నిరసనగా మంత్రిమండలి వారందరూ రాజీనామాలు చేశారు. దాంతో ఈ బిల్లు కొన్నాళ్ళు నిలిచిపోయింది.  ఈ […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

”సమాధి దగ్గర వుత్సవం జరపాలని సంకల్పించాను” అని రాసుకుంది నాగరత్నమ్మ. ”స్త్రీలకి ఈ వుత్సవాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడమే దీనికి కారణం. ‘సద్గురువు’ ఆజ్ఞతో 1927 లో పెరట్లో వుత్సవం మొదలుపెట్టాను. ‘అల్పారంభ క్షేమకః’ అని నానుడి, (నమ్రతతో చేసిన ప్రారంభం శుభాన్ని జయాన్ని ఇస్తుంది.) దేవదాసీల పాటలు (అప్పట్లో మద్రాసులో ప్రఖ్యాతి పొందినవి)పాడేవారు, కచేరీలు చేసేవారు. తంజావూరు పండితులూ, ఎందరో స్త్రీలు భక్తిశ్రద్ధలతో నాకు సాయం చేశారు. తంజావూరు రాజు బంధువు శ్రీ రాజారాం సాహెబ్‌ సాయం వల్ల ముందు వైపు వున్న […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

మద్రాసు మేయరుకోర్టుని గుర్తిస్తూ, పునర్నిర్మిస్తూ 1727లో రాజఫర్మానా జారీ అయ్యింది. దాని ప్రకారం వుత్సవాల్లో, వూరేగింపుల్లో నాట్యకత్తెలు రాగతాళయుక్తంగా ఆటాపాటా సాగించడానికి అనుమతించారు. ఈ భోగం మేళం క్రమంగా దేవదాసీల కళగా గుర్తింపు పొందింది. అప్పట్లో సమాజంలో విభిన్న అభిప్రాయాల్ని సహించే వాతావరణం వుండేది. బ్రిటిష్‌ పాలకులు, నవాబులు తమ పరివారంలో నాట్యకత్తెలను వుంచుకునేవారు. దేవదాసీల విషయాల్లో న్యాయస్థానాలు ఎక్కువగా కలగజేసు కోవాల్సివచ్చేది. ఆలయాల్లో వారసత్వపు హక్కులూ, ఆస్తిహక్కు, దత్తత, ధర్మకర్తల పక్షపాత ధోరణులు వగైరాల గురించి తరుచు వ్యాజ్యాలు వేసేవారు దేవదాసీలు. దురాశాపరులైన […]

Read more

బెంగుళూరు నాగరత్నమ్మ

1909 లో ఆరాధన చాలా బాగాజరగడంతో ఇదే ప్రణాళిక రానున్న కాలంలో కూడా అమలు జరగాలని తిలైలస్థానం సోదరులు నిర్ణయించారు. జనాదరణతోపాటు మలై క్కోటై గోవిందస్వామి పిళ్ళైలాంటి విద్వాంసుల సహకారం వుండడంతో 1910 ఆరాధన ఘనంగా జరిగింది.23 సోదరులిద్దరూ ఒకే మాటగా పనిచెయ్యడం చూసి ఓర్వలేనివారూ వున్నారు. వాళ్ళ కుతంత్రాల వల్ల ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఆర్థిక విషయాల గురించి పరస్పరం అనుమానాలు మొదలై 1910 చివరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోని స్థితికి చేరారు. 1911లో ఆరాధన నాటికి నరసింహ భాగవతార్‌ తాను […]

Read more

కేర్ టేకర్

రచయిత్రి;సి.ఉమాదేవి ఉమాదేవి గారు జూనియర్ కాలేజిలో పబ్లిక్ అడ్మినిస్రేషన్ లెక్చరర్ గా,అనుబంధ పాఠశాలకు కో ఆర్డినేటర్ గా,వైస్ ప్రిన్సిపల్ గా విద్యారంగానికి తగిన సేవలందించి,ఆపై ఫౌండర్ ప్రిన్సిపల్ గా శ్రీనగర్ విద్యానికేతన్ స్తాపించి తన పర్యవేక్షణలో విద్యార్ధినీ , విధ్యార్ధులకు విద్య నందించారు.ఎన్ని పనులున్నా మనసు మాత్రం రచనాభిలాష నుంచి మరలిపోలేదు.అన్ని ప్రక్రియలలోను రచనలు చేసారు. స్కూల్ పిల్లలకై చిన్నచిన్న నాటికలు,లలితగీతాలు,కవితలు రాసి బాలానందంలో పిల్లల ద్వారా ప్రసారం చెయ్యడం,ఆకాశవాణిలో చదివిన కథలు,మహిళాసమాజంలో పాలుపంచుకున్న చర్చా కార్యక్రమాలు , విస్సా టి.విలో ఇంటర్వ్యూ, ఈటివిలో […]

Read more