అంకురించని అంతం

మా బాల్కనీకి ఎదురుగా ఉన్న పేవ్‌మెంటుమీద, ఎనిమిదికీ పద్నాలుగేళ్ళకీ మధ్య వయస్సులో ఉన్న కొందరు పిల్లలు ముక్కు ముందు జేబురుమాళ్ళో, గుడ్డపీలికలో అడ్డం పెట్టుకుని వరసగా కూర్చుని కనిపిస్తూ ఉండేవారు. చూసి చూసీ, అర్థం కాక ‘వాళ్ళ ముక్కుల ముందున్న గుడ్డలేమిటని?,’ ఒకరోజు పనమ్మాయిని అడిగేను. “భాభీ, వాళ్ళు నషా చేస్తున్నారు” అందామ్మాయి. ‘ఇదేమి నషా’ అని అడిగితే వివరించింది తనకున్న పరిజ్ఞానంతో- స్టేషనరీ దుకాణాల్లో అమ్మే టైప్ రైటర్ ఎరేసర్ (వైట్నర్) కొనుక్కుని, మత్తెక్కడానికని దాని వాసన పీలుస్తూ ఉంటారని. ఈ వైట్నర్లు […]

Read more

జోగిని

సన్నగా గొణిగింది.  ఆమె గొణుగుడూ ఆమెనీ అర్థమయీ అర్థం కానట్లు … చూస్తూ… కానీ ఆమె ఎవరో మాత్రం అర్థం అయినట్లుంది. అందుకేనేమో, మళ్ళీ తానే చనువుగా ” పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అంత తీవ్ర ఆలోచన చేస్తున్నారేమిటో…” అన్నాడతను. ఏమిటి అసలు ఇతను ఏమనుకొంటున్నాడు. ఆరేళ్ళ పిల్లాడి నుండి అరవై ఏళ్ళ ముసలి వాడి దగ్గర వరకూ ఆడపిల్ల అంటే అందరికీ లోకువే.. చులకనే… అవకాశం ఎలా దొరుకుతుందా… ఎప్పుడు దొరుకుతుందా… అని ఎదురు చూస్తుంటారు. అందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. […]

Read more

గౌతమీ గంగ

రూపాయలు దీస్తే ధనం బాగా అర్జిస్తాడు. అదే విధంగా ఆడపిల్లకు కుంకుమభరిణ తీస్తే ఐదవతనం కలదీ, పూలు తీస్తే అలంకార ప్రియురాలు, బంగారు నగలు తీస్తే ఐశ్వర్యవంతురాలు అవుతుందని నమ్మేవారు. పండ్లు తీస్తే సంతాన వంతురాలు అవుతారని నమ్ముతారు. సీత కుంకుమ బంగారం తీసింది మంచిదే మరి పళ్లు తీయలేదే పిల్లలు కలుగుతారా? అందరి మదిలోనూ ఇదో సందేహం అయింది. వీరికి హారతి ఇచ్చి పీటల మీద నుంచి లేవతీసాక రత్నాన్ని, సత్యాన్ని పునస్సంధానం పీటల మీద కూర్చోబెట్టారు.     ఔపోసన మంత్రాలూ, హోమాలూ […]

Read more

భూ భమ్రణంలో మనిషి

శతాబ్దాల నిరీక్షణను కళ్లలో నింపుకొని జీవన ప్రవాహంలో ఈదులాడుతూ తన ఉనికి కోసం పోరాడుతున్న మనిషి ఫలితం దక్కని అన్వేషణలో కాలం విసిరేసిన బంతిలా కొట్టుకుంటున్నాడు. కన్నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నా తమ దోసిళ్లతో నింపుకోవాలని చూసే శాడిజం వీధి వీధిలో నిర్భయంగా సంచరిస్తోంది. కడుపు ఆకలితో మండినప్పుడు ఆశయాలు ఎండిపోయి ఆదర్శాలు అమ్ముడుపోతున్నాయి. వాల్‌ పోస్టర్ల వర్ణచిత్రాలను కళ్లలో పిండుకుంటూ, గుటకలు మింగుకుంటూ పాన్‌మెయిల్‌ పెంచే యువతరం ప్రతిభ గిరిశిఖరం నుండి అగాధంలోకి దబ్బున పడిపోతున్న చప్పుడు. కాలానుగుణంగా రంగుల్ని మార్చే ఊసరవెల్లుల్లాంటి […]

Read more

బాణమై కిరణమై

  అరాచకత్వానికి ప్రేమని పేరు పెట్టి దాని గొంతు కోసే మగాడిని ఆడపిల్ల చూచే చూపే బాణమై కిరణమై సూదిమొన మరణమై కళ్ళలోన కారమై ఆడదే ఆధారమై మతులు చెడి బతుకు చెడి వళ్ళు చెడి  ఇల్లు చెడి దుమ్ములోన ధూళిలోన రోడ్ల పైన గట్ల పైన పిచ్చివాడై బిచ్చగాడై ఆకలికి అలమటిస్తూ అయినవారికి దూరమై ఎవరికీ కానివాడై చావలేక బ్రతక లేక చావుకోసం ఎదురుచూస్తూ చేసిన తప్పుకు చింతిస్తూ ఆడపిల్ల ఉసురుపోసుకుని అధముడై పోయేవాడిపై జాలెవరికి? దయెవరికి? అసలు జాలేందుకు? దయెందుకు? పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Read more

దేహక్రీడలో తెగిన సగం

ఆడి  పాడే అమాయకపు బాల్య  దేహం పై.. మొగ్గలా  పొడుచుకు వస్తున్నప్పుడు.. బలవంతంగా   జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై.. వసంతం విరిసినప్పుడు…. వీడని అమాయకత్వం  నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు  నఖశిఖ పర్యంత చూపులతో.. గుచ్చి గుచ్చి తడిమినప్పుడు..  లోలోపల భయం, గగుర్పాటు తో  అప్పటిదాకా లేని సిగ్గు తెర పైట అయి  తనువంతా  చుట్టుకునే ముగ్ధత్వం  కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా మోహపు పరవశంతో ఉప్పొంగినా    .. నలిగిన  మేనుకు   అవే  తరగని అలంకారమని  సగభాగం […]

Read more