రేపటి బంగారు తల్లులు (సంపాదకీయం)

రేపటి బంగారు తల్లులు ప్రతి తల్లీ తన కూతుర్ని బంగారు తల్లిలాగే భావిస్తుంది . పిలుచుకుంటుంది కూడా . కానీ లేడి పిల్లల్ని వేటాడే పులులున్న మన సమాజంలో ఎన్ని పసి మొగ్గలు నేలరాలుతున్నాయో చూస్తుంటే మన ఆడపిల్లల్ని బయటకి పంపటానికే భయపడే రోజులొచ్చాయి . ఎంతో మంది బంగారు తల్లుల జీవితాల్ని చీకటి కూపాల్నుంచి బయటకు తీసుకు వస్తున్న సునీతా కృష్ణన్ అభినందించ తగ్గవారు . ఈ మధ్య ప్రత్యేకంగా ఆమె రూపొందించిన “ బంగారు తల్లి “ అందరికీ ప్రీతి పాత్రమైంది […]

Read more

మనిషితనం, మంచితనం కోసం పుష్పించిన ‘పట్టుకుచ్చుల పువ్వు ‘

                      శ్రీ దాసరాజు  రామారావు గారి వచనకవితా సంకలనం ‘పట్టుకుచ్చుల పువ్వు ‘ చిక్కని కవితల సమాహారం. ఈ కవితా సంకలనం లో పదకొండేళ్ళ  నాటి కవితలు మనకు కనిపిస్తాయి . ఈ కవితల్లో మారుతున్న దేశకాల మాన పరిస్తితులతో పాటు తెలంగాణా ప్రాంతపు జీవన స్థితిగతులకు రాజకీయ సామాజిక ఆర్ధిక వ్యవస్థల్లో వచ్చిన పెనుమార్పిల్ని అక్షరీకరించడం మనం గమనించవచ్చు. తన ప్రాంతంపై(తన నేలపై )కవికున్న స్వాభిమానం భావతీవ్రతగా మనకు గోచరిస్తుంది. ఈ కవితాసంకలనంలో మొత్తం ముప్పది ఎనిమిది కవితలు చేర్చి ముద్రించారు. అందులో పదకొండు కవితలు తెలంగాణా […]

Read more

సమకాలీనం-జోగినుల పిల్లలకు తల్లిపేరు చాలు- ప్రభుత్వ జీవో 139

జోగిని పిల్లలకు తల్లి పేరు చాలట. సర్టిఫికేట్లలో తండ్రిపేరు అవసరంలేదట. రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ వార్త తండ్రి పేరు లేనందువల్ల పరీక్షలురాయడానికీ, పాఠశాలలో లేదా కాలేజీలో చేరడానికి అర్హత కోల్పోయిన ఎందరో జోగినుల పిల్లలకు ఊరట కలిగిస్తుంది. అనాదిగా జోగినుల కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యకు దూరమౌతూనే ఉన్నారు. అధికారిక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పదిహేడువేల మంది జోగినులు ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్లో పదివేల మంది ఉన్నట్లు అంచనా!  ఆచారం పేరుతోనో, ఊరికి, దేవునికి సేవ పేరుతోనో ఆరంభమయ్యే ఈ వివక్షపూరిత […]

Read more

తిరిగి ప్రవాసానికి…

”హమ్మయ్య! ఇప్పటికి కుదిరిందండీ మన జనం లోకి రావటానికి!ఎలాగైనా మన హైదరాబాద్ వాతావరణం,ఇక్కడి జీవితమేవేరనుకోండి.మన పిల్లలు హాయిగా తెలుగు మీడియంలో చదువుకుంటారు. చక్కని తెలుగు నేర్చుకుంటారు.వారానికోమాటుఊరెళ్ళి వ్యవసాయం చూసుకుంటూండచ్చు.”అలివిమాలిన తృప్తీ  ఆనందమూ కన్నుల్లో, చెంపల్లో తళుకులీనుతుండగా భర్తకళ్ళల్లోకి చూస్తూ అంది ప్రసూన. ”అవునోయ్ మరి ఈ ట్రాన్స్ఫరుకి అంతగా శ్రమించి ,ప్రయత్నాలు చేసింది ఎందుకనుకున్నావ్ ?  ఈ సౌకర్యాల కోసమేగా? మనమొస్తున్నట్టు కబురంది మా భువనగిరి చెల్లి నిన్న సాయంత్రానికే ఎలా పరిగెట్టుకొచ్చిందో చూసావా!… ఊ ….ఇంతకీ ఇల్లెలా  వుంది?నీకు నచ్చిందా?”ఉత్సాహంగా అడిగాడు హరీంద్ర. […]

Read more