“లోక నింద”(కవిత ) – డేగల అనితాసూరి.

రాజ్య కాంక్ష సత్య ధర్మ ప్రలోభం కీర్తి కండూతుల తపన వంశ ప్రతిష్టల డాంభికం స్వర్గ వాసపు మోక్ష పిపాస తనకుమాలిన శీల పరీక్ష ప్రజాసంక్షేమపు ముసుగుతో నిర్ధాక్షిణ్యంగా వ్రతం చెడిన పాతివ్రత్యానికి వనవాసపు వెలివేసి వేడుక చూసింది! నట్టనడి సభలో వలువలూడ్వ బోయింది! నగర నడిబొడ్డున వేలమేసి అమ్మింది! పాషాణ హృదయంతో కఠిన శిలగ మార్చింది! ఏమార్చి సబలను చేయగ మూడవ కన్ను కాజేసింది! అయినా .. ప్రశ్నించిన నేరానికి పలుకాకులన్న నిందనుమోస్తూ తరతరాలుగా బలౌతోంది మాత్రం.. పా..పం! పిచ్చి దైన ఈ […]

Read more

ఓ రాత్రీ…!(కవిత )- అనితా సూరి డేగల

నా కన్నీళ్ళను నీ తలగడ గుండెలో పొదువుకుని నా దుఃఖాన్ని నీ దుప్పటి ఒడిలో దాచుకుని నా వెక్కిళ్ళకు నీ కీచురాళ్ళ రొదను జతచేసి నా ఓదార్పుకు నీ స్వప్నాలను ఊహగా ఇచ్చేసి నా కష్టాలకు నీ చీకటిని తోడిచ్చి నా సంతోషాలకు నీ వెన్నెలను పంచిచ్చి వెళ్ళిపోయావా.. వేకువ వచ్చేసి మళ్ళిపోయావా.. మెలకువనిచ్చేసి                                        – డేగల […]

Read more

*గ ‘మ్మత్తు ‘ తెర*(కవిత )-డేగల అనితా సూరి

బలహీనతల బంధనాల్లో రంగుల ప్రపంచం బందీ అయ్యాక జనం మనసులకు వలవేసి వల్లించిన నీతులు సందేశాలు పొగ చూరిపోయి కిక్కిచ్చే మాఫియా బాహుబలికి సాహో అంటూ సాగిలబడుతోంది ఆదర్శాలన్నీ వెండితెరపై  క్రుమ్మరించి  మాయపొరల వేదికపై ప్రక్కదారిలో ప్రదర్శింపబడుతోంది అభినవ ‘నట ‘ వైభవం! అభిమానపు మత్తు తలకెక్కించుకుని తనను తన వాళ్ళను విస్మరించి శ్రమను రక్తాన్ని భవితను అనాలోచితంగా ధారపోసే నేటి యువత మాత్రం వీడలేకుంది పైత్యపు కళ్ళను కమ్మేసిన కెమెరా నీడల నీలి జత  -డేగల అనితా సూరి ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more

గురువుస్థానం(కథ )- డేగల అనితాసూరి

తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. అంటే..దైవానికన్నా గురువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నమాట. తల్లి తండ్రి జన్మను, అవసరాలను చూస్తే సంస్కార వంతంగా ఆరోగ్యకరమైన మానసిక అభివృద్ధితో వికసించే మనుషులుగా తీర్చిదిద్దేది గురువులని అర్థంతో. కానీ నేటి గురువులు వారే నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు నలుగురిలో తమ విలువలు పోగొట్టుకోవటమే కాకుండా తమ పిల్లల గురువుల్ని తల్లిదండ్రులు అనుమానించే రీతిలో వారి స్థాయిని దిగజార్చుకుని మంచి గురువులకు కూడా గుర్తింపు లేకుండా చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా తాను గురువుని వీళ్ళు నా […]

Read more

నానీలు -శ్రీమతి డేగల అనితాసూరి

స్వచ్ఛభారత్ నినాదంతో చీపురు ఎత్తింది సెలబ్రిటీ అవతారం ఉత్తరాల సమాధి పైకెక్కి జెండా పాతాడు సెల్ వీరుడు ఎవరు నేటి బాహుబలి? డెంగ్యూ స్వైన్ ఫ్లూల్ని మోసుకొచే దోమే చెలీ! కందిరీగ ఈగ ఏదైతేనేం వెండితెరపై ‘హిట్ ‘ కొట్టాల్సిందే ప్రతి పనికీ మోకాలడ్డం సంక్షేమానికైనా దారివ్వదు ప్రతిపక్షం! నమ్మకం సన్న గిల్లింది మోసం పెంచిన సిక్స్ ప్యాక్ ని చూసి!                               –శ్రీమతి […]

Read more

“నానీలు” – డేగల అనితా సూరి

“నానీలు” గిన్నెకున్న సొట్టలు చెప్పాయి ఆ ఇంట ఎన్ని విసుగులున్నాయో!       ***** ఎటుచూసినా చినుకుల చెట్లు పూశాయి గొడుగు పూలు           **** సిరా బుడ్డి ప్రేమలేఖ రాసేదొకప్పుడు కాదంటే యాసిడ్ బాటిలైందిప్పుడు        **** ముఖాన్ని దాచింది స్కార్ఫ్ సభ్య సమాజం తల వాల్చుకుంది – డేగల ఆనితాసూరి ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Read more