అద్దంలో….

మనల్ని మనం చూసుకోలేని తనం మనది.. అయినా…నేనున్నా..మీ కోసం అంటూ.. అద్దం మనకి మనల్ని చూపిస్తుంది…అచ్చంగా… నిజం…స్నేహం కూడా .. స్వచ్చమైన చెలిమి అద్దమై మనలోని మనల్ని చూపిస్తుంది… చిన్న రాయి తగిలితే…పగిలే అద్దంలా… అపార్ధాల భేదాలు స్నేహాన్ని  విచ్చిన్నం చేస్తాయి… అద్దంలో ప్రతిబింబంలా.. ఒకరిలో..ఒకరిగా మెలిగే చెలిమే.. కలకాలం తరగని కలిమిగా మిగులుతుంది…!! – సుజాత తిమ్మన ““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““`

Read more

సంపాదకీయం

మనసు పుస్తకానికి ముఖమే దర్పణం … మనసులోని భావాలేవో మొఖంమీదే ప్రతిబింబిస్తాయి. అద్దంలో చూసుకుంటే వున్న లోపాలతో సహా ఆ మొఖమే కనిపిస్తుంది కానీ లేని సౌందర్యాన్ని చూపించదు కదా! రాసుకోవటానికి గోడ వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు విషపు గీతలు గీస్తే… ఏమవుతుంది? స్త్రీలపై , విద్యార్దినులపై , దళిత , మైనారిటీ వర్గాల పై చివరికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై కొంతమంది వ్యక్తులు తమ పైత్యాన్నంతా ముఖపుస్తక గోడల మీద కుమ్మరించిన వైనం యువతనీ […]

Read more