“విశ్వ విజ్ఞాన విదుషి“ మాలతీ చందూర్

  images    

ప్రముఖ రచయిత్రి , నవలా కారిణి , కాలం రచయిత్రి మాలతీ చందూర్ అస్తమయం అన్న వార్త చూడగానే కదిలే విజ్ఞాన సర్వస్వం హఠాత్తుగా కుప్ప కూలినట్లు అనిపించింది .జనన మరణాల పట్టికలో ఆమె వయసు 84 సంవత్సరాలే కావచ్చు కాని ఆమె సాహిత్యలోకంలో ఎప్పటికీ సజీవురాలే.ఆమె స్పృశించిన సాహిత్య ఖజానా ఎప్పటికి తరగనిది . ఎన్ని తరాలైనా వన్నె తరగనిది .

ఆ తరానికీ , ఈ తరానికీ ఏ తరానికైనా ఆమె ఆత్మీయ బంధువే . ప్రపంచంలోని ఏ విషయాన్ని గురించి అడిగినా తడుముకోకుండా రాజకీయాల దగ్గర నుంచి పాక శాస్త్రం దాకా తమ విజ్ఞానాన్ని పంచి పెట్టారు . కమ్యూనిజం అయినా , మానవతా వాదమైనా ,సాహిత్యమైనా , స్త్రీల సమస్యలైనా మాలతీ చందూర్ కలంలో పోస్తే గాని తీర్ధం కాదు అన్నట్లు ఉండేది .సుమారు 50సంవత్సరాల క్రితం మన పెద్దల తరం నుండి ఆమె రాస్తున్న రచనలు కాలానుగుణంగా ప్రతి ఫలిస్తూ అందరి హృదయాలను ఆలోచనలతో కదిలించారు .

ఆంధ్ర ప్రభలో 47సంవత్సరాల పాటు ‘ప్రమదావనం’ అనే కాలమ్ ని నిర్వహించారు .ఒక రచయిత్రి / రచయిత ఇంత కాలం పాటు ఒక కాలమ్ ని కొనసాగించడం ప్రపంచ రికార్డ్ .  ఈ శీర్షికలో ఎంతో మంది వ్యక్తిగత సమస్యలకి , సామాజిక సమస్యలకి , సాహిత్యానికి మొదలైన అంశాలకి సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారు .   ఆమె శీర్షికల   ద్వారా నిన్న మొన్నటి వరకు స్త్రీలు ఆత్మ విశ్వాసంతో జీవితాలను చక్క దిద్దుకున్నారు ..ఆమె జవాబుల ద్వారా ఎంతో మంది స్ఫూర్తి ని పొందారు .ఉన్నత విద్యావంతులయ్యారు
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద బైండింగ్ పుస్తకం ఉండేది . మా అమ్మ , నాన్నమ్మ ఆ పుస్తకాన్ని తరచూ ఎంతో ఆసక్తితో చదువుతూ ఉండేవారు . నేను కూడా హైస్కూల్ దశలో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని చదివేదాన్ని . ఆంద్ర ప్రభలో మాలతీ చందూర్ నిర్వహించిన ప్రమదావనం పేజీలను కత్తిరించి కుట్టిన పుస్తకం అది . స్త్రీలు అడిగే రకరకాల ప్రశ్నల్ని , వారి సమస్యల్ని , ఆమె ఇచ్చే జవాబుల్ని చదువుతూ ఉండేదానిని .విద్యార్ధి దశలోనే ఎన్నో విషయాలని తెలుసుకోవడానికి ఆ పుస్తకం నాకు ఎంతగానో ఉపయోగపడింది. 

తెలుగు సాహిత్యానికి మాత్రమే పరిమితమైన  అనేక మంది తెలుగు చదువరులకి ఇతర భాషా సాహిత్యాలని “ పాత కెరటాలు “ పేరుతో స్వాతి మాస పత్రికలో పరిచయం చేసిన ఘనత ఆమెదే . ఆంగ్ల భాషా సాహిత్యంతో పాటు ఇతర ప్రపంచ భాషల్లోని అమూల్యమైన నవలల్ని సుమారుగా 350 కి పైగా తెలుగు చదువరులకి పరిచయం చేసారు .ఆమె పరిచయం చేసిన నవలల ద్వారా ఎంతో మంది సాహితీ ప్రియులు ఇతర భాషా సాహిత్యాన్ని ప్రేమించటం , చదవటం అలవాటు చేసుకున్నారు . స్వాతి వార పత్రికలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన “ నన్ను అడగండి “కాలమ్ ద్వారా కొత్త తరం చదువరులకు ఆమె బాగా దగ్గరయ్యారు .

ఆమె తొలి కథ ‘ రవ్వలడ్లు ‘ ఆనందవాణి పత్రికలో ప్రచురితమైయింది .వీరు రాసిన నవలలో హృదయ నేత్రి , చంపకం , చీడ పురుగులు ,ఆలోచించు , రెక్కలు – చుక్కలు , మనసులోని మనసు , లావణ్యం , కాంచన మృగం , వంటి నవలలు వ్యక్తుల్లోని భావావేశాలు , సామాజిక కట్టుబాట్లు , మానవ సంబంధాల్ని ప్రతిఫలిస్తాయి . కేవలం సంక్షిప్తంగా నవలను పరిచయం చేయడమే కాకుండా ఎన్నో నవలల్ని పూర్తి స్థాయిలో అనువదించారు . వీటితో పాటు ఆమె పాక శాస్త్రం లోను ప్రావీ ణురాలే . ఈమె రచించిన వంటలు – పిండి వంటలు పుస్తకం భోజన ప్రియుల మనసుల్ని కూడా చూరగొన్నది . ఎన్నో సార్లు పునర్ముద్రణలకు నోచుకుంది .

తొలి నవల ‘ హృదయ నేత్రి ‘ కి 1992 లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుతో పాటు ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు , భారతీయ భాషా పరిషత్ అవార్డు , పద్మావతి మహిళా విశావిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ , తెలుగు విశ్వ విద్యాలయం అవార్డు తో పాటు సుమారు 16 కి పైగా అందుకున్నారు .

మాలతి కవి,రచయిత అయిన ఎన్.ఆర్.చందూర్ ని వివాహం చేసుకున్నారు. ఎన్.ఆర్.చందూర్ స్థాపించిన జగతి పత్రికను  చాలా కాలం నడిపారు మాలతి.వారికి పిల్లలు లేరన్న మాటేగాని ప్రపంచ సాహిత్య అభిమానులంతా వారి పిల్లలే .

రచయితలు పుడతారు , పోతుంటారు . సమాజానికి మేలు చేసే రచనలు చేసి చదువరుల్ని ఉత్తేజింప చేసి , ఆలోచింప జేసే వారు ఎంతో మంది ఉన్నారు .కానీ హారంలో మణి పూసలా అత్యున్నతమైన స్థానాన్ని , ప్రత్యేకతని సంతరించుకున్న మాలతీ చందూర్ లాంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకరు రారు . ఆమె ప్రత్యేకత ఆమెకే సొంతం .

‘ విశ్వ విజ్ఞాన విదుషి ‘ మాలతి చందూర్ కి ” విహంగ ” నివాళులు అర్పిస్తుంది.

–  హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సంపాదకీయంPermalink

5 Responses to “విశ్వ విజ్ఞాన విదుషి“ మాలతీ చందూర్

  1. Pingback: తెలుగువారి హృదయనేత్రి మాలతీ చందూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో