ఎనిమిదో అడుగు – 6

హేమేంద్ర ఆగ్రహోదగ్రుడై ఫ్రెండ్స్‌ వైపు చూస్తూ, ‘‘ ఆ లైట్‌ బ్లూ కలర్‌ డ్రస్‌ అమ్మాయి నాకు చాలా ద్రోహం చేసిందిరా! నిన్న మా అంకుల్ని హస్పిటల్లో చూస్తుండమని చెప్పి నేను కాలేజికి వస్తే ` ఆయన్ని మధ్యలో వదిలేసి వెళ్లింది. ప్రభాత్‌ నాతో మాట్లాడటం లేదు….’’ అంటూ జరిగింది చెప్పాడు. 
నీరజ్‌ తన ప్రేమ వ్యవహారాన్ని మెరుపువేగంతో పక్కకి నెట్టి ‘‘ వెంటనే వెళ్లి అలా ఎందుకు చేసిందో నిలదీసి అడుగు హేం! మన జూనియరేగా! భయమెందుకు?’’ అంటూ దగ దగ మండుతున్న మంటలో నాలుగు ఎండు కట్టెల్ని వేశాడు. 
‘‘రక్తం చిమ్మేలా పెదవిని కొరుకుతూ నిలబడ్డాడు హేమేంద్ర. 
‘‘వాడితో మనం కూడా వెళ్లి మాట్లాడదాం….’’ అన్నాడు దానికి సపోర్ట్‌గా ఇంకో ఫ్రెండ్‌… హేమేంద్ర కోపాన్ని కొద్ది కొద్దిగా కంట్రోల్‌ చేసుకుంటూ ‘‘వద్దు! మీరుండండి! నేకొక్కడినే వెళ్తాను.’’ అంటూ ఒక్కడే వెళ్లి చేతనను ఉద్దేశించి ‘‘హలో! ఇలారా!’’ అన్నాడు. 
…. అతన్ని చూడగానే ` ‘హస్పిటల్‌లో ఒక సారు దగ్గర నన్ను వదిలేసి వెళ్లింది ఇతనే కూదూ! పాపం ఆయనకి ఎలా వుందో ఇప్పుడు?’ అని మనసులో అనుకుంటూ అతని వైపు వెళ్లబోయింది. 
చేతన చేయి పట్టిలాగి … ‘‘అతను మన సీనియర్‌! వెళ్లకే…’’ అన్నారు పక్కనున్న అమ్మాయిలు. 
  ‘‘అయితే ఏం?’’ అన్నట్లుగా చూసింది చేతన. 
  దానికి జవాబుగా అమ్మాయిల కళ్లలో ఏదో బెదురు. ఏం కాదు అన్న భావంతో చేతన భుజాల్లో చిన్న కుదుపు. భయభయంగానే చేతన వెంట నడిచారు అమ్మాయిలు.
‘‘ఉద్యమానికి  కదిలినట్లు మీరంతా ఎక్కడికి?’’ అన్నాడు హేమేంద్ర. అతని గొంతులోని కరుకుదనానికి జంకి అక్కడే ఆగి ‘ఇది ఈ రోజు బలి’ అనుకున్నారు అమ్మాయిలు. 
స్నేహిత మాత్రం అందరిలా ఆగిపోకుండా చేతనతో వెళ్లింది. 
చేతనపై నుండి తన చూపుల్ని స్నేహిత వైపు మళ్లించి ‘‘ఏంటమ్మా! నీ స్పెషల్‌? యుద్ద భూమిలో నాదో పెద్ద పాత్ర అన్నట్లు వస్తున్నావ్‌! ఆగక్కడే’’.అన్నాడు హేమేంద్ర…
స్నేహిత వణికినట్లై ‘‘ఏంటే వీడు! నీవెంట పడ్డాడు?’’ అని చేతన చెవి దగ్గర గుసగుసగా అంటూ ఆగిపోయింది స్నేహిత. 
  ర్యాగింగ్‌ని బ్యాన్‌ చెయ్యటంతో జనాలు పెద్దగా తిరగని చోటుకెళ్లి నిలబడ్డాడు.  చేతన అతనికి దగ్గరగా వెళ్లి…‘అంకుల్‌కి ఎలా వుంది’’? అని  ఆడగబోయింది.  
  ఈ లోపలే…. ‘‘నువ్వు నా జూనియర్‌వి, ముందుగా నన్నెలా విష్‌ చెయ్యాలో తెలియదా?           ఆ మాత్రం  నాలెడ్జి లేని దానివి బి.ఫార్మాసిలో ఎందుకు జాయిన్‌ అయ్యావ్‌? ఏ డిగ్రీలో చేరినా సరిపోయేదిగా? మాలాంటి వాళ్ళనిలా ఇన్‌సల్ట్‌ చెయ్యటానికా? ఓ పెద్ద పోజ్‌ మళ్లా!’’ అన్నాడు వ్యంగ్యంగా. 
… మండింది చేతనకు, తన చేతిని గాల్లో లేపి అతని ముఖం ముందు ఆడిస్తూ ‘‘పద్దతిగా మాట్లాడటం రాదా మిాకు? మీ దగ్గర నాకు పోజెందుకు?’’ అంది. 
కంగుతిన్నాడు హేమేంద్ర.  ఉక్రోషంతో మీదకి వురికే పులిలా చూస్తూ ‘‘ ఆఫ్‌ట్రాల్‌ నా జూనియర్‌వి  నువ్వు… మాట్లాడేముందు నేను నీ సీనియర్‌ని అన్నది గుర్తుంచుకో….’’ అన్నాడు. 
 
‘‘నేను మీ జూనియర్‌ని. కరక్టే! నాకు లేని కొమ్ములు మీకున్నాయా? నేనేం మాట్లాడకముందే నాకు పోజని, నాలెడ్జి లేదని ఎందుకంటున్నారు? ఇలా జూనియర్లని చిన్న చూపు చూడటం, జూనియర్లంటే మనుషులు కానట్లు మాట్లాడటం, మీరు కూడా ఒకప్పుడు జూనియర్లన్న విషయం మరచిపోవటం, నాకెందుకో సిల్లీగా అన్పిస్తోంది… పైగా ఇలా చెయ్యటం ర్యాగింగట.   ప్యూచర్లో ఫ్రెండ్లీగా వుండటానికి ఇదో దారి అట…. అసలేం పద్దతండీ ఇదీ?’’ అంది చేతన. 
హేమేర్రద ఉలిక్కిపడి ‘‘అమ్మనీయమ్మ’’ అని లోపల అనుకుంటూ తర్వాత సూటిగా ఆమెనే చూస్తూ  ‘‘స్ట్రైట్‌గా అడుగుతున్నా చెప్పు ! ప్రబాత్‌ వచ్చేంత వరకు హాస్పిటల్‌లో ఎందుకుండలేదు.  వుండమని నేను నిన్ను రిక్వెస్ట్‌ చెయ్యలేదా? అలా ఒంటరిగా వదిలేసి వెళ్లడమేనా?’’ అన్నాడు కోపంగా. 
‘‘ఒంటరిగా వదిలేసి వెళ్లింది నేనా? మీరా? ఆయనపట్ల బాధ్యత వుండాల్సింది నాకా? మీకా? అది మరచిపోయి నన్ను బ్లేమ్‌ చేస్తారెందుకు?’’ అంది.  
అప్పటికే హేమేంద్ర ఫ్రెండ్స్‌ వచ్చి చేతన చుట్టూ నిలబడ్డారు.  హేమేంద్రకి కోపం తారా స్థాయికి చేరుకొంది.  ‘‘నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలియటం లేదు.  నేను వెళ్తాను. మీరాడుకోండిరా!’’ అంటూ వెళ్లాడు హేమేంద్ర. 
ఆ నలుగురిలో ఏదో ఉత్సాహం… వెంటనే చేతన వైపు చూసి ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తూ. టెల్‌మీ అంటున్నారు.  ఫ్రెండ్స్‌కి తనని అప్పజెప్పి వెళ్తున్న హేమేంద్రను చూస్తుంటే ఆ రోజు పెద్దాయన్ని ఆటోలోంచి దించలేక ఆవస్థపడ్తుంటే తను హెల్ప్‌ చెయ్యటం గుర్తొచ్చి కృతఘ్నుడనిపించింది…
వాళ్లు నలుగురు ఆమె చుట్టూ చేరి ఒక్కొక్కరు ఒక్కో టైపులో ఒకరు భరత నాట్యం చేస్తే, ఇంకొకరు కూచిపూడి చేస్తున్నారు.  ఒకరు ఒడిస్సి చేస్తే, ఇంకొకరు కథక్‌ చేస్తున్నారు.  నీరజ్‌ మాత్రం చేతన ఏడిస్తే ఎలా వుంటుందో ఏడ్చి చూపిస్తున్నాడు. 
అంతలో లెక్చరర్స్‌ వస్తున్నట్లు కన్పించి ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. 
         **                **                          **                                 **                                    **                               **                     
రోజులు గడుస్తున్నాయి. 
చేతన వుండే హాస్టల్లో ఆమె సీనియర్స్‌ వున్నారు.  కొత్త కాబట్టి వాళ్లెవరో చేతనకి తెలియదు.  
  డైరెక్ట్‌ ఎటాక్‌ చేసినట్లు నలుగురు సీనియర్స్‌ చేతన వున్న గదిలోకి వెళ్లారు.  ఆ గదిలో వున్న మిగతా అమ్మాయిల్ని బయటకి పంపారు.  డోర్‌ పెట్టుకున్నారు.  ‘‘మేము మీ సీనియర్స్‌మి’’ అంటూ చేతన చూస్తుండగానే ఆమె చుట్టూ కూర్చున్నారు.  
తలమీద ఏదో పడ్తే తీస్తున్నట్లు ప్రేమగా దువ్వారు.  మాటల్లోకి దింపారు నవ్వారు నవ్వించారు. ఆ తర్వాత నెమ్మది, నెమ్మదిగా బంతిని గోడకేసి కొట్టినట్లు చేతనతో ఆడుకున్నారు.  సీనియర్స్‌ పవరేంటో చూపించారు. 
చేతన ముఖం వాడిపోకముందే చేతులతో నలిపిన పువ్వులా అయింది. ఒకమ్మాయి చేతన చేతి మీద డిజైన్‌ గీసినట్లు వేలితో రాస్తూ.’’ చూడు చేతనా! అదాలత్‌ దగ్గర A to Z షాపుంది.  అక్కడకెళ్లి దీనికో నెయిల్‌పాలిష్‌ తీసుకురా! ఇదిగో కలర్‌ ఇలాగే వుండాలి.  బిల్లు కూడా ఆ షాపుదే అయివుండాలి… దాని ఎదురుగా స్పెన్సర్స్‌ అని ఒక పెద్ద షాపింగ్‌ మాల్‌ వుంది. అక్కడకెళ్లి మొక్కజొన్న పేలాలు కొనుక్కురా! బిల్లు మరచిపోకు…దాని ఎదురుగా ఓ రెస్టారెంట్‌ వుంది. అందులోకెళ్లి వెజ్‌ బిర్యాని, నాన్స్‌ మా నలుగురికి పార్శిల్‌ చేయించుకునిరా! బిల్లుకూడా… బిల్లు ఎందుకంటే ఇవన్నీ నువ్వు అక్కడి నుండే తెచ్చావనే నమ్మకం కోసం… మేం కట్టాలని మాత్రం కాదు, ఇక వూపిరి పీల్చుకో…’’ అంటూ ఒక్క నిముషం ఆగి…
సిటీలో ‘రోబో’ సినిమా ఏ థియటర్లో ఆడుతుందో పేపర్‌ చూసి టికెట్స్‌ తీసుకురా! మేము నలుగురం ఆ ఫిలిం చూసివస్తాం. …’’ అంది ఇకమేం వచ్చిన పని అయిపోందన్నట్లు తలుపు తీసుకొని వెళ్లిపోయారు ఫుల్‌ ఫోర్స్‌తో పడ్తున్న నీళ్లు సడన్‌గా ఆగినట్లు  తల విదిలించి వూపిరి పీల్చుకొంది చేతన. 
సీనియర్స్‌ చెప్పిన పనులన్నీ తనిప్పుడు చెయ్యాలి. లేకుంటే పెసరట్టును గుప్పెట్లో నలిపినట్లు నలుపుతారు.  అది గుర్తొచ్చి వెంటనే లేచి చెప్పులేసుకుంటూ, చున్నీ సర్దుకొని వాళ్లు చెప్పినవి తీసుకురావటానికి వెళ్లింది ఆటోలో…
 సీనియర్స్‌ చెప్పిన టైంకు వచ్చారు.  తాము చెప్పినవన్నీ తెచ్చిందా, లేదా అని చూసి…‘‘వెరీగుడ్‌!’’ అంటూ చేతన చేతిలోంచి కవరు అందుకొని సినిమా టికెట్స్‌ కూడా తీసుకొని…‘‘ఇదిగో ఈ రాత్రికి మాకు ఈ రికార్డ్స్‌ రాసి పెట్టు…’’ అంటూ కొన్ని బుక్స్‌ చేతన బెడ్‌పై వుంచి వెళ్లారు. 
ఆ రికార్డ్సులో రాత్రంతా మేల్కొని రాసినంత మేటర్‌ వుంది రాస్తూ కూర్చుంది చేతన… రాత్రంతా రాసి, తెల్లవారి వాళ్ల రికార్డ్స్‌ వాళ్ళకి ఇచ్చింది… అంతటితో వాళ్లు ఆగలేదు.  
  ఆ తర్వాత కూడా హాస్టల్లో వున్నంతసేపు టార్చర్‌ పెడ్తూనే వున్నారు… కావాలనే ఆమె చెప్పుల్ని వేసుకొని, వేరేవాళ్ల బెడ్ల దగ్గర వదిలేసి వెళ్తున్నారు.  అవి ఆమె వెతుక్కుంటుంది అందరి బెడ్ల దగ్గరకి వెళ్లి పిచ్చిదానిలా… బాత్‌రూం దగ్గర గంటలు, గంటలు నిలబెడ్తున్నారు  
సీనియర్స్‌. ముందు మేం చెయ్యాలి స్నానం అంటూ…సెల్‌ చార్జింగ్‌ దగ్గర కూడా అంతే! ఎప్పుడు చూసినా ఆమె సెల్‌ఫోన్‌కి చార్జింగ్‌ లేక స్విచ్‌ ఆఫ్‌లో వుంటోంది. వాళ్ల బ్రదర్‌ ఒకసారి కాల్‌ చేసి మొబైల్‌ ఆఫ్‌ చెయ్యెద్దని కోప్పడ్డాడు. 
తన బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఇది హాస్టల్‌ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన విషయం కాదు. వాళ్ల దృష్టికి తీసికెళ్లినా పరిష్కారం కాదు.పైగా సీనియర్స్‌ చేసేది ర్యాగింగ్‌ అయితే ఎప్పుడో ఆగిపోయేది. ఇది హేమేంద్ర తన క్లాస్‌మెట్స్‌ అమ్మాయిలతో కావాలని, బలవంతంగా చేపిస్తున్న పని అని ఒక అమ్మాయి ద్వారా తెలుసుకొంది.  వాళ్లలా చెయ్యకపోతే అతను క్లాసులో వాళ్లపై రివెంజ్‌  తీర్చుకుంటాడట. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎవరు ఎవరిని ఎందుకు బాధపెడ్తున్నారు?  ఎందుకు బాధ పడ్తున్నారు? ఈ లింకు లేంటి?
ఇక ఆగలేక ప్రభాత్‌కి కాల్‌ చేసి…
‘‘మీ ఫ్రెండ్‌ నన్ను చాలా ఇబ్బంది పెడ్తున్నాడు. అటు కాలేజిలో ఆ అబ్బాయిల్ని, ఇటు హాస్టల్లో ఈ అమ్మాయిల్ని ఎదుర్కోలేకపోతున్నాను. నేను చేసిన తప్పేంటి?’’ అని అడిగింది చేతన… 
  అలాగే ఇప్పుడు తను ఏ లక్ష్యం కోసం బి.ఫార్మసి చెయ్యాలనుకుందో చెప్పింది.  తన గురించి తన కుటుంబం గురించి చెప్పింది. ఆసక్తిగా విని విషయం మొత్తం అర్థం చేసుకున్నాడు ప్రభాత్‌.
 
**                        **                              **                                **                                **                               **                                                     
 
కాలేజిలో ప్రెషర్స్‌ పార్టీ అయ్యాక ర్యాగింగ్‌ పూర్తిగా ఆగిపోయింది.  విద్యార్థులంతా స్నేహంగా మసలుకుంటున్నారు. క్లాసులు సీరియస్‌గా జరుగుతున్నాయి.
 
‘‘కానీ చేతనను మా సీనియర్స్‌ రోజుకోరకంగా ఏడిపిస్తున్నారు. తను వేసుకునే డ్రస్‌ దగ్గర నుండి వాడుకునే పెన్ను వరకు కామెంట్‌ చేస్తున్నారు.  అంతేకాదు ప్రతి అడుగు గమనిస్తున్నట్లు దానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.  ఎవరూ చూడకుండా అది రోజూ ఏడుస్తోంది.’’ అంది స్నేహిత వినతితో… వినతి స్నేహిత మేనేత్త కూతురు.  
ఎక్కడుండి విన్నదో వచ్చింది గోమతమ్మ.
‘‘ ఈ బాధలు వుంటాయని తెలిసే వినతికి పెళ్లి చేశాం.  ఓ పిల్లకి తల్లయి హాయిగా వుందది… నీక్కూడా పెళ్లి చేద్దామంటే మిా నాన్న వినలేదు.  ఏదీ నాకోసారి ఆ అబ్బాయిల్ని చూపించు. చెప్పుతో కొడతా! శాడిస్ట్‌ వెధవలు. ఎందుకు పుడతారో….పాపం! ఆ చేతన ఎంత బాధపడ్తుందో! ఆ హాస్టల్లో తనని ఓదార్చే వాళ్లు వున్నారో! లేరో! వాళ్ల పెద్దవాళ్లతో చెప్పుకుంటుందో లేదో! నన్ను తీసికెళ్లవే హాస్టల్‌కి.. కొద్ది సేపుతోడుగా వుంటా చేతనకి…’’ అంది గోమతమ్మ..
తల మిద కొట్టుకొంది స్నేహిత. 
‘‘ఎందుకే తల మీద కొట్టుకుంటున్నావ్‌? ఆ హేమేంద్ర అనే వాడు సామాన్యుడు అనుకుంటున్నావా? దుర్యోధనుడు…’’ అంది గోమతమ్మ ..
స్నేహిత మాట్లాడలేదు.వినతి కిసుక్కున నవ్వి… స్నేహిత చెవి దగ్గర నోరు పెట్టి… ‘‘దుర్యోధనుడంటే మొన్న మనం చూసిన శ్రీకాంత్‌ నటించిన సినిమా కదూ!’’ అంది. 
  ఆ మాటలు విన్న గోమతమ్మ వినతి వైపు కోపంగా చూస్తూ…
‘‘నేను సీరియస్‌గా మాట్లాడుతుంటే నువ్వు జోకు లేస్తావెందుకే…? అసలు దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కావటానికి కారణం వాళ్ల తల్లిదండ్రులే తెలుసా?  నేను భారతం చదివి బాగా అర్థం చేసుకున్నాను.’’ అంది గోమతమ్మ. 
  వినతి నవ్వి. ‘‘వాళ్లిప్పుడుంటే నువ్వు కౌన్సిలింగ్‌ ఇప్పించే దానివా మామ్మా! అయినా నీపిచ్చి నీదే గాని తల్లిదండ్రులేం చెయ్యగలరు? ఏం చేస్తారు చెప్పు?’’ అంది. 
వినతిని పట్టించుకోకుండా గోమతమ్మ స్నేహిత వైపు చూస్తూ… 
  ‘‘వినతికి పెళ్లయ్యాక మోకాళ్లలో వున్న బుర్ర అరికాళ్లలోకి వచ్చిందికాని నువ్వు జాగ్రత్తగా వినవే స్నేహితా! దుర్యోధనుడు తన దుర్బుద్ధితో, జగడాలతో పాండవులను ఏదో ఒక రకంగా హింసించేవాడు కుటిల నీతి పన్నేవాడు.  ఆటలకి వెళ్లినప్పుడు, అవకాశం దొరికినప్పుడల్లా వారిని పిడిగుద్దులతో హింసించేవాడు.  మల్లయుద్దానికి పిలిచి ధర్మం తప్పి మరీ వాళ్లను కొట్టేవాడు. అప్పుడే తల్లి గాంధారి కాని, తండ్రి ధ్రుతరాష్ట్రుడు కాని అతని ధోరణిని నియంత్రించి వుంటే పెద్దయ్యాక లక్క ఇంటిని తగలబెట్టించి వుండేవాడు కాదు…ఇప్పుడు కూడా హేమేంద్ర విషయం మీరు మీ కాలేజీలో పైవాళ్ల దృష్టికి తేకుంటే చేతనను మరచిపోవలసివస్తుంది.  ఇలాంటి విషయాలు భయపడి దాచిపెట్టుకుంటే పాచికంపు కొడ్తాయి.’’ అంది గోమతమ్మ.

 – అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

16 Responses to ఎనిమిదో అడుగు – 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో