మహిళల కోసం మన దేశంలో మొదలైన సినిమా సంబరాలు – 2

BACK TO YOUR ARMS

Director : Kristijonas Vildziunas.

Country : Lidhuvenia.

Language: Berlin

Subtitles:In English,German,Lithuveniyan Rushyan,Polish languages.

బ్యాక్ టు యువర్ ఆంస్ : ఇది లిథువేనియా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన సినిమా. ఒక తండ్రీ-కూతుళ్ళ కథ.
తండ్రి పేరు వియాదస్. కూతురు పేరు రూటా.
అది 1961 వ సంవత్సరం. రూటా పశ్చిమ జర్మనీ లో చదువుకుంటూ ఉంటుంది . ఒక పక్క తూర్పు – పశ్చిమ జర్మనీలను విభజించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇంకోపక్క తండ్రి తన కూతుర్ని,కుమార్తె తన తండ్రిని చూడాలని తహ తహ లాడుతుంటారు.ఇద్దరూ బెర్లిన్ లో కలుసుకోవాలనుకుంటారు. తండ్రి సోవియట్ లిథువేనియా నుంచి కూతురి గురించి కమ్మని కలలు కంటూ ఆత్రంగా బెర్లిన్ కి బయలుదేరి వస్తాడు. కూతురేమో అమెరికాలో వలసజీవి. ఆమె కూడా కొండంత ఆశతో నాన్న కోసం అష్ట కష్టాలు పడుతూ పశ్చిమ బెర్లిన్ వైపుకి ప్రయాణించి వస్తుంది. ఈ తండ్రీ కూతుళ్ళ తాపత్రయంతో సంబంధం లేని సంక్షుభిత కాలమది. సోవియట్ యూనియన్ లో మంచు ద్రవీభూతమై పెళ్ళలు పెళ్ళలుగా విరిగి పడుతూ ఉంటుంది.అప్పటికింకా “బెర్లిన్ గోడ” నిర్మించలేదు. ప్రచ్ఛన్న యుద్ధం పరాకాష్టకు చేరుకుని వేగంగా సమీపిస్తున్న సమయం. ప్రారంభంలో తండ్రీ-కూతుళ్ళు కలుసుకోవడానికి రాజకీయ, భౌగోళిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లనిపిస్తాయి . తర్వాత మోసపూరితంగా వాతావరణమంతా వారి కలయికకు వ్యతిరేకంగా మారిపోతుంది .

movie

వియాదస్ బెర్లిన్ చేరీ చేరగానే కెజిబికి చెందిన గూఢచారులు తమ డేగ కన్నుల నిఘాతో ఆయనను అదుపులోకి తీసుకుంటారు. అంతే కాదు, వారు నిరంతరం కాపలా కాస్తూ అతన్ని ఒక పావుగా ఉపయోగించి కుమార్తెను తూర్పు బెర్లిన్ వైపుకి వచ్చేలాగా ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు వియాదస్ ఒక నిస్సహాయమైన ,నిరాధారమైన ఒంటరివాడు. సుదీర్ఘ కాలంగా కూతుర్ని చూడాలనే ఆశతో జీవిస్తూ, మధ్య వయసుకి చేరుకున్నాడు. కానీ నగర వాతావరణమంతా నీటితో నిండిపోయి భయోత్పాతంగా ఉండడం వల్ల రూటా పశ్చిమ బెర్లిన్ సరిహద్దు రేఖను దాటడానికి భయపడుతుంది. అంతేగాక కెజిబి గూఢచారులు మనుషుల్ని దొర్జన్యంగా నల్లరంగు కార్లలోకి ఎక్కించి సరిహద్దువైపుకి తీసికెళ్ళడాన్ని కళ్ళారా చూస్తుంది రూటా. ఒక కార్లో ఉన్న తండ్రిని ఇంకో కార్లోంచి చూసి పక్కవాళ్ళకి “మా నాన్న” అని చెప్తుంది కూడా!
మాయలమారి కెజిబి వలలో చిక్కుకునేకంటే ఎన్నాళ్ళనుంచో ఎదురుచూసిన తమ తియ్యటి కలయిక గురించిన కోరికలను త్యాగం చెయ్యడానికే ఒకవైపు నుంచి తండ్రీ-ఇంకోవైపునుంచి కూతురూ ఇద్దరూ సిద్ధపడతారు. చివరికి వారికి కలుసుకునే అవకాశాలన్నీ అడుగంటిపోతాయి.నిరాశతో ఎవరి దారిన వారు తిరుగు ముఖం పడతారు. జరుగుతున్న పరిణామాలకి వాళ్ళ తప్పు గానీ ,ప్రమేయం గానీ లేదు.కానీ కన్నబిడ్డకు తలిదండ్రులు ఏళ్ళతరబడి ఎడబాసిన బాధితులు.
ఫ్లాష్ బాక్ లో అసలేం జరిగిందంటే అది 1944 వ సంవత్సరం.రెండో ప్రపంచయుద్ధ సమయం.రష్యన్ సైన్యం వేగంగా లిథువేనియా లోకి చొచ్చుకొస్తుంది. లిథువేనియా నుంచి వియాదస్- ఆయన భార్యా వారి పాపాయితో అమెరికాకు పారిపోవాలనుకుంటారు. ఈలోగా వియాదస్ ఒక మిత్రునికి “గుడ్ బై” చెప్పడానికి బయటికెళతాడు.తిరిగొచ్చేటప్పుడు బస్ మిస్సవుతుంది.అంతే! తరుముకొస్తున్న ప్రమాద పరిస్థితుల వల్ల అతనికోసం నిరీక్షించే సమయం లేక భార్యా,కూతురు వెంటనే పయనమై అమెరికాకు వెళ్ళిపోతారు. బస్ మిస్సవడమనే అతి చిన్న సంఘటనతో వారి జీవితాలు చిన్నాబిన్నమౌతాయి. అతను సోవియట్ ఆక్రమిత లిథువేనియాలో చిక్కుకొని భార్యా-బిడ్డలకు దూరమవుతాడు. తల్లీ-కూతురూ అమెరికాలో ఉండిపోతారు. అలా విడిపోయినవారు 17 సంవత్సరాలు విడివిడిగానే జీవిస్తారు. విడిపోయినప్పుడు పాపాయిగా ఉన్న “రూటా “యే ఇప్పుడు మన కథానాయిక!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తూర్పు నుంచి పశ్చిమానికి భారీ వలసలు జరిగాయి . ఈ నేపధ్యంలో తూర్పు జర్మనీ, తూర్పు బెర్లిన్, పోలండ్,హంగేరీ మొదలైన సోవియెట్ అనుకూల ప్రభుత్వాలున్న దేశాలను, ఫాసిస్టు పశ్చిమ దేశాలు అంటే పశ్చిమ జర్మనీ, పశ్చిమ బెర్లిన్ మొదలైన దేశాలనుండి అధికారికంగా విభజిస్తూ సరిహద్దు గోడ నిర్మించాలని జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ (GDR) 1945 , జూలై 1 న నిర్ణయించింది. తూర్పు జర్మనీ ఆధ్వర్యంలో “ప్రజల ఆకాంక్షల మేరకు ” కొన్ని తూర్పు దేశాల్లో సామ్యవాద నిర్మాణాలు జరిగితే సరిహద్దుకి పశ్చిమాన ఫాసిస్ట్ ప్రభుత్వాలు రాజ్యాలేలాయి. ఆగష్టు 13, 1961 న, జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాత గోడ నిర్మాణాన్ని చేపట్టింది. బెర్లిన్ వాల్ నిర్మాణానికి ముందు జరిగిన ఈ సినిమా కథలో ప్రతి సీనూ చాలా థ్రిల్లింగ్ గా శక్తివంతంగా ఉంటాయి. 18 ఏళ్ళ ఒక అందమైన యువతి రూటా జీవితంలోని ప్రతి దశలో ప్రతి క్షణం ప్రమాదం పొంచి ఉంటుంది.
వాస్తవంగా జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు . ”తిరిగి మీ బాహువుల్లోకి” అనుకుంటూ 18 సంవత్సరాల ఎడబాటునంతా మర్చిపోయి ఆత్మీయంగా నాన్న ఒడిలో సేద తీరాలని ఆరాటపడే యువతికి పుట్టెడు దుఃఖం,నిరాశే మిగిలుతాయి. దేశాధినేతలు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం, ఆయుధాలమ్ముకోవడం కోసం సృష్టించే ఈ ప్రచ్ఛన్న యుద్ధాలనబడే డ్రామాల వల్ల సాధారణ ప్రజల జీవితాలు అనుకోకుండా అకస్మాత్తుగా అల్లకల్లోలమవడాన్ని ఈ సినిమా హృద్యంగా చిత్రిస్తుంది. ప్రపంచంలోని మనుషుల మౌలిక లక్షణాలయిన స్పందనలన్నీ, వేదనలన్నీ ఒకలాగే ఉంటాయి. ఏ దేశాల ప్రజలకైనా ఇంకో దేశం ప్రజలతో యుద్ధాలతో పరిష్కరించుకోవలసిన సమస్యలేమీ ఉండవు.అన్నీ రాజకీయ పుటెత్తుగడలే!
విదేశాల్లోని యువతులు చాలా విచ్చలవిడిగా ఉంటారని మనందరి సాధారణ అభిప్రాయం.కానీ యవ్వనంలో ఉండి తెలివితేటలతో అందచందాలతో అలరారే రూటా ప్రవర్తన చాలా హుందాగా ముచ్చట గొలుపుతుంది. ఒద్దికైన బట్టల్లో నిండుగా అద్భుతమైన అభినయంతో చూపరులనాకర్షిస్తుంది.ఈ మధ్య కాలంలో ఇంత సభ్యతగా మర్యాదగా ఉన్న యువతి పాత్ర ఇదేనంటే అతిశయోక్తి కాదేమో!ఇంటిల్లిపాదీ కలిసి చూసే సినిమాలే రావడం లేదని వాపోయే వాళ్ళందరూ ఈ చిత్రం చూడొచ్చు. ఎక్కడికెళ్ళినా ఆ అమ్మాయి చుట్టూ ఉన్నవాళ్ళంతా తనని చక్కగా, స్నేహంగా ఆహ్వానించి తమలో ఒకరిగా కలిపేసుకుంటారు. సినిమా హీరో-హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల వివరాలకోసం ఆరాటపడేవాళ్ళని,పబ్బులు,క్లబ్బుల సంస్కృతిలో కొట్టుకుపోతున్న యువతను చూస్తున్నప్పుడు కమ్ముకునే దిగులు మేఘాలు ,తండ్రి కోసం అపురూపంగా ఆరాటపడే ఈ రూటా ప్రవర్తనను చూసినప్పుడు గంపెడంత ఆశ తో దిగులంతా తేలిపోయి, మనసంతా తెరిపిన పడుతుంది. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి పిల్లలుంటే చాలు వాళ్ళే భావితరాలకు ఆదర్శమవుతారనే భరోసా కలుగుతుంది.
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో లిథువేనియా ఒక “అత్యధిక మానవ అభివృద్ధి” దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. లిథువేనియా 2013 రెండవ సగంలో అంటే ఈ జులై నెల నుంచి “యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ యొక్క అధ్యక్ష పదవిని చేపట్టనుంది. విలువలపరంగా మానవ అభివృద్ధి వియాదస్-రూటా పాత్రల్లో కనిపించింది. తండ్రీ-కూతుళ్ళు వాళ్ళని వాళ్ళు కోల్పోకుండా మనసు నిండా తడి ఆరని ప్రేమ-ఆప్యాయతల్ని నింపుకున్నారు. వారి గుండెలోని తడిని ప్రేక్షకులందరూ అనుభూతి చెందుతారు.

రచన, దర్శకత్వం : లిథువేయనియన్ క్రిస్టిజొనస్ విల్డ్ జుయనస్ (Kristijonas Vildziunas) నిర్వహించారు. ఈ సినిమా నిడివి 90 నిమిషాలు. 1961 లో బెర్లిన్ లోని అందమైన సెట్టింగులు ఆహ్లాదపరుస్తాయి రచన, దర్శకత్వం. సినిమా చూస్తున్న ప్రేక్షకుల మదిలో బెర్లిన్ గోడ-దాని చరిత్ర మదిలో మెదులుతుంటాయి. అసలు ఫుటేజ్ బెర్లిన్ లో ఉండి ఉపశీర్షికలు ఇంగ్లీష్, జర్మన్, లిథువేనియన్, రష్యన్, పోలాండ్ భాషలలో తయారు చేశారు. ఈ ఫిల్మ్ ని 16 వ “ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్” లో ప్రదర్శించారు, 84 వ అకాడెమీ అవార్డ్స్ లో “బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్” గా సెలెక్ట్ చేశారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

My name is Ki

 

 

My Name is KI

Director : Leszek Dawid

Country : Poland

Language : Polish with English Subtitles.

Duration: 93 minutes

                       మై నేం ఈజ్ కీ : సినిమా  పేరులో చెప్పినట్లే  ఈ సినిమాలో ప్రధాన పాత్ర పేరు “కీ“. మనోహరమైన అందంతో, ఒక్కక్షణం తీరిక లేకుండా చలాకీగా అన్ని పనులూ చక్కబేట్టే యువతి కీ. భర్త ఒక్క పని కూడా ఆఖరికి తన స్వంత కొడుకు పని నైనా ఒక్కసారైనా బాధ్యతగా పట్టించుకోడు.కీ ఉద్యోగం చెయ్యకపోతే ఇల్లు గడవదు.ఆమె సంపాదనతో బతుకుతూ, తన కోరికలు  తీర్చుకోవడానికి నిరంతరం ఆరాట  పడతాడు గాని చిన్నవాని బాగోగులు పొరపాటునైనా చూడడు. కీ ఆధునికంగా ఆలోచించే యువతి.అతని బాధ్యతారాహిత్యంతో విసిగిపోయిన కీ అతన్నించి విడిపోవడానికి నిశ్చయించుకుంటుంది.

                       ఆమె “మైకో” అనే ఆయన ఉంటున్న ఒక ఫ్లాట్ లోకి మారిపోతుంది. అతను చాలా సీరియస్,తన పనులకేమాత్రం ఆటంకం కలిగినా సహించేరకం కాదు. జీవితాన్ని సరదాగా గడపాలనే ఆమె కోరికలకు ఉద్యోగం – పిల్లవాడి సంరక్షణలు ప్రతిబంధకమవుతాయి. పిల్లవాడి పెంపకం పేరుతో తన జీవితానికి కొన్ని పరిమితులు విధించుకోవడం,గిరి గీసినట్లు కొన్ని పరిధుల్లో బందీ ఐపోవడం ‘కీ’ కిష్టం లేదు. ఆమెకు తన కొడుకంటే చాలా ప్రేమ.కానీ అన్ని రంగాల్లో తనను తాను సమర్ధంగా నిరూపించుకోవడాన్ని కూడా సవాలుగా తీసుకుంటుంది. చాలా నేర్పుగా తన కుమారుని చూసుకునే బాధ్యతని ఆమె స్నేహితులందరికీ పంచుతుంది. తాత్కాలికంగానైన మధ్య మధ్యలో ఆమెకిష్టమైన ఒక ఆకర్షణీయమైన, మెరుపుల,ప్రపంచంలోకి ఎగిరిపోతూ ఉంటుంది . తోటి మహిళా స్నేహితులతో నవ్వుతూ,తుళ్ళుతూ,కేరింతలు కొడుతూ కనిపిస్తుంది. కీ తో పాటు అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటున్న  మైకోకూ – ఆమెకూ మనస్తత్వాల్లో నింగికీ -నేలకూ  ఉన్నంత తేడా. అసలు కలిసే అవకాశమే లేదు. పొత్తు కుదరదు. ఇద్దరూ ఉత్తర-దక్షణ ధృవాలు. అయితేనేం మైకో ధృవం అయస్కాంతంలాగా నిగూఢంగా కీ హృదయంలో  రహస్యంగా పనిచెయ్యడం మొదలవుతుంది.

                        కొంచెం సమయం తనకోసం చిక్కించుకోవడానికి తన చిన్నారిని ఈ పడుచు తల్లి మైకోకూ స్నేహితులకూ అంటగట్టి స్వార్ధపూరితంగా ప్రవర్తించినప్పటికీ ఆమె తెలివితేటలు మనల్ని ఆహ్లాదపరుస్తాయి. ఆమె పట్ల సానుభూతీ, ఇష్టం ఏర్పడతాయి. పోలండ్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పటి నవనాగరిక ప్రతిభావంతమైన యువత స్ఫూర్తికీ , అద్భుతమైన శక్తి యుక్తులకీ  ప్రతీక ఈ కీ పాత్ర. ఇప్పుడున్న దృఢమైన యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలో ఒంటరి తల్లులు ఆర్ధిక  మద్దతునూ,పూర్తి భరోసానూ పొందుతున్నారని ‘కీ’ నీ ,ఆమె స్నేహితురాళ్ళనూ చూసినప్పుడు అర్ధమవుతుంది.

                 నిన్నటితరం స్త్రీలంతా భర్త,పిల్లలు, అత్త-మామల పనులతో ఊపిరి సలపని పనిలో మునిగిపోయి, తనకిష్టమైన ఎన్నో పనులు , సంగీతం,సాహిత్యం,నృత్యం, సభలు,సమావేశాల్లాంటి వాటిని కుటుంబ సభ్యులకిలా నలతగా ఉంటే ఎలా వెళ్లగలను?” అనుకుంటూ తమ కాళ్ళకి తామే బంధంవేసుకుని ఎందుకూ పనికిరాని త్యాగాలు చేశారు. అలాంటి అరుదైన, ప్రియమైన అవకాశాలను వదులుకోకుండా ప్రత్యామ్నాయలను వెతుక్కోవాలని దర్శకుడు డేవిడ్  నేటితరం స్త్రీలకు ”కీ” పాత్ర ద్వారా చెప్పారు.

– శివ లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో