లలిత గీతాలు – 4

ఏమో ఇది ప్రేమేనా

ఎవరికి తెలుసు అవునో కాదో

నీ మాటలు వింటుంటే

అది మోహనమని అనిపిస్తే …………..

నీతో గడిపే ప్రతి నిమిషం ఎన్ని క్షణాలకొ ఊపిరి అయితే

నిద్రా మెళుకువ రెప్పలపై నీ స్వర మాధురి రాజ్యమేలితే

పెదవి  కోనపై మనసు ముత్యమై దొర్లిన మాటలు

రెక్కలొచ్చిన తూనీగలుగా మనసు చుట్టు మరిమరి మూగితె

ఏమో ఇది ప్రేమేనా

ఎవరికి తెలుసు అవునో కాదో

నీ మాటలు వింటుంటే

అది మోహనమని అనిపిస్తే …………….

 

నిద్ర వంపులో వాలిన రెప్పల ఆకాశానివి నువ్వైతే

మగత బెంగలో పలవరింతలో పలికే మాటె నీదైతే

పెదవి కదిలినా మనసు పలికినా ఆణి ముత్యమై నీవుంటే

అదరక బెదరక అన్ని వేళలా నీ జపమే ఇక నాదంటే

 

ఏమో ఇది ప్రేమేనా

ఎవరికి తెలుసు అవునో కాదో

నీ మాటలు వింటుంటే

అది మోహనమని అనిపిస్తే …………….

 –  స్వాతీ శ్రీపాద

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

లలిత గీతాలు, , , , , , , , , , , , Permalink

One Response to లలిత గీతాలు – 4

 1. దడాల వెంకటేశ్వరరావు says:

  అవును ఇది ప్రేమేలే
  ఎవరికీ తెలియకపోయినా
  మన ఇద్దరికీ అది తెలుసునులే
  అదే మోహనరాగమై వినిపించేనులే

  పల్లవి ప్రశ్నగా మిగిలిపోకుండా ఇలా ముగించాను స్వాతి గారు