నర్తన కేళి – 9

*మీ పూర్తి పేరు ? స్వస్థలం ?

అడపా భరణి కుమార్ , మా స్వస్థలం కాకినాడ .

 *కుటుంబ నేపధ్యం ?

 నాన్న  పేరు  సత్య నారాయణ , అమ్మ అక్షితాంబ , చెల్లి నళిని , నేను . 

*నృత్యం పై ఆసక్తి ఎలా కలిగింది ?

 చిన్నప్పటి నుండి మా ఊరిలో జరిగే ప్రదర్శనలు చూడటంతో నాలో స్వతహాగానే ఆసక్తి కలిగింది . కాని చాలా కాలం వరకు నాట్యం అభ్యసించలేక పోయాను . 

*ఏ వయసు లో ఉండగా మీరు నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు ?

 నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మొదలు పెట్టాను . చిన్నతనంలో నాకు పెద్ద గా అవగాహన లేదు . ఇంట్లో కుడా అదే పరిస్థితి నాకు తెలిసి వచ్చిన తరవాత నేనే నేర్చుకుంటాను అని అడిగితే నా ఇష్టం చూసి అంగీకరించారు . 

 *మీ గురువు ఎవరు , వారి వద్ద ఏ నృత్యం అభ్యసించారు ?

సత్యనారాయణ గారు నా తొలి గురువు . ఆయన వద్ద ఒక సంవత్సరం భరత నాట్యం నేర్చుకున్నాను . ఆ తరవాత ఆకెళ్ళ పద్మావతి గారి వద్ద కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించాను . 

*భరత నాట్యం నుంచి కూచిపూడి వైపుకి రావడానికి కారణం ?

 భరత నాట్యం కంటే కూచిపూడిలో  ప్రాధాన్యం ఉండటం . మన ఆంధ్రప్రదేశ్ లో  ముఖ్యంగా కాకినాడలో కూచిపూడి నాట్యం  మాత్రమే అందుబాటులో ఉండడంతో కూచిపూడి లోనే  శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను .  

*ఆకెళ్ళ పద్మావతి గారి వద్ద ఎన్ని సంవత్సరాలు శిక్షణ పొందారు ?

ఆకెళ్ళ పద్మావతి గారి వద్ద ఆరు సంవత్సరాలు నేర్చుకున్నాను .  

*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు ఎక్కడ జరిగింది ?

నా కాలేజీ రోజుల్లో తొలి ప్రదర్శన ఇచ్చాను . తరవాత గోదాదేవి కళ్యాణం నృత్య రూపకంలో ను చేసాను .  

*మీరు ఎంత వరకు చదువుకున్నారు ?

 నేను డిగ్రీ వరకు కాకినాడలో చదివాను . ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పి. జి  చేస్తున్నాను .  కూచిపూడి నృత్యం లో సర్టిఫికేట్ ,  డిప్లోమో  చేసాను .  

*మీరు  ఎన్నినృత్య  ప్రదర్శనలు ఇచ్చారు ?

చాలా ప్రదర్శనలు ఇచ్చాను . సుమారుగా 200 పైనే చేసాను . ఒరిస్సా సంబల్ పూర్ ,యానం , విశాఖ , తిరుపతి , కాణిపాకం , శ్రీశైలం , అన్నవరం చాలా ప్రదర్శనలు ఇచ్చాను .

*గురువుగా  ఎప్పటి నుండి   శిక్షణ ఇస్తున్నారు ?

పది సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నాను . మా గురువుగా ఆకెళ్ళ పద్మావతి గారు అనపర్తి వెళ్లి పిల్లలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు . కొన్ని రోజులు వెళ్ళిన తరవాత ఆ క్లాసులకి నన్ను వెళ్లి చెప్పమన్నారు అలా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను .  

*ప్రస్తుతం మీ  వద్ద ఎంత మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు?

40 మంది పిల్లలు ఉన్నారు . 

*మీ వైవాహిక జీవితం గురించి చెప్పండి ?

మా వారి పేరు కుమార్ , బిజినెస్ చేస్తారు .  మాకు ఇద్దరమ్మాయిలు  పెద్దమ్మాయి పేరు రాగిణి . చిన్నమ్మాయి పేరు సంయుక్త . 

*మీ నృత్య శిక్షణ సంస్థ పేరు ?

‘నృత్యాంజలి ‘ ప్రస్తుతం హైదరాబాద్ లో నే శిక్షణ ఇస్తున్నాను

* మీకు లభించిన ప్రశంసలు , పురస్కారాలలో మరిచిపోలేనివి మా కోసం చెప్పండి ?

ఉదయ కళానిధి ‘నాట్యశ్రీ ‘ బిరుదు  ఆ సందర్భం ఎప్పటికి మరిచిపోలేనిది .  

*మీ నృత్య నికేతన్ (శిష్యులు ) ద్వారా ఇచ్చిన ప్రదర్శనలు ?

యాదగిరి గుట్ట బ్రహ్మొత్సవాలు , సిలికానాంధ్ర నాట్య సమ్మేళనం , వినయ చవితికి నవరాత్రులకి  చేసాము . 

*మీరు మీ శిష్యులకు ఇచ్చే  శిక్షణ ఏ విధంగా ఉంటుంది ?

ముందుగా అడుగులు తరవాత ముద్రలు నేర్పిస్తాను . 3 నెలలు పాటు పూర్తిగా వాటి మీదనే దృష్టి పెట్టి శిక్షణ ఇస్తాను . తరవాత చిన్న చిన్న కీర్తనలకు అభినయం చెప్పడం ప్రారంభిస్తాను .

*మరి అడుగులు రావడానికే సుమారుగా సంవత్సరం పైనే పడుతుంది అంటారు కదా ? మధ్యలో కీర్తనలు నేర్పించడానికి కారణం ?

అవును , కాని అడుగులు అన్ని నేర్పించిన తరవాత అంటే పిల్లలకు ఆసక్తి తగ్గిపోతుంది .  ఇటు తల్లి దండ్రులు తమ అమ్మాయిని ఎప్పుడు స్టేజి మీద చూపిస్తారా అని అడుగుతుంటారు . పిల్లలకి నాట్యం పై యిష్టం ఆసక్తి పెరిదే విధంగా చిన్న చిన్న కీర్తనలకి , శ్లోకాలకి  అభినయం  చెప్పడం ప్రారంభిస్తాను .  

*మొన్న  సిలికాంద్ర నిర్వహించిన ‘అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం’ పై మీ అభిప్రాయం ?

అది ఒక మంచి పని , నాట్య కళాకారులందరినీ ఒకే చోట కలవడానికి మంచి అవకాశం . నాట్యం లో నిష్ణాతులైన వారి నుండి సలహాలు , సూచనలు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది . అలాంటి కార్యక్రమాల  వల్ల పిల్లలలోను శాస్త్రీయ కళల పై అవగాహన , ఇష్టం పెరుగుతాయి . 

*మీ ప్రభావం మీ ఇంట్లో  ఎంత వరకు ఉంది ?

మా పెద్దమ్మాయికి నాట్యం అంటే చాలా ఇష్టం . బాగా చేస్తుంది. తొలి ప్రదర్శన ఏర్పాటు చేయాలి

*ఇప్పుడు  శాస్త్రీయ నృత్యాన్ని  అభ్యసించేవారికి మీరిచ్చే సలహా ?

మీకు మనస్పూర్తిగా నచ్చితేనే నాట్య నేర్చుకోవడం ప్రారంభించండి . ఏదో ఒకటి రెండు ప్రదర్శనలు ఇస్తే చాలా అనుకుంటే మాత్రం నేర్చుకోవద్దు . ఏ విద్య నైనా నేర్చుకుంటే పరిపూర్ణంగా నేర్చుకోవాలి . మనం నేర్చుకున్నది నలుగురికి పంచెలా ఉండాలి . నేర్చుకునే కీర్తన కాని శ్లోకం కాని ముందుగా అర్ధం తెలుసుకోండి . అప్పుడు మరింత బాగా ప్రదర్శించగలరు .

 మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

UncategorizedPermalink

One Response to నర్తన కేళి – 9

  1. srinivas says:

    narthanakeli mukhaamukhi baagundi . potos kudaa unte baagundedi anipinchindi .

    chaalaa mandi kalaakaarulu unnaaru vaarini parichayam cheyandi .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)