నామిని నెంబర్ వన్ పుడింగి

ఒక రచయిత, తన జీవితాన్ని గురించి ఇంత ధైర్యంగా నిజాయితీగా నిర్లజ్జగా నిర్మొహమాటంగా నిర్మోహత్వంతో రాసిన పుస్తకం ఇదొక్కటే అయి ఉండచ్చు. బహుశా ఇతర భాషల్లో కూడా ఇన్ని జీవన  వైవిధ్యాలూ వైరుధ్యాలూ కలిగిన జీవిత చిత్ర ప్రదర్శన వెలువడిన దాఖలాలు లేవు. ఇందుకు నామిని సుబ్రహ్మణ్యం నాయుడిని అభినందించకుండా ఉండలేము.
అందుకే దీనిగురించి ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకోవలసి వస్తోంది.
పుడింగి అంటే ఏమిటో నాకు తెలీదు కానీ నామిని నెంబర్ వన్ పుడింగి అని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను.
ఉదాహరణకి నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారికి తన చిత్తూరు జిల్లా మాండలికం తప్ప మరే భాషా నచ్చదు. కథనం ప్రామాణిక భాషలోనూ పాత్రల సంభాషణలు మాండలికంలోనూ వుండటం అస్సలు నచ్చదు. కేవలం తెలుగు భాషలోని ప్రామాణిక భాషా మాండలికాలని సంకరం చేస్తేనే సహించలేరు. (ఆయనకి  మాత్రమే కాదు, భాష పట్ల గౌరవం కలిగినవారెవరికీ కూడా ఇలాంటి భాషా సాంకర్యం నచ్చదు.) అంతటి భాషా నిబద్ధత కలిగిన నామిని వారు తన పుస్తకానికి పెట్టిన పేరులోనే తెలుగు భాషని ఇంగిలీషుతో సంకరం చెయ్యడాన్ని ఏమనాలి ? తన కుమారుడికి టాంసాయర్ అనే పేరు పెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? దీన్ని చూస్తూంటే ఆయనకి బాగా ఇష్టమైన చిత్తూరు భాషలోని సాటువ గెవనం వస్తాంది, ‘ నీ ఉత్త మాటా నా ఇత్తడి రూకా ఒగిటేలే పోబ్బా’ అనేదే ఆ  మాట.
ఇలాంటి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసి కూడా పుస్తకంగా తెచ్చే తెంపు కలిగిన వారిని పుడింగ్ అని కాక ఏమంటారు ?
నామిని ఏనాడూ సాహిత్యాన్ని సృష్టించలేదు. జీవితాన్ని  దర్శించారు  దాన్నే ప్రదర్శించారు  అని నమ్మేవాళ్ళలో నేనూ ఉన్నాను. ఎందుకంటే, అనుభవాలనీ అనుభూతులనీ అందంగా అనితర సాధ్యమైన రీతిలో అక్షరాల్లోకి అనువదించారాయన.
కానీ తన జీవితాన్ని గురించి ఏమాత్రం దాపరికం లేకుండా రాసుకున్నఈ పుస్తకంలో నామిని అక్కడక్కడా   తనని తాను కోల్పోవడాన్ని గమనించగలం. నామిని మాత్రమే కాదు ఏనారయినా సరే కొన్ని సమయ సందర్భాలలో తమని తాము కోల్పోకుండా వుండరు. అలా కోల్పోయినవాళ్ళు చాలామంది చాలా సందర్భాలలో ఆ విషయాన్ని ఒప్పుకోరు.
తమ గోడు వెళ్ళబోసుకునే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇతరులమీద బురద చల్లే అధికారం బహుశా నామినికి మాత్రమే ఉండుంటుంది కాబోలు. పనిలో పనిగా అంజనం వేసి మొత్తం హైదరాబాదులోని ప్రతి ఆఫీసునీ సినిమాలాగో టీవీ సీరియల్లాగో చూసే అద్భుత శక్తి కూడా ఉండుంటుంది. లేకపోతే తను ఎక్కడో తిరుపతిలో కూర్చుని ఇక్కడ హైదరాబాదులో ఏ సంపాదకుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత దొబ్బారనేది  అంత సాధికారికంగా ఎలా చెప్పగలరు ? ( దొబ్బారనే పదం నాది కాదు. వారిదే. )
తను తన భార్యని ఎంత దారుణమైన పదాలతో సంభావిస్తారో తెలుసుకోవడం ద్వారా చదువరులు  ఏం నేర్చుకోవాలని నామినివారు భావిస్తున్నారో ఆయనకే తెలియాలి.
‘ ఏనుగు పడింది ఏనుగే లేచింది ‘ అనేది ఇందులోని  ఒక ఉప శీర్షిక.
ఏనుగు నెత్తిమీద ఎవరూ చెత్త పోయ్యలేరు కాబట్టే దాని నెత్తిన అదే చెత్త చెదారం పోసుకోవడానికి వీలు కల్పించడానికే  ఆ దేవుడు దానికి తొండం పెట్టాడంటారు.
ఏనుక్కి తొండం ఇచ్చినట్టే నామినికి కలం ఇచ్చాడేమో అనే అనుమానం చదువరుల్లో కలిగితే అది వారి తప్పు కాదు.
ఇలాంటివి తప్ప మిగిలినవన్నీ  ఆయన వ్యక్తిగత వ్యవహారాలు కాబట్టీ మనం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
పుస్తకం చివర్లో ఆయన చెప్పిన విషయాలు అపురూపమైన వ్యంగ్య వైభవంతో విలసిల్లాయి. కానీ వాటిని  చదివినప్పుడు కలిగిన  అనుభూతిని చివర్లో  ఇచ్చిన ఆయన బ్యాంక్ ఎక్కౌంటు నెంబరు సవాలు చేస్తుంది.
అయినా సరే, దీని ప్రత్యేకత దీనిదే.
తప్పుచెయ్యడం తప్పు. తెలిసో తెలియకో చేసిన తప్పుని, తప్పని గుర్తించక పోవడం ఇంకా తప్పు. ఆ తప్పుని తప్పని ఒప్పుకోకపోవడం మరీ పెద్ద తప్పు. ఇవన్నీ అర్ధమయిన తరవాత కూడా చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చెయ్యడం జరిగిందీ అంటే అది తప్పుగా మిగలక  ఒప్పుగా మారిపోయిందని అర్ధం.
అలా ఒప్పులుగా మారిపోయిన తప్పులు చెయ్యని మనిషి ఒకవేళ ఎవరయినా ఉన్నారని చెబితే దాన్ని మించిన అబద్ధం ఇంకొకటి ఉండదు.
ఇందులో అలాంటి అబద్ధాలు లేవు.
అవి కనపడక పోవడానికి కారణం మనం కప్పుకున్న సంస్కారపు ముసుగు ఆయన వేసుకోకపోవడమే. అలా వేసుకోక పోవడం వల్లే ఇలా విమర్శించే అవకాశం కలిగింది.
కాస్త లోతుగా ఆలోచిస్తే, ఆవేశం ఆవేదన ఈ రెండింటికీ విచక్షణా జ్ఞానం ఉండదని అర్ధమవుతుంది. ఆ రెండింటినీ జయించగలిగేది ఆలోచన మాత్రమే. కానీ ఆవేశ కావేషాలూ ఆవేదనాలూ ఆక్రందనలూ అసంకల్పిత ప్రతీకార చర్యలవంటివి. ఇవి కలిగినంత వేగంగా ఆలోచన రగలదు.
నిజమే,
జీవిత వాస్తవిక చిత్రాలు ఇలాగే ఎటువంటి ముసుగులూ లేకుండా ఉత్త బిత్తల గానే వుంటాయి.
వాటికి బట్టలు కుట్టగల దర్జీలకి కావలసిన కొత్త కొలతలని ఇవ్వగలడీ పుడింగి.
అయితే కొలతలు తీసుకోవడానికి కావలసిన కొలమానాలని తెలుగు సాహిత్యకారులు కనిపెట్టవలసి వుంది.
ఇందులో ఒక సందర్భంలో ‘ దీన్ని కూడా చింపేసి ఉంటే ఎంత బాగుండు ?’  అంటారాయన.
ఆ వాక్యాన్ని  చదివిన వెంటనే మనకీ అదే మంచిపనేమో అనిపిస్తుంది.
కానీ, చదవడం పూర్తి చేసి మళ్ళీ మన దైనందిన కార్య కలాపాలలో పడిపోయి యధాలాపంగా జీవించేసున్నప్పుడు మనకి ఎదురుపడే ఎన్నో సందర్భాలు ఈ పుడింగి మాటల్ని గుర్తు చేస్తాయి.
అప్పుడుగానీ..,
ఆయన దీన్ని సగంలోనే చింపి పారేసి వుంటే మనం ఏం కోల్పోయి ఉండే వాళ్ళమో మనకి తెలిసి రాదు.

– రాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , Permalink
0 0 vote
Article Rating
25 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
రాణి
రాణి
7 years ago

తిరుపాలు గారూ, మీ వివరణ బాగుంది. నామిని నిజంగానే పుడింగి. ఆ విషయం పుస్తకం చివరిలో ఇచ్చిన ఎడ్రస్సునీ ఆ ఎడ్రస్ ఇవ్వడానికి గల కారణాన్నీ చూసినవారందరికీ అర్థమౌతుంది. అర్థం చేసుకున్నవారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా దబాయించడం వల్లనే నామిని నెంబర్ వన్ పుడింగి ఇంకా నలుగిరి నోళ్ళలోనూ నానుతోంది.దాని గురించి మరింత చర్చ జరగాల్సి ఉంది. ఇప్పుడైనా సరైన దారిలో చర్చ ఆరంభం కావాలనీ, అది సరైన మార్గంలో సాగాలనీ కోరుకుంటున్నాను.
రాణి

Thirupalu
Thirupalu
7 years ago

పుడుంగు అంటే పెరుకు అని అర్ధమండీ! నెంబర్‌ ఒన్‌ పుడింగి అంటే బాగా పెరికే వాడు అని అర్ధం. పెరుకుటలో బాగా చాతుర్యం ఉన్న వాడు లేక చతురుడు అని అర్ధం.

vedavyas
vedavyas
8 years ago

రాణి గారూ ,
మీకు స్ఫూర్తి ఇంకొకరు ఇవ్వాలా చెప్పండి , మరీ చమత్కారం కాకపొతే ?
మీ రాతలనే కాదు మిమ్మల్ని కూడా అభిమానిస్తాను . మీ మధనం ఏ నెలలో వచ్చింది ?
సే లవ్ తీసుకోనా మరి
– వేద్

రాణి
రాణి
8 years ago

వేదవ్యాస్ గారూ,
మీ ప్రోత్సాహం చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది.
నేను రాసిన కథ మథనం విహంగలోనే వచ్చింది. వీలయితే చదవండి.
నా రాతల్ని మీరు ఎంత అభిమానించినా ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ నన్ను మాత్రం అభిమానించకండి.

సె లవ్
– రాణి.

vedavyas
vedavyas
8 years ago

రాణి గారు
రాణి గారు బాగుంది మీ వివరణ. మొత్తానికి ఉండాల్సిన వారే. మీరు చెప్పాలనుకున్నది భలే బాగా చెప్తారు. మీరే మంచి మంచి కథలు రాయొచ్చని నా బలమైన అభిప్రాయం. ఎందుకు చెప్పండి ఈ సమీక్షలు……విమర్శలు…మీరు రాసేయండి….నేనే మొదటి పాఠకుణ్ణి ….అభిమానిని. ఏమంటారు . స్నేహితుడని అన్నారు….సంతోషం…నా అభిప్రాయాల్ని ఎన్నిమార్చేస్తారో అని భయంగా వుంది . మీ రిప్లై లో కొసమెరుపు బాగుంది.ఇన్ని మాటలు చెప్పే మీకు ఏమీ చెప్పలేం అని డిసైడ్ అయ్యాను…..ఎవరేమి చెప్పినా…………మీ స్టైల్ లో (శైలి) మీరు చెప్పుకు పోతూనే వుంటారు………………………….anyways good to sharing with you.
సే లవ్
ved

రాణి
రాణి
8 years ago

వేద్ గారూ,
నాకూ నామినిగారికీ ఎలాంటి సంబంధం లేదు. కనీసం ముఖ పరిచయం కూడా లేదు. అలాగే రంగనాయకమ్మ గారు కూడా నాకు తెలియదు. వాళ్ళిద్దరిలాగే మీరు కూడా నాకు తెలియదు.
కానీ నాకు మీ ముగ్గురూ మీ మీ అక్షరాల ద్వారా స్నేహితులయ్యారు.
నాకు తెలిసినంత వరకూ ఇద్దరూ ఒకే ప్రవృత్తిని కలిగి ఉన్నప్పుడు పోలికలు తేవడం తప్పు కాదు.
ఆయన జీవితాన్ని చూసారు. ఆవిడ జీవితాన్ని చదివారు.
ఆయన జీవితాన్ని అనుభవించారు. ఆవిడ జీవితాన్ని అనుభూతిస్తున్నారు.
ఆయన అనుభూతులిస్తారు. ఆవిడ ఆలోచనలిస్తారు.
ఆయన ప్రతి మాటా ఆయన దృష్టిలోంచీ చూపించే ఒక అందమైన అక్షర చిత్రం. ఆవిడ ప్రతి మాటా వందలాది జీవితాల సారాన్ని విశ్లేషించే పాఠ్య పుస్తకం. రెండూ రెండు భిన్నమైన దృష్టి కోణాలు. నా వరకూ రెండూ విలువైనవే. అయినప్పుడు పోలిక తేకుండా ఎలా ఉంటాను ? అలాగని నేను తెచ్చే పోలిక కేవలం నిజాలని వెల్లడించడం వరకూ మాత్రమే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన కథా శిల్పం విషయంలోగానీ ఆవిడ మేధా సంపత్తికిగానీ ప్రమోటర్లూ, అమ్బాసిడర్లూ అక్కర్లేదు. ఆయన మనస్సు. ఆవిడ మేధస్సు. సాహిత్యానికి రెండూ అవసరమే.
చివరిగా ఒక చిన్న మాట.
మీరు నాకు చివరిగా “సే లవ్” అని చెప్పారు.
అలా చెప్పిన మొదటివారు మీరే .
మీక్కూడా
సే లవ్
మీ
ఫ్రెండ్
రాణి.

vedavyas
vedavyas
8 years ago

రాణి గారు………………………..
రంగనాయకమ్మ గార్కి……………నామిని గార్ని పోలిక తేకండి……….చాలా వ్యత్యాసం వుంది. ఎవరెన్ని విధాలుగా అభిప్రాయాలు వెల్లడించినా మీరు మాత్రం ఆయన పుస్తకాలకు ఒక గొప్ప సేల్స్ ప్రోమోటర్ గా మారిపోయారు. కాత్యాయని గార్కి సమాధానం చెప్పకుండా ఆమె పేరుకి అర్థం చెప్పి తప్పించుకున్నారు. ఉష గార్కి , పాఠకురాలు గార్కి మీ సమాధానం లేదు. నాకు అర్థమవుతున్నది ఏమిటంటే మీరు నామిని గార్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా , ఒక సేల్స్ ప్రోమోటర్ గా డిసైడ్ అయ్యారు.నామిని గారి ఎకౌంటు లో ఎన్ని కోట్లు వేసారో అన్న సందేహం నాతొ పాటు చాలామందికి వున్నట్లు నాకు తెలుస్తుంది……….

ఏది ఏమైనా మీ భుజాలు నొప్పి పుట్టకుండా వుండాలని ఆశిస్తున్నాను.

మీ “విలువైన” అభిప్రాయాలకి సందేహాస్చార్యాలతో కూడిన అభినందనలు.

సే లవ్

వేద

రాణి
రాణి
8 years ago

ved గారూ,
మీరు నామినిని చదివానన్నారు. అదే నాకు సంతోషం. న్యాయస్థానాలు కూడా తప్పు చెయ్యడం తప్పే అయినా చేసిన తప్పుని ఒప్పుకున్నందుకు శిక్షా కాలాన్ని తగ్గిస్తాయి. మీరు అందుకు కూడా ఒప్పుకోవడం లేదు. అదీ సంతోషమే. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి జీవితం లోకి తొంగి చూస్తే కనీసం పేర్లయినా మార్చాలని మీ ఉద్దేశం. ఇది మాత్రం సంతోషం కాదు. ఎందుకంటే, ఒక వార పత్రికలో రంగనాయకమ్మ గారు నేనూ నా పాఠకులూ అని రాస్తున్నారు. ఆవిడ పాఠకుల పేర్లని మార్చి రాసారు. పేర్లు మార్చారు కాబట్టీ ఆవిడకి సంస్కారం ఉన్నట్టూ మార్చలేదు కాబట్టీ ఈయనకీ సంస్కారం లేనట్టూనా ? ఆవిడ పేర్లు మార్చినా ఆయా పాఠకులు ఆవిడని దుమ్మెత్తి పోస్తున్నారు. పేర్లు మార్చకపోయినా ఆయా వ్యక్తులు నామినిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎందుకు ?

సురేశ్ కొలిచాల

పుడింగి అన్న పదం *పొడంగు (పొడవు) అన్న పదానికి సంబంధించినది. మధ్యాచ్చులు, అగ్రాచ్చులుగా మారడం తమిళంలోనూ, తమిళ ప్రభావం ఉన్న చిత్తూర్ మాండలికంలోనూ తరచుగా కనిపిస్తుంది. ఉదా.: పొర (layer) > పురై (తమిళం). పొగ (smoke) > పుగై (తమిళం).

ved
ved
9 years ago

రాణి గారూ ,
ఒక “బరితెగించిన ” కవి (?) ని మీరు భుజాన మోస్తుండటం చాల విచిత్రంగా ఉంది . ఆయన ఏం రాసినా , ఎలా రాసినా అదేదో “అద్బుతం ” అన్నట్లు మీరు వెనకేసుకు రావడం చాల నీచమైన పని . అందరు సంస్కారపు ముసుగులో వున్నారు /వుంటారు కాబట్టి ,ఆయన “సంస్కార హీనంగా , చీదరించుకునే పని ” చేసినా అది మీకు “వెరైటీ ” గా వుండి “ఒప్పు ” అనిపిస్తుందా ? ఆయన కవి కానే కాదు ………….just a narrator of things happened in his surroundings which happened in his life. తెలిసి తెలిసి దొంగతనం చేసి …….ఒప్పుకోవడం “కరెక్ట్ ” అయిపోతుందా ? నిజాయితీగా ఒప్పుకున్నాడు ………..మంచి దొంగ ………….అప్పుడప్పుడు అందరు దొంగతనాలు చిన్నవో ,పెద్దవో చేస్తూనే వుంటాం………ఇలాగ నిజాయితీగా ఒప్పుకోవడం rare (అరుదు ) కాబట్టి ఈయన్ని వదిలేద్దాం అని మీరంటున్నారు . ఒక మనిషి దివాలకోరుతనాన్ని , నేను తప్పులు చేస్తూనే ఉంటా , మీరేం అనుకుంటారో నాకు లెక్క లేదు …..అనే మనిషిని ..పోనీ narrator ని ……….మీరు సమర్ధించడం ………..చండాలం గా వుంది . ఇంకొకరి వ్యక్తిగత జీవితాల్లోకి యే కవి తొంగి చూసినా ………కనీసం పేర్లు మార్చే సంస్కారం చూపెడతారు . నామిని తన పుస్తకాలను అమ్ముకునేందుకు ఇలా అడ్డమైన చెత్త రాస్తే ………..ఆయన మీద జాలి పదోచు కానీ ఇలా సమర్ధిస్తే ………………ఇంకా చాల మంది నామినిలు ఇలాంటి “నిర్లజ్జగా ,నిర్మొహమాటంగా ” పుస్తకాలు తీసుకొస్తారు .
నేను నామిని పుస్తకాలు చదివాను ……..ఆనందించాను ………….కానీ ……..ఈ బరి తెగింపును సమర్ధించలేను ……..”ఎలాంటి ” అభిమానం చూపించలేను . మీరేం చెప్పినా ………మీరెలాగ చెప్పినా అందరు తలలు ఆడిస్తారని మీరెందుకు అనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు . అనకూడదు కానీ , ఇది ఒక మానసిక జబ్బేమోనని అన్పిస్తుంది . ఇది వ్యక్తిగత మైన విమర్శ కానే కాదు , ఆయనెవరో , మీరెవరో నాకు తెలియదు కూడా . మీరు “యే ” రకంగా సమర్ధించినా….its not fair at all.

రాణి
రాణి
9 years ago

ఉష గారూ, కొన్ని తప్పులు చెయ్యడం తప్పు కాదు.

ఉష
ఉష
9 years ago

అందరూ విమర్శించే పుస్తకాన్ని మీరు సమర్ధిస్తారు. అందరూ చేసే పనులని తప్పులు పడతారు. ఎవరి కెరీర్ కోసం వాళ్ళు కష్టపడటం కూడా తప్పంటారు.ఏమయినా అడిగితే అందరినీ నా దారిలోకి తెచ్చుకుంటాను అనే నమ్మకం వుంది అంటారు. నామిని తన భార్యని సంస్కారం లేకుండా పిలవడం తప్పు. ఒక స్త్రీ అయివుండీ మీరు దాన్ని వ్యతిరేకించక పోవడం ఇంకా తప్పు.

రాణి
రాణి
9 years ago

కాదంబరి గారూ,
నాకు మీ పేరు బాగా నచ్చింది.

కన్నడంలో కాదంబరి అంటే ఇంగ్లీషులో నవల.
ఇంగ్లీషు నవలని తెలుగువాళ్ళు నవల అని ఎందుకు అన్నారో నాకు తెలియదు.
కానీ తెలుగులో నవల అంటే పరిపూర్ణ సౌందర్యవతి అయిన స్త్రీ.
తెలుగువాళ్ళు ఏ భాషా పదాన్ని స్వంతం చేసుకున్నా సరే అది ఇలాగే తియ్యగా తెలుగులో ఇమిడి పోతుంది అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. లేకపోతే జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించగల సాహిత్య ప్రక్రియకి ఇంగ్లీషు వాళ్ళు నవల అని పేరు పెట్టడం ఏమిటి దాన్ని తెలుగువాళ్ళు యథా తథంగా స్వీకరించడం ఏమిటి అది ఇంత చక్కగా తెలుగులో ఇమిడిపోవడం ఏమిటి. అదీ తెలుగు గొప్పదనం అంటే..!

తెలుగులోకి ఎలా అనువదిస్తే బాగుంటుంది అనేదాని గురించి ఎంత మాత్రం ఆలోచించకుండా ఆయా పదాలని యథా తథంగా వాడెయ్యడమే తెలుగువాడి గొప్పదనం.
మన తెలుగువాళ్ళకి ఎవరయినా సిగ్గూ శారాలనేవి నేర్పిస్తే ఎంత బాగుండేది ?

పుడింగి అనే పదం పుడక నించీ వచ్చిందంటే నమ్మ బుద్ధి కావడం లేదు.
ఎందుకంటే పుడకని కోస్తా జిల్లాలలో మాత్రమే పుడక అంటారు. రాయల సీమ జిల్లాలలో కట్టె అనీ మరీ చిన్న పుల్ల అయితే కట్టె పుల్ల అనీ అంటారు.

నామిని తన స్థానాన్ని స్వయంగా చెప్పుకున్నారు. అని మీరన్న మాటలో వ్యంగ్యం కనిపిస్తోంది. నామిని కాబట్టే అంత ధైర్యంగా ఒప్పుకోగాలిగారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి మనలాంటి ఒంటి గుండె ఒప్పుల కుప్పలు చాలరు. దానికి ఎన్ని గుండెలు కావాలంటే నిప్పుల్లో నడిచినా ఆ వేడిమిని తట్టుకునేన్ని. తప్పు చెయ్యడం తప్పు కావచ్చు కానీ తప్పుని ఒప్పుకోవడం తప్పు కాదు. అది అర్ధం కావాలంటే పుడింగిని మళ్ళీ మళ్ళీ చదవాలి. చదువుతూ ఉన్నప్పుడు మనలోకి మనం సెర్చి లైట్లు వేసుకుని మన్ని మనం శోధించుకోవడం మొదలు పెట్టె వరకూ అలా చదువుతూనే వుండాలి.

ఈ రోజు వివిధలో మురళి గారి వ్యాసం చదివారా ?

నామిని నెంబర్ వాన్ పుడింగి పుస్తకం మీద ఇన్నాళ్ళుగా బురద చల్లే పని పూర్తయ్యింది.

ఇంక జరగాల్సింది నిజమైన చర్చ మాత్రమే.

kadambari
9 years ago

“puDaka”/ పుడక = చిన్న కర్ర/
పానకంలో పుడక లాగా – ఇలాగ ఉదాహరణలు.
ముక్కు పుడక/ ముక్కు పుల్ల – ఇలాటి మాటలు వాడుకలో ఉన్నాయి.
నామిని – తన స్థానాన్ని స్వయంగా చెప్పుకున్నారు.

రాణి
రాణి
9 years ago

‘ పుడింగి అంటే ఏమిటో నాకు తెలీదు ‘ అంటే పుడింగి అనే పదానికి అర్ధం నాకు తెలీదు అని.
‘నామిని పెద్ద పుడింగి’ అంటే ఆ పదానికి భావార్ధం నాకు తెలిసింది అని తెలియజెయ్యడం.
ఏం చదవాలి అనే పేరుని మార్చామన్న మీ సూచన బాగుంది.
అయితే ‘నా ఉద్దేశంలో ఏం చదవాలి ‘అని పేరు పెడితే అది కేవలం నా ఉద్దేశం మాత్రమే అవుతుంది. అది నా ఉద్దేశం కాదు. ఏం చదవాలి అనే వ్యాసాలని చదివిన తరవాత నేను ఏం చదవాలని భావించానో చదువరులు కూడా అదే అభిప్రాయానికి రావాలన్నది నా కోరిక. ఒకవేళ ఎవరయినా రానని భీష్మించుకుని కూర్చున్నా వారిని ఒప్పించి నా దారికి రప్పించ గలనన్నది నా నమ్మకం.

ఇట్లు
రాణి

pathakuraalu
pathakuraalu
9 years ago

అమ్మలు/అయ్యలు,

మండలీకం లో బాగా రాస్తారు అని పోగిదేకొలది మరి ఇలాగే రాస్తారు. మాడలీకం ముసుగులో అన్ని చేల్లిపోతాయి.

“ఖండిచండం” అంటే ఏమిటి? సరే, ఈ వెబ్ సైట్ లో మీరు ఖండిoచారు. అయితే ఏమిటి ప్రయోజనం? ఏమి జరుగుతుంది? నామిని అలా వ్రాయడం మానేస్తారా?

ఖండిచాదాలు ఆపి వీలయితే ఇలాంటి రచయితలకు ఒక బహిరంగ లేఖ రాయండి. లేదు, అది రచయితా జన్మ హక్కు అనుకుంటే మంచివి తీసుకుని, చెడ్డవి వదిలేయండి.

చివరగా, అతని కొడుకు పేరు ఏదైతే మనకేమిటి? పుడింగి అంటే అర్థం తెలియని మీరు ఒక వ్యక్తీ పుడింగి అదీ నెంబర్ ౧ పుడింగి అని అనడం వింతగా ఉంది. మీరు “ఏమి చదవాలి” అన్న వ్యాస పరంపర లో చర్చిద్దమన్నారు. దయ చేసి, పేరు ” నా ఉద్దేశ్యం లో ఏమి చదవాలి” అని మార్చగలరు. ఎందు కంటే ఏమి చదవాలి అన్నది పాఠకులు స్వంతం గ నిరంచుకోగలరు.

థాంక్స్,

పాఠకురాలు

శంకర్
శంకర్
9 years ago

నామిని గారు ఆయన భార్యని ఎలా పిలవాలనేది కూడా మీరే నిర్ణయిస్తే ఎలా మేడమ్స్? అని నేను అడిగితే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ అంతా కలిసి ఆయన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

సౌమ్య
సౌమ్య
9 years ago

రాణి గారూ!
నామిని తన భార్యని అలా పిలుచుకోవటానికి ,ఆమె పిలిపించుకోవటానికి వాళ్ళిద్దరి మధ్య వున్న సాన్నిహిత్యం కూడా ఒక కారణమేమో అని మనం ఆలోచించాలి.లేదా ఇలా పుస్తకాల్లో సంచలనం పుట్టించటానికే రాస్తూ ఉండొచ్చు.ఏదేమైనా స్త్రీని ఇలా సంబోధించటం సంస్కారం కాదు.

kalyani
kalyani
9 years ago

మేడం,
మేం వింటున్నాం కదా అని మీరు చెప్పేస్తున్నారు.ఆయన ఇంగ్లీషు పదాలు వాడటానికీ తెలుగువారి పరానుకరనకీ సంబంధం ఏమయినా ఉందా ?
ఇది రామాయణంతో పోల్చేతంత గొప్ప పుస్తకమా ? ఒక స్త్రీగా మీరు నామిని తన భార్య గురించి లం….లం….లం….అని చెప్పడాన్ని సమర్ధిస్తారా ?

usha
usha
9 years ago

ఆయన తన భార్య గురించి ఎన్నిసార్లు పేరు పెట్టి ప్రస్తావించారో అంతకంటే ఎక్కువసార్లు లం……. లం……లం……అంటూ సంభావించారు.
ఇది స్త్రీలు అందరూ తప్పకుండా ఖండించాలి. పేరున్న రచయితని కదా ఏం రాసినా చెల్లుబాటు అయిపోతుందని ఇలా బరితెగించి చేతికి వచ్చినట్టు రాసేస్తే ఎలా ? అడిగే వాళ్ళు లేరనేగా ?

రాణి
రాణి
9 years ago

కళ్యాణి గారూ,

నామిని పుస్తకానికీ పిల్లలకీ పెట్టుకున్న పేర్లలో ఇంగ్లీషు చొరబడ్డం చాలా సహజంగా జరిగిన ప్రక్రియ. దాని వెనక తెలుగువాడి స్వభావ సిద్ధమయిన పరానుకరణం అనే బలహీనత వుంది. అది తెలుగువారి భాషా పరమయిన అవనతికి మూలం.
దీని గురించి మనం ‘ఏం చదవాలి ?’ అనే వ్యాస పరంపరలో వివరంగా చర్చించుకుందాం.
అయితే..,
తెలుగు తీయదనాన్ని అంతగా అనుభవించి ఆనందించిన ఆయన కూడా తెలుగువాడి బలహీనతని అధిగమించలేక పోయారన్నదే నా బాధ.

మహీధర గారూ,
ఏ మనిషయినా తన సహజత్వాన్ని కోల్పోకుండా తన్ను తాను ఆవిష్కరించుకుంటే ఆ మనిషి.., మనుషులందరికీ నచ్చక తప్పదు. నగిషీలు చెక్కడానికీ బలవంతంగా అందరూ మెచ్చుకునేలా చెయ్యడానికీ ఆయన రాసింది రామాయణం కాదు కదా ? రామాయణాన్ని అంతమంది కవులు అన్ని రకాలుగా తిరగ రాసి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతున్నప్పటికీ రాముడిలో ఉన్న రాముడి లోపాల్ని సరిదిద్దలేకపోయారు. అలాగే నామిని పుస్తకాన్ని తిరగరాసిన కొద్దీ సహజత్వం పోయి చివరికి ఏ కావ్య శిల్పం గానో మిగిలిపోతుంది.
అలా మళ్ళీ మళ్ళీ సాపు ప్రతులు రాయలేదు కాబట్టే ఆయన చేసిన పనులు నచ్చినా నచ్చక పోయినా నామిని మాత్రం అందరికీ నచ్చుతాడు.
– రాణి

maheedhara
maheedhara
9 years ago

మీరెన్నయిన చెప్పండబ్బా,నాకు నామిని తెగ నచ్చేసినాడు.అంత ధైర్నంగా ఎవురన్నారాసేసుకుంటారా?

kalyani
kalyani
9 years ago

నామిని తన పుత్రుడికీ పుస్తకానికీ ఇంగ్లీషు పేర్లు పెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అనేది మీకే కాదు మాకూ అర్ధం కాలేదు.

రాణి
రాణి
9 years ago

మహీధరగారూ,
ఏ రచయితా అయినా సరే, వేరే వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడ్డం మొదలు పెడితే తప్ప రచయిత కాలేడు. కాబట్టీ, దాన్ని కేవలం నామినికి మాత్రమే కాదు, రచయితలందరికీ జన్మ హక్కుగా పరిగణించ వలసి వుంటుంది.
‘ఆయన ఇతరుల విషయల్లో వేలు పెట్టడం లేదా తన దృష్టి కోణంలోంచీ మాత్రమే చూసి వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు ?’
ఈ ప్రశ్నకి సమాధానాలు వెతకడం అంత సులభం కాదు. అందుకే, కొత్త కొలతలగురించి ప్రస్తావించ వలసి వచ్చింది. ఆ కొలమానాలు బయటికి రావాలంటే ఆయా రచయితలూ వ్యక్తులూ మాట్లాడటం మొదలు పెట్టాలి.

మహీధర
మహీధర
9 years ago

రాణీ గారూ ! ఆయన వ్యక్తిగత వ్యవహారాలు కాబట్టీ మనం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు.బాగానే వుంది కానీ మరి ఆ పుడింగి వేరేవాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఎందుకు వేలు పెట్టాడో మీకేమైనా అర్ధమయ్యిందా? అది అయన హక్కుగా మీరు భావిస్తున్నారా?ఆ సంగతి మీరెందుకు విశ్లేషించ లేదు?
-మహీధర