ప్రతీక

ప్రతీకాత్మకంగా ఒక దృశ్యకావ్యాన్ని విరచించు

ఒద్దికకు కొంత ప్రాధాన్యతనివ్వు

ఒప్పందాల వంతెనలకు నీళ్ళొదిలెయ్

పారే సెలయేళ్ళెలా పుట్టించగలననకు…

వాటి హోరు నీ చెవులను తాకినపుడు…

వాటి ప్రాబల్యం నిన్ను నిలువునా తడిపినపుడు…

నువ్వే నివ్వెరపోతావ్..

ఇంధ్రధనుస్సుల నుండి జలపాతాలు జాలువారినపుడు!!

నువ్వే ఆశ్చర్యపోతావ్..

వాటి సృష్టికర్త అని నీ పేరు ఉఛ్ఛరించబడినపుడు!!

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

One Response to ప్రతీక

  1. దడాల వెంకటేశ్వరరావు says:

    మీ కవిత అర్ధం కాక నివ్వెరపోయాను
    ఇంద్రధనస్సు నుండి జలపాతాలు
    జాలువారతాయని చదివి ఆశ్చర్య పోయాను