సంపాదకీయం

                            మే నెల దాటి  పోయినా  రోహిణి కార్తె  ప్రతాపం చూపిస్తూనే ఉంది . వడగాలులకు  ప్రాణాలు అవిసి పోతుంటే ఫ్యాన్ క్రింద కూర్చుని పని చేసుకోవటమే గగనం అయిపోతుంది . ఇంకా  ఎండలో పని చేసే కార్మికుల విషయం ? ఆలోచిస్తేనే మాడు పగిలినట్టుగా ఉంటుంది. ఇంక  చిన్న పిల్లలు కార్మికులుగా మారి పొట్ట నింపుకోవడానికి ఇంత ఎండల్లో పని చేస్తారు అన్న విషయమే మింగుడు పడనిది .
 
                            కొన్ని సార్లు పిల్లలు చేయలేని పనులు ఏమైనా ఉన్నాయా అని లెక్కలు వేస్తే , బహుశా ఏమి లేవనే చెప్పుకోవాలి . పెద్ద వాళ్ళు చేసే ప్రతి పనిని తమకు చేతనైనంత వరకూ వాళ్ళు కూడా చేస్తున్నారు . బట్టిలలో మట్టి మోస్తూ , ఇటుకలు  పేర్చుతూ , కాల్చిన ఇటుకల్ని  బయటకి తీస్తూ తమ దేహాలను , బాల్యాలను మసి బొగ్గుగా మార్చుకుంటున్నారు. వారిని అనే కంటే సమాజమే వాళ్ళని అలా మారుస్తుంది . మరి కొన్ని చోట్ల మంచి నీళ్ళ సీసాలు ఏరుతూ చెత్తలో ఇనుప ముక్కలు ఏరుకుంటూ , మట్టి మోస్తూ వాళ్ళు చేయని పనే లేదన్నట్లు కన్పిస్తారు . ఆడపిల్లలైతే గిన్నెలు తోముతూ బట్టలు ఉతుకుతూ యజమాని కాళ్ళు పడుతూ , తన కన్న ఒక ఏడాది తక్కువ వయసున్న పిల్లలను ఎత్తుకుని ఆడిస్తూ బాల్యాన్ని త్యాగం చేసి బలవంతపు పెద్దరికాన్ని మోస్తున్నారు .

                    కొన్ని స్వచ్చంద సంస్థలు బాల కార్మికులని గుర్తించి వారి వయసుకి తగిన తరగతిలో చేర్చి నిర్భంద విద్యని అందిస్తున్నాయి . తల్లిదండ్రులు సైతం అప్పటికప్పుడు దీనికి ఒప్పుకున్నట్లు నటించినా కొన్ని రోజులు పోయాక మళ్ళి వృత్తులకి  పంపిస్తున్నారు . ఇటువంటి  సందర్భాలలో తల్లిదండ్రులను నిలదీస్తే మనకు దొరికే సమాధానం ఒకటే . అధిక సంతానం , అనారోగ్యాలు , ఇంటి యాజమాని ఒక్కడే పని చేయాల్సి రావడం తమ జీవనానికి సరిపడా డబ్బు లేకపోవడం , పస్తుండడం ప్రధానమైన కారాణాలు కాగా , ఉచిత విద్య అనుకున్నప్పటికీ చదువుకి డబ్బు ఖర్చు పెట్టాల్సిరావడం కూడా భారంగా పరిగణించడం కారణాలుగా చెబుతున్నారు . డబ్బు వెచ్చించి  చదువుకోవడం కంటే కూలికి వెళ్లి డబ్బు సంపాదించడంమే సులువుగా ఉండడంతో పిల్లల బాల్యాన్ని కార్మికులుగా మారుస్తుంది .

                               తల్లిదండ్రులు  , పిల్లల్ని పనిలో పెట్టుకునే యజమానులు వాదించే విషయం- ఏదో ఒక విధంగా వారిని ఆర్ధికంగా ఆదుకుంటూ వారి కడుపు నింపుతున్నాము అంటారు . వాస్తవానికి బాల కార్మికులు చదువుకోకుండా పనిలోకి వెళ్ళడం వలన వారు నిరక్షరాస్యులవుతారు . ఈ పరిస్థితి మళ్ళీ   ఇంకో తరం నిరక్షరాస్యులను తయారు చేయడానికి దోహదపడుతుంది . ఇది  ఇలా  కొనసాగుతూనే ఉంటుంది . చిన్నప్పటి నుండి శారీరక కష్టం చేయటం వలన , పోషకాహారం లేకపోవటం వలన త్వరగా శారీరక సమస్యలు మొదలై అనారోగ్య బారిన పడతారు . తమకు తాము భారంగా మారి ఇతరులపై  ఆధారపడే పరిస్థితికి వస్తారు . మళ్ళీ  తమ పిల్లల్ని బాలకార్మికులుగా అంగీకరించడానికి  సిద్దపడతారు . ఎక్కువగా బాల కార్మికులు గ్రామీణ ప్రాంతాల నుంచి సామాజికంగా అట్టడుగు వర్గాల నుంచి తయారు చేయబడుతున్నారు .

                            ఆర్టికల్ 21-A ప్రకారం ఆరేళ్ళ నుంచి 14 ఏళ్ళ లోపు పిల్లలందరూ పాఠశాలలో చదువుకోవాలనే రాజ్యంగపు హక్కు ఎక్కడా ఆమలువుతున్నట్లు కనిపించటం లేదు . దీనిలో కేవలం ప్రభుత్వ బాధ్యతే అని వదిలేస్తే నష్టపోయేది సమాజమే.స్వచ్చంద   సంస్థలు , తల్లిదండ్రులు , పిల్లల్ని పనిలో పెట్టుకునే యాజమానులు కూడా చిత్తశుద్దితో పిల్లల బాల్యాన్ని వారికే కానుకగా యిస్తే తప్ప పరిస్థితి మారదు . లేదంటే ప్రతి ఏడాది బాల కార్మిక దినాలు , రికార్డులలో లెక్కలు షరామాములే …

హేమలత పుట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో