సమకాలీనం- ఇది తప్ప రాసేందుకేమీ కనిపించడం లేదు!

 
      ఎటు చూసినా సమకాలీనం అంటూ ఇంకే విషయమూ రాయడానికి కనబడ్డం లేదు. భారత జాతి యావత్తూ నేడు తల దించుకుంటున్న అత్యాచారాల పర్వం తప్ప! వార్తాపత్రికలు తెప్పించుకోకూడదని జనాలు నిర్ణయించేసుకుంటున్నారు. ఉదయాన్నే ఏ భయంకరమైన వార్త చదవాల్సివస్తుందోనని భయం! నేరాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ తో టీవీ చానల్స్ కు తీరిక లేదు! అవి పెడితే, మరీ ఘోరం! రాత్రికి నిద్ర పట్టే దిక్కు ఉండదు. ఫేస్ బుక్ అప్ డేట్స్ అంటే మరీ భయం వేస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా జరిగిన ఘోరాన్ని వివరించేస్తుంటారు. దేశానికేమయ్యిందని తలలు బ్రద్దలుకొట్టేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలను దుమ్మెత్తి పోసేస్తుంటారు!
కళ్ళెదురుగా ఒక ఆడ పుట్టుక అత్యాచారం సమయంలో అనుభవించిన నరకాన్ని, అనంతరం ఏ ఆసుపత్రిలోనో, రోడ్డు ప్రక్కనో పడే వ్యధనూ మన మెదడు ఊరకుండక, నిప్పుల వర్షంగా కురిపిస్తుంది. ఈ నెల జీవవైవిధ్యం గురించి, మన బాధ్యతల గురించి రాద్దామనుకున్నాను! మే డే కదా! అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ మీద ఒక నివేదిక తయారుచేద్దామనుకున్నాను. బుర్ర పనిచేస్తే కదా! ఒకటే వేదన! పసిబిడ్డ గుర్తొచ్చిన కొద్దీ ఒకటే రోదన!
వాడి ముఖాన్ని కప్పి తీసుకెళ్తున్న పోలీసులను ప్రక్కకునెట్టి అక్కడున్న జనం వాడ్నెందుకు అక్కడికక్కడ చంపెయ్యలేదు? పసి పిల్లల్ని ఆడుకోవడానికి కూడా బయట వదల్లేని అడవిలా తయారయ్యిందా మన దేశం? పర్వర్షన్ పూర్తిగా నిండిన క్రూర మృగాల మధ్య నివసిస్తున్నామా మనం? సిటీలు సోషల్లీ పొల్యూట్ అయిపోయాయి మేడం… ఏ పల్లెటూరికో వెళ్ళి బ్రతకాలేమో అన్న ఒక స్నేహితుని మాటకు నేను సమాధానం ఏం చెప్పను? పల్లెటూర్లలో జరిగే అత్యాచారాల గురించి ఆయన చదివి ఉండలేదేమో!
రక్షణ ఎక్కడా లేదు బాబోయ్! నేను భారత దేశ పౌరుడ్ని/పౌరురాల్ని అని చెప్పుకోవాలంటే సిగ్గనిపిస్తోంది! సల సల మరిగే మనందరి ఆవేశం ఏ మాత్రం పరిస్థితులను మార్చగలుగుతోంది?
పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోతున్నారు. ఎక్కడ ఏ నేరం జరిగినా, వారి వైఫల్యాన్ని గురించే చర్చకొస్తుందని ఇప్పుడిహ వారే బాధితులకు లంచం ఇస్తున్నారు. సెన్సివిటీ పూర్తిగా కోల్పోయిన శాఖగా పోలీసు వ్యవస్థకు ఎప్పుడో గుర్తింపు వచ్చేసిందిగా! ఇపుడు మెదడు మోకాల్లోకి వచ్చిన శాఖగా కూడా గుర్తింపు వస్తుంది!
మానిటరింగ్ వ్యవస్థకు కావల్సిన ఏ సదుపాయమూ పూర్తిగా లేని వ్యవస్థ ఏం పని చేయగలదు? అదీ, ఆ వ్యవస్థ ప్రజల రక్షణ కొరకు ఏర్పడినదైతే ఇక దాని పనితీరు ఇంతకన్నా ఘోరంగా ఉంటుందా? దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లు, అక్కడున్న సిబ్బంది సంఖ్య, ఆయా పోలీసు స్టేషన్లకు సమకూర్చబడిన సాంకేతిక వసతులు, మహిళా పోలీసుల సంఖ్య ఇతరాత్రా విషయాలపై ఈ మధ్య నవాజ్ కోత్వాల్ తో మాట్లాడినపుడు, పోలీస్ రిఫార్మ్స్ కోసం సంవత్సరాలుగా శ్రమిస్తున్న సిహెచ్ ఆర్ ఐ గురించి తెలుసుకుని, వారిని సంప్రదించి పోలీస్ రిఫార్మ్స్ గురించి ఒక నెలంతా స్టడీ చేసాను. భారతదేశ గణాంకాలను పరిశీలించిన కొద్దీ, మన వాళ్ళు రక్షక భట సంస్కరణలను రాజకీయ లబ్ధి కోసం ఎలా ప్రక్కన పెట్టారో, ఆఖరికి సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఎలా మొండిగా వ్యవహరిస్తున్నారో తెలుసుకున్న కొద్దీ రాజకీయ వ్యవస్థ అంటే అసహ్యం పెరిగిపోతుంది.
లేమెన్ కి ( సాధారణ పౌరుడికి) ఇవన్నీ తెలుసా? మూల కారణాల జోలికి వెళ్ళకుండా, జరిగే అనర్థాలను మాత్రమే చూసే మనం ఈ మూల కారణానికి సమాధానాన్ని ప్రభుత్వం నుండి పొందలేమా? పొందలేని పక్షంలో మన పౌరసత్వానికి అర్థమేముంది?

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

One Response to సమకాలీనం- ఇది తప్ప రాసేందుకేమీ కనిపించడం లేదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో